- రూ.2,300 కోట్లతో పలుజోన్లలో నిర్మాణాలు
- జనవరి 22 తుది గడువుగా ప్రభుత్వం నిర్ణయం
అమరావతి(చైతన్యరథం): రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయడమే లక్ష్యంగా సీఆర్‌డీఏ ముందుకు వెళుతోంది. అందులో భాగంగా అమరావతి లో పలు నిర్మాణ పనులకు ఏపీ సీఆర్‌డీఏ, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) టెండర్లను పిలిచింది. రూ.2,300 కోట్లకు బుధవారం టెండర్లను ఆహ్వానించిం ది. సీఆర్‌డీఏ ద్వారా రూ.1470 కోట్లు, ఏడీసీ ద్వారా రూ.852 కోట్లతో వివిధ పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచాయి. టెండర్లు ఫైనలైజ్ అయ్యాక పలు జోన్లలో రహదారులు, తాగునీటి సరఫరా, పవర్ తదితర ట్రంక్ ఇన్‌ఫ్రా పనులు చేపట్టనున్నారు. అలాగే మరికొన్ని జోన్లలో నీరుకొండ రిజర్వాయర్‌కు సంబంధించి బ్యాలెన్స్ ఫ్లడ్ మిటిగేషన్ నిర్మాణ పనులకు సైతం టెండర్లను పిలిచాయి. అయితే ఈ టెండర్లు వేసేందుకు తుది గడువు జనవరి 22గా ప్రభుత్వం నిర్ణయించింది. సంక్రాంతి వరకు సుమారు రూ.31 వేల కోట్ల మేర నిర్మాణాలకు టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది.