- దశాబ్దాల ఫ్లోరైడ్ సమస్యకూ పరిష్కారం
- జగన్‌రెడ్డి పూర్తి కాకుండానే ప్రారంభించారు
- రైతులను మోసం, దగా చేశాడు
- మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజం
పాలకొల్లు(చైతన్యరథం): 30 ఏళ్ల క్రితం వెలిగొండ ప్రాజెక్టుకు భూమిపూజ చేసిన చంద్రబాబే ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు నీరందించబోతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. దశాబ్దాలుగా నెలకొన్న ఫ్లోరైడ్ సమస్యకూ ముగింపు పలుకుతుంది. గొడ్డలి పార్టీ నాయకుడు రూ.5 వేల కోట్లకు పైగా పనులు మిగిలి ఉన్నా వెలిగొండను జాతికి అంకితం చేసి వెనుకబడిన ప్రకాశం జిల్లా రైతులను మోసం, దగా చేశాడు. అబద్ధాలకు, ఫేక్ ప్రచారాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్‌రెడ్డి. తన సాక్షి పత్రిక, టీవీలోనూ టన్నుల, టన్నుల అబద్ధాలు అచ్చులు వేసి ప్రచారం చేసుకుంటున్నాడు. పత్రికలోనూ, ఛానెల్‌లోనూ రోత రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. జగన్ క్రెడిట్‌ను ప్రపంచంలో ఎవరూ చోరీ చేయలేరు. దోపిడీలకు, హత్యలకు, కిరాతకాలకు, అబద్ధాలకు, వంచనకు జగన్ పేటెంట్ రైట్ తీసు కున్నాడు. నిర్వాసితులకు రూ.900 కోట్లకు పైగా పరిహారం అం దించాల్సి ఉండగా వారికి ఒక్క రూపాయి ఇవ్వలేదు. నాడు జిల్లా రైతులను, నిర్వాసితులను హౌస్ అరెస్టులు, 144 సెక్షన్ పెట్టి పరదాల చాటున వెలిగొండను జాతికి అంకితం చేశాడని ధ్వజమెత్తారు.
తాడేపల్లి ప్యాలెస్ ముందు ధర్నా చేయాలి
రైతులను ఎందుకు మోసగించారని మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల వైసీపీ నేతలు తాడేపల్లి ప్యాలెస్ ముందు ధర్నా చేయాలి. ఐదేళ్ల గొడ్డలి పార్టీ పాలనలో 792 కోట్లు, అనగా 20 శాతం పనులు చేశామని లెక్కల్లో చూపించారు. నేడు కూటమి ప్రభుత్వం 23 నెలల్లోనే రూ.759 కోట్ల పనులు పూర్తి చేశాం. నేడు 23 నెలల్లోనే టన్నెల్-2లో 4,924 మీటర్లు బెంచిం గ్, 5,677 లైనింగ్ పూర్తి చేశాం. మిగిలిన 1263 మీటర్ల లైనింగ్ జూలై చివరి నాటికి పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయి. టన్నెల్-2లో 12 కి.మీ దగ్గర చిక్కుకున్న టీబీఎం తొలగించ áకుండా చుక్కునీరు కూడా ఇవ్వలేమని తెలిసినా ఐదేళ్లలో ఎటువంటి చర్యలూ చేపట్టలేదు. కూటమి ప్రభుత్వంలో హైకోర్టు అనుమతితో టీబీఎం తొలగింపు పనులు చేపట్టామని తెలిపారు. టన్నెల్-1లో అడ్డుగా ఉన్న 1.2 లక్షల క్యూబిక్ మీటర్ల మక్ తొలగింపు పనులలో ఇప్పటికి 40 వేల క్యూబిక్ మీటర్లు తొల గించాం. నేడు రూ.456 కోట్లు కేటాయించి ఫీడర్ కెనాల్‌లో 5.3 కి.మీ రిటైనింగ్ వాల్ పనులు జనవరిలో ప్రారంభించి 5 నెలల్లో పూర్తి చేశాం. మెంధా తుఫాన్‌కు ఫీడర్ కెనాల్‌లో పడిన భారీ గండికి సీసీ వాల్ నిర్మించి పూర్తి చేస్తున్నామని వివరించారు. నల్లమలసాగర్ రిజర్వాయర్‌లో నీళ్లు నింపడానికి, నిర్వాసితుల పునరావాసానికి అదనపు బడ్జెట్‌లో రూ.903 కోట్లు కేటా యిం చాం. ప్రస్తుత అంచనాల ప్రకారం ఇంకా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.3844 కోట్లు అవసరమని తెలిపారు.














