- దాచుకోవడం, దోచుకోవడమే ఆయన నైజం
- కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం సిగ్గుచేటు
- చంద్రబాబుపై విమర్శలు పిచ్చికి పరాకాష్ట
- మంత్రి గుమ్మడి సంధ్యారాణి ధ్వజం
మంగళగిరి(చైతన్యరథం): అబద్ధాలలో ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిన వ్యక్తి జగన్‌రెడ్డి అని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వ్యాఖ్యానించారు. శుక్ర వారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జగ న్‌రెడ్డి ఐదేళ్ల కాలంలో పార్టీలో ఎవరినీ కలవలేదని, ఎవరితో మాట్లాడలేదని తానే ఒప్పు కుంటున్నాడని, దాచుకోవడం దోచుకోవడం అంటే ఏంటో చూపించడానికే జగన్ 2.0 అవతారం ఎత్తబోతున్నాడని మండిపడ్డారు. పరిపాలనాదక్షుడైన చంద్రబాబుపై విమర్శలు చేయడం జగన్ పిచ్చికి పరాకాష్ట అని దుయ్యబట్టారు. తాను దోచుకున్న సొమ్ము చంద్ర బాబు దోచుకున్నట్లుగా.. తన అప్పులు కూటమి ప్రభుత్వం చేసినట్లు అబద్ధాలు చెబుతూ దుష్ప్రచారం చేయటం సిగ్గుచేటన్నారు. 20,000 కోట్లు గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జగన్‌రెడ్డి ప్రభుత్వం చేసినవేనని చెప్పారు. ఎన్నికల కోడ్ సమయంలో తెచ్చిన అప్పులతో రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. జగన్‌రెడ్డిలాగా చంద్రబాబు రుషికొండ ప్యాలెస్‌లు కట్టుకోలేదు.
ఇంటి చుట్టూ కోట్లు పెట్టి ఇనుప కంచెలు కట్టు కోలేదన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టి 8 లక్షల కోట్ల రాష్ట్ర సంపద దోచుకున్నాడని ధ్వజమెత్తారు. ఐదేళ్లలో విపత్తు నిధులు, పోలవరం, గ్రామపంచాయతీలు సహా కేంద్రం ఇచ్చిన నిధులన్నీ దారి మళ్లించి.. డ్వాక్రా మహిళలు పొదుపు సొమ్ము రూ.2,100 కోట్ల సైతం మింగేసిన తిమింగలాలని మండిపడ్డారు. ఐదేళ్ల పాటు వేలాది మంది మహిళలపై అరాచకం చేసినా ఒక్కరిపై జగన్ చర్యలు తీసుకోలేదని సొంత తల్లికి, చెల్లికి అన్యాయం చేసిన జగన్‌రెడ్డి ఈ రోజు నీతులు చెప్పడం విడ్డూరమన్నారు. గత ఐదేళ్లు తన నాయ కులతో బూతులు మాట్లాడిరచిన జగన్‌రెడ్డి ఈ రోజు నీతులు చెబున్నారని మండిపడ్డారు. మీలా అసహ్యంగా, అవమానకరంగా తాము మాట్లాడలేమని, చంద్రబాబు పార్టీ నాయ కులకు క్రమశిక్షణ, నీతి నిజాయితీ నేర్పించారన్నారు. అసెంబ్లీకి రావడంపై జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు స్పీకర్‌ను అడగమంటున్నాడని, 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై సభలో చర్చించకపోతే రాజీనామా చేయాలని హితవుపలికారు. జగన్ బయటకు రావాలంటే శవం కావాలి. శవాలతోనే రాజకీయం చేస్తారని ఐదేళ్లలో రాష్ట్రంలో అరాచకాలు, నేరాలు, ఘోరాలు చెప్పనలవికానివని, చంపేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని జగన్ పక్కన పెట్టుకుని తిరుగుతారన్నారు.
జగన్‌రెడ్డి పాలనలో సర్పంచులకు, స్థానిక సంస్థలకు అధికారం లేక పనులు సాగని పరిస్థితని, ఐదేళ్లలో ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా జగన్‌రెడ్డి మొహం చూపించలేదన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.4000 పెన్షన్ చంద్రబాబు ఇస్తు న్నారని గుర్తుచేశారు. ఏడు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ఈ ఏడు నెలల్లో ప్రజలెవరైనా ఇబ్బందులున్నా యని జగన్‌కి చెప్పారా అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలుపై ధర్నాకి పిలుపునిస్తే ప్రజలెవరైనా వచ్చారా అని ప్రశ్నించారు. ఎందుకంటే ధాన్యం కొన్న సొమ్మును 24 గంటల్లోనే రైతులకు జమ అయ్యాయి..రైతులకు ఇబ్బందులు లేవు కాబట్టే రాలేదని హితవుపలికారు. విద్యార్థులకు ఫీజు బకాయిలు పెట్టింది మీరే, ధర్నాకు పిలుపుని చ్చేది మీరే అని దుయ్యబట్టారు. మీరు పెట్టిన బకాయిలు తీర్చడానికే సగం సొమ్ము ఖర్చవుతుందన్నారు. జగన్ హయాంలో రోడ్ కనెక్టివిటీ లేక గిరిజన ప్రాంతాలలో గర్భిణులు అష్టకష్టాలు పడ్డారని, చంద్రబాబు ప్రభుత్వ మొచ్చాక 350 కోట్లతో గిరిజ న గ్రామాలలో రహదారి సౌకర్యం కల్పించినట్లు చెప్పారు.
గిరిజనులను జగన్‌రెడ్డి చిన్న చూపు చూసి వసతిగృహాలను నిర్వీర్యం చేస్తే కూటమి ప్రభుత్వ మొచ్చాక గిరిజన గ్రామాల్లో వసతిగృహాలు పునరుద్ధరించి అనేక సేవలందిస్తుందన్నారు. ఐటీడీ ఏలను, ట్రైకార్ రుణాలను కూటమి ప్రభుత్వం పునరుద్ధరిం చిందని, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్‌తో పాటు అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. జగన్‌రెడ్డి దొంగ మాటలు, కట్టుకథలు మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. తల్లికి చెల్లికి అన్యాయం చేసి బాబాయ్ హత్యని గుండెపోటుగా చిత్రీకరించిన జగన్ విశ్వసనీయత గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షల కోసం పనిచేయడం నిజమైన విశ్వసనీయత అని కష్టపడి పనిచేయడానికి, నిజాయి తీకి, విశ్వసనీయతకు నిలువుటద్దం చంద్రబాబు అని స్పష్టం చేశారు. జగన్‌కు విశ్వసనీయత లేకే ఆ పార్టీలో ఎవరూ ఇమడలేక బయటికొస్తున్నారని వ్యాఖ్యానించారు.