- బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ రూపకల్పనకు మద్దతు ఇవ్వండి
- పెప్సికో మాజీ సీఈవోతో భేటీలో మంత్రి నారా లోకేష్
లాస్ వెగాస్ (యుఎస్ఎ):పెప్సికో మాజీ చైర్మన్, మాజీ సీఈవో ఇంద్రా నూయి తో రాష్ట్ర విద్య, ఐటీి మంత్రి నారా లోకేష్ లాస్ వెగాస్‌లో ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్ ప్రాంగణంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలుచేస్తూ వేగవంతమైన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోంది.. టెక్నాలజీ, తయారీ రంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఏపీ ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాత్మక కృషి లో భాగస్వాములు కండి.. స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించేందుకు మేం చేస్తున్న ప్రయ త్నాలకు మద్దతునివ్వాలని కోరారు. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, హరిత కార్య క్రమాలు, పర్యావరణ హిత పారిశ్రామిక విధానాలు అమలుచేస్తున్న ఆంధ్రప్రదేశ్ నిబ ద్ధతను పారిశ్రామిక సమాజానికి చాటిచెప్పాలని కోరారు.
మహిళా ప్రాతినిధ్యం పెంపుపై సలహాలివ్వండి
మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో మేం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. నాయకత్వం, సాంకేతికతలో లింగ ప్రాతినిధ్యాన్ని పెంచే లక్ష్యంతో రాష్ట్రం తరపున కార్యక్రమాలను రూపొందించండి. లింగ వైవిధ్యం సంస్థాగత విజయాన్ని ఎలా మెరు గుపరుస్తుందో చర్చించండి. వివిధ రంగాలలో మహిళలకు సాధికారత కల్పించడంపై మీ ఆలోచనలను మాతో పంచుకోండి. ప్రజారోగ్యానికి సంబంధించి ప్రత్యేకించి వెల్ నెస్ కార్యక్రమాలు, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇందులో కార్పొరేట్, ప్రభుత్వ రంగాల భాగస్వామ్యం ద్వారా ఆరోగ్యవంతమైన సమా జాన్ని నిర్మించేందుకు సరికొత్త మార్గాలను అన్వేషించాలని విజ్ఞప్తిచేశారు.
బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ రూపకల్పనలో మద్దతునివ్వండి
విద్య, సాంకేతిక ఆధారిత నైపుణ్యాల అభివృద్ధి ద్వారా యువతకు సాధికారత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. యువ నిపుణులు వారి కెరీర్లో విజయం సాధించడానికి అవసరమైన మెంటారింగ్ ప్రోగ్రామ్‌లను రూపొందించండి. రాష్ట్ర సాంకేతిక పర్యావరణ వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలను ప్రత్యక్షంగా చూడడానికి రాష్ట్రాన్ని సందర్శించాలని కోరారు. ఏపీలో పెట్టుబడులను ప్రోత్సహించడం, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ రూపకల్పనలో మీ మద్దతు కోసం ఎదురు చూస్తున్నామని వివరించారు. లోకేష్ ప్రతిపాదనలపై ఇంద్రా నూయి సానుకూలంగా స్పందిస్తూ ఏపీలో పెట్టుబడులకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.