చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జనవరిలో సైకిల్‌ స్పీడ్‌ పెరిగి ప్యాన్‌ రెక్కలు తుక్కు..తుక్కు..

జగన్‌రెడ్డి ఇచ్చిన హామీలపై ఈ పది ప్రశ్నలకు సమాధానం చెప్పగలడా?

by చైతన్యరధం
Dec 16, 2023 at 9:45am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జనవరిలో సైకిల్‌ స్పీడ్‌ పెరిగి ప్యాన్‌ రెక్కలు తుక్కు..తుక్కు..
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  •  చిల్లు పడిన వైసిపి నావ త్వరలోనే మునిగిపోతుంది
  • తల్లికిచెల్లికి సమయమివ్వనివాడు ఎమ్మెల్యేలను కలుస్తాడా?
  • జగన్‌రెడ్డి ఇచ్చిన హామీలపై ఈ పది ప్రశ్నలకు సమాధానం చెప్పగలడా?
  • టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు
  • టీడీపీలోకి ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు ఆరు నియోజకవర్గాలకు చెందిన వైసీసీ కార్యర్తల చేరిక

అమరావతి: జనవరిలో సైకిల్‌ స్పీడ్‌ పెరిగి ఫ్యాన్‌ రెక్కలను విరక్కొడుతుందని మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చిల్లు పడిన వైకాపా నావ త్వరలోనే మునిగిపోతుందని, 3 నెలల తర్వాత జగన్‌ ఎక్కడికి పోతాడో తెలీదని ఎద్దేవా చేశారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరూ తమ జీవితాలకు భద్రత కోరుకుంటున్నారని, కానీ అపరిచితుడు లాంటి జగన్‌ చెప్పిందేదీ చేయడని విమర్శలు గుప్పించారు. శుక్రవారం మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో ఆరు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో టీడీపీలో చేరారు. ఆ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తల్లి, చెల్లికి కూడా సమయ ఇవ్వని వాడు ఇక ఎమ్మెల్యేలకేం టైమ్‌ ఇస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం మీదకు ఓ అరాచక సైన్యాన్ని జగన్‌ వదిలిపెట్టాడని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను కాపాడేందుకే తెలుగుదేశం పార్టీ – జనసేన కలిసి ఎన్నికలకు వస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపాకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని, అన్ని సంప్రదాయాలను సర్వ నాశనం చేసిన దుర్మార్గుడు జగన్‌మోహన్‌ రెడ్డి అని ధ్వజమెత్తారు. ఎంత మందిని మార్చినా వైకాపాను ఓడిరచాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని అన్నారు. బీసీని గెలిపించాలంటే జగన్‌ కేటాయించాల్సిన మొదటి సీటు పులివెందులదేనని పేర్కొన్నారు. 5 ఏళ్ల క్రితం నాటికి ఇప్పటికీ ఎవరి జీవన ప్రమాణాలైనా మారాయా లేదా అని ప్రతిఒక్కరూ ఆలోచించుకోవాలని చంద్రబాబు కోకారు. డీఎస్సీ పెట్టి ఒక్క టీచర్‌ ఉద్యోగం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని, విద్యా ప్రమాణాలు పెరుగుతున్నాయని జగన్‌ ఎలా చెప్తాడని చంద్రబాబు ప్రశ్నించారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి, గంజాయి మాత్రం ఇస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో ఘనంగా సాగయ్యే పంట గంజాయి మాత్రమేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 5 ఏళ్ల టీడీపీ పాలనతో 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనను ప్రజలు బెరీజు వేసుకోవాలని చంద్రబాబు కోరారు. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌ తీసుకొస్తా అని హామీ ఇచ్చారని, అవన్నీ ఏమయ్యాయని జగన్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. టీడీపీ అధికారంలో ఉంటే 2020లో పోలవరం పూర్తి చేసే వాళ్లమని, తన స్వార్థం కోసం పోలవరం ప్రాజెక్ట్‌కి నష్టం చేకూర్చారని విరుచుకుపడ్డారు. జనవరిలో ప్రతి ఎడాది జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తానని అని చెప్పి కనీసం ఒక్క ఎడాది కూడా ఇవ్వలేదని ప్రస్తావించారు. జగన్‌కు రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదని అన్నారు. రాష్ట్రంలో జగన్‌ ఇచ్చిన ఒక హామీ కూడా నెరవేర్చలేదన్నారు. తెలుగుదేశం అధికారం లోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల న్యాయపరమైన కోరికలు పరిష్కరిస్తామని అన్నారు.

హామీలు అన్నీ నెరవేర్చాను అని చెపుతున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిక మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పది ప్రశ్నలు సంధించారు. ముందు ఈ పది ప్రధాన హామీలకు సమాధానం చెప్పాలంటూ నిలదీశారు.

సంబంధితవార్తలు

పరిశ్రమలకు కేరాఫ్‌గా రాష్ట్రం అదే మన సంకల్పం కావాలి: సీఎం చంద్రబాబు

తెలుగుజాతి ఉన్నంతవరకూ నిలిచి ఉంటుంది

తొలి అడుగు పడింది

ఆ 10 ప్రశ్నలు ఇవే..

  1. కేంద్రం మెడలు వంచి సాధిస్తామన్న ప్రత్యేక హోదా ఏమైంది?. నాలుగున్నరేళ్లలో ఎంత వంచాడు?. 31 మంది ఎంపీలు ఉన్నారు కదా.. వాళ్లు ఎందుకు పైరవీలకా? జగన్‌ మాటలు కోటలు దాటాయి…కానీ చేతలు గడప దాటలేదు.
  2. 2020 నాటికి పూర్తి అవ్వాల్సిన పోలవరం ప్రాజెక్టుని నాశనం చేశావు. పోలవరాన్ని గోదాట్లో ముంచాడు. సమాధానం ఉందా జగన్‌ రెడ్డి?
  3. ఎన్నికలకు ముందు ప్రతి ఏటా జాబ్‌ క్యాలెండర్‌ అన్నాడా…లేదా? ఒక్కటైనా ఇచ్చాడా?
  4. నేను 14 ఏళ్లలో 11 డీఎస్సీల ద్వారా 1.50 లక్షల టీచర్‌ పోస్టులు భర్తీ చేశాను. ఏటా డీఎస్సీ అని హామీనిచ్చి ఐదేళ్లలో నువ్వు ఒక్క డీఎస్సీ పెట్టావా?. రాష్ట్రంలో నిరుద్యోగం రేటు 24 శాతం అని కేంద్రం తేల్చింది. నిరుద్యోగాంధ్రగా మార్చి…దేశంలో నెంబర్‌ 1 చేశావు…యువత జీవితాలు నాశనం? ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ….యువతకు గంజాయి ఇచ్చాడు.
  5. మద్య నిషేధం చేయకపోతే…..ఓట్లు అడగను అన్నావు…అన్నావా లేదా….మీరి ఏ ముహం పెట్టుకుని ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ అని బయలుదేరావ్‌?
  6. మద్యనిషేధం అని చెప్పి….చేశావా?
  7. వారంలో సీపీఎస్‌ రద్దు అన్నావా లేదా….ఇంకా వారం కాలేదా? మాట మీద నిలబడడం అంటే ఇదేనా?
  8. ఉచిత ఇసుక ఇస్తాను అన్నావా లేదా? ఇచ్చావా?
  9. రాజధానిగా అమరావతి కి మద్దతు ఇచ్చి ఇప్పుడు మాట తప్పావా లేదా?
  10. బాదుడే బాదుడు అని నాడు రాగాలు తీశావు. చార్జీలు తగ్గిస్తాను అని చెప్పావా లేదా? నేడు అధికారంలోకి వచ్చిన తరవాత కరెంట్‌ చార్జీలు పెంచాడా లేదా? ముందు జగన్‌రెడ్డి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పి తర్వాత హామీల అమలు గురించి మాట్లాడాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

భారీ సంఖ్యలో వైసీపీ నుండి టీడీపీలోకి చేరిక

వైసీపీ నుండి ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు ఆరు నియోజకవర్గాల నుండి దాదాపు 4500 మంది నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. రామచంద్రాపురం, తాడికొండ, తంబళ్లపల్లి, ఉదయగిరి, మంత్రాలయం, కోవూరు నియోజకవర్గాల నుంచి వేల సంఖ్యలో నేతలు, కార్యకర్తలు చేరారు. 6 నియోజకవర్గాల నుంచి దాదాపు 4500 మంది ద్వితియ శ్రేణి నేతలు చేరారు.

తాడికొండ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే శ్రీదేవితోపాటు ఆమె అనుచరులు 500 మంది చేరారు. ఉదయగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డితోపాటు అనుచరులు సుమారు 100 మంది పార్టీలో చేరారు. వారిలో స్వయంపాకుల శాంత కుమారి, వైసీపీ నియోజకవర్గ ప్రచార కార్యదర్శి, వైసీపీ జిల్లా కార్యదర్శి వర్ర చిన్న బ్రహ్మాయ్య, దుత్తలూరు మండలం వైసిపి యూత్‌ అధ్యక్షుడు కంభం రఘునాధ్‌ రెడ్డి. వ్యాపారులు పర్చూరి సుబ్బారావు, మాజీ ఎంపిటిసీ జి. రమణయ్య, సీనియర్‌ నేతలు కలవకూరి నరసింహారావు, మల్లినేని రమణయ్య, వైసిపి ఎస్సీ సెల్‌ లీడర్‌ చేవూరి రవితేజ  ఉన్నారు. రామచంద్రపురం నియోజకవర్గం నుంచి టీడీపీ ఇన్‌చార్జ్‌ రెడ్డి సుబ్రమణ్యం ఆధ్వర్యంలో 450 మంది పార్టీలో చేరారు. వీరిలో వివిధ పార్టీలకు చెందిన మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, యూత్‌ లీడర్లు, వ్యాపారవేత్తలు ఉన్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరిపల్లి జయచంద్ర రెడ్డి తో పాటు 2 వేల మంది టీడీపీలో చేరారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ భూదేటి రాధయ్య టీడీపీలో చేరారు. అలాగే కొవూరు టీడీపీ ఇంఛార్జ్‌ పోలంరెడ్డి దినేష్‌ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున చేరికలు జరిగాయి.  కరేటి శ్రీనివాస్‌, చేవురి రాంప్రసాద్‌, నంద కుమార్‌, గుమ్మా సుధాకర్‌ వంటి నేతలు పార్టీలో చేరారు. మంత్రాలయం నియోజకవర్గం నుంచి మాజీ కేడీసీసీ చైర్మన్‌ మాధవరం రామిరెడ్డి(దివంగత) కుమారులు పార్టీలో చేరారు.  రామిరెడ్డి గారి కుమారులు…నల్లగోని రాఘవేంద్రరెడ్డితో పాటు అతని సోదరులు రఘనాధ్‌ రెడ్డి, రామకృష్ణారెడ్డి, రాకేష్‌ రెడ్డి, రాజా రెడ్డి పార్టీలో చేరారు.  వీరితో పాటు సుమారు 1500 మంది పైగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. మాధవరం సర్పంచ్‌ యాకోబు, మాధవరం ఎంపీటీసీ ఈరన్న, ఉరుకుంద ఎంపీటీసీ పోతులయ్య,  రిటైర్డ్‌ సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ విజయకృష్ణ, ఉరుకుంద ఈరన్న ట్రస్ట్‌ బోర్డు మాజీ మెంబెర్‌ చిరంజీవి, పలువురు వార్డు మెంబర్లు పార్టీలో చేరారు.

ఈ సందర్బంగా పార్టీలో చేరిన నేతలు మాట్లాడుతూ వైసీపీ పూర్తిగా ప్రజా వ్యతరేక విధానాలకు పాల్పడుతోందన్నారు. చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని, తమ నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకుంటామని చెప్పారు. వారు ఇంకా ఏం చెప్పారంటే…

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ…

‘‘నేను రాజశేఖర్‌ రెడ్డి హయాంలో రెండు సార్లు మారియు ప్రస్తుత రాక్షస ముఖ్యమంత్రి హయాంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. నాను చాలా మంది ముఖ్యమంత్రులను చూసాను కానీ ఇంత అనాగరికతతో, అన్యాయంతో పేద ప్రజలను హింసిస్తూ నోటి మాట చెప్పటమే కానీ పని చేయటం లేదు. ఇలాంటి వ్యక్తిని రాజశేఖర్‌ రెడ్డి ఎలా భరాయించాడో తెలియదు. వైఎస్‌ఆర్‌ కుమారుడని, ఒక్క ఒక్క ఛాన్స్‌ అన్నాడని బంపర్‌ మెజారిటీతో గెలిపించాం. చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తే జగన్‌ రెడ్డి మాత్రం ఒక్క పర్యాయానికే రాష్ట్రాన్ని కాలబెట్టేశాడు. ఉదయగిరిలో నేను తప్పా ఎవరూ గెలవరు అని చెప్తే నా టిక్కెట్టును అమ్మెశాడు. ఎన్టీఆర్‌ అంటే నాకు చాలా ఇష్టం. నాకు తెలుగుదేశంలో మంచి మిత్రులున్నారు. వారితో నేను బాగా ఉంటాను. వారు చెప్పిన ప్రకారం నేను తెలుగుదేంలో చేరాను. ఇక్కడ నాకు చాలా గౌరవం దక్కింది. నేను జగన్‌ రెడ్డి పేరు కూడా మర్చిపోయాను. జగన్‌ రెడ్డిని కలవలటానికి ఛాన్స్‌ దొరికేది కాదు. ఆయన్ని కలవటమంటే బ్రహ్మదేవుడిని కలిసినంత అంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వని ముఖ్యమంత్రి టిక్కెట్లను అమ్ముకుంటూ ఇన్‌ఛార్జులను మార్చుకుంటున్నాడు. పద్ధతి ప్రకారం పరిపాలన చేస్తే, పేద ప్రజలను ఉద్ధరిస్తే, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే ఇప్పుడు ఈ కర్మ ఆయనకు పట్టేది కాదు. పరిపాలన చేతకాక డబ్బు డబ్బు అంటూ డబ్బాతో రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ఈసారి కనుక ఆ పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రం బాగు పడదు, అభివృద్ధి శూన్యం, చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు ఉండవు కాబట్టి అందరు ఆలోచించి ఈసారి చంద్రబాబుని గెలిపించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. వేనుకబడిన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు గారిని గెలిపించుకోవాలి. లోకేష్‌ కూడా చంద్రబాబు వలే చాలా ఆలోచనా పరుడు. ఈ ముఖ్యమంత్రి, ఆయన మంత్రులు కన్నా లోకేష్‌ బాబు తెలివైనవాడు. లోకేష్‌ బాబు ఎక్స్‌లెంట్‌. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు తండ్రికొడుకులు ఇద్దరూ సిద్ధంగా ఉన్నారు. దుర్మార్గాన్ని అణిచివేసి న్యాయాన్ని కాపాడుకొనుటకు ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి మంచి మనుషులను గెలిపించుకుందాం.’’

మేకపాటి సతీమణి శాంతకుమారి మాట్లాడుతూ…

‘‘శుక్రవారం అంటే లక్ష్మీకలం. బిగ్‌ బాస్‌ చంద్రబాబుకు పాదాభివందనములు. నా చివరి శ్వాస ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీకి కష్టపడి పని చేస్తాను. వైఎస్‌ఆర్‌సీపీ ప్రచార కార్యదర్శీగా నిజాయితాగా పని చేశాను. ఇప్పుడు అంతకంటే నిజాయితీగా చంద్రబాబు సేవలో కొనసాగుతాను. చంద్రబాబు ని చూడగానే నాకు రామచంద్రుడుని చూసినట్లు అనిపించింది. శ్రీ రాముడుకి అరణ్యవాసం అయిపోయింది ఇక రామరాజ్యమే మిగిలింది. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఎవరి బలవంతం లేకుండా నాకు నేనుగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను. చంద్రబాబుని కళ్లారా చూడటం చాలా సంతోషంగా ఉంది. నాకు అది చాలు. నేను ఏ పదవినీ ఆశించటం లేదు.’’

ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ….

‘‘వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం నల్లేరు మీద నడకే. వైసీపీ అవినీతి పాలనకు చరమగీతం పాడేందుకు మహిళలంతా సిద్దంగా ఉన్నారు. ప్రతి గడపకు పసుపు ఎలా రాస్తామో ప్రతి ఇంటిపై పసుపు జెండా ఎగురవేయాలి. దళిత ఎమ్మెల్యే అయిన నన్ను వైసీపీ నుంచి అరాచకంగా సస్పెండ్‌ చేశారు. ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధులు ఏమయ్యాయి?. స్విగ్గీ , జొమెటా లో ఇంట్లో సరుకులు డోర్‌ డెలివరీ వస్తాయి కానీ ఏపీలో మాత్రం శవాలు డోర్‌ డెలివరీ వస్తున్నాయి. ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవరైన సుబ్రమణ్యంను చంపినా చర్యలు లేవు. అమరావతిని మార్చను అని జగన్‌ రెడ్డి ప్రమాణం చేసి మాట తప్పాడు. ఎస్సీ నియోజకవర్గాల మద్య ఉందన్న కారణంతోనే జగన్‌ రెడ్డి  రాజధానిని మార్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే అమరావతిని అభివద్ది చేస్తామని చంద్రబాబు, లోకేశ్‌ చెప్పారు. రాష్రంలో ఎక్కడైనా రోడ్లు వేశారా, గుంతల్లో రోడ్డు వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఏపీలో  నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగులకు జీతాలు లేవు. మద్య పాన నిషేదం అని మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టారు. కల్తీ మద్యం తాగి 30 వేలకు మందిపైగా చనిపోయారు. దళితులకు రక్షణ లేదు,  ఇలాంటి పాలన మనకు అవసరమా?. విజన్‌ ఉన్న నేత చంద్రబాబు సైబారాబాద్‌ నిర్మాణం వల్ల 16 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. యువతకు ఉద్యోగాలు కావాలన్నా, మహిళలకు రక్షణ కావాలన్నా రైతులకు భరోసా కావాలన్నా తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. వచ్చే ఎన్నికలు కురుక్షేత్రం లాంటివి. ఈ కురుక్షేత్రంలో అభివన దుర్యోదునుడు జగన్‌ రెడ్డిని  ఓడిరచాలి.’’

పారిశ్రామికవేత్త జయచంద్రారెడ్డి మాట్లాడుతూ…

‘‘తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా కొత్త వారికి అవకాశం ఇస్తుందనటానికి తంబళ్ళపల్లి దిక్సూచి. కొత్తవారిని ప్రోత్సాహించటంలో తెలుగుదేశం ముందుంటుంది. తెలుగుదేశం పార్టీకి సేవ చేయటానికి నాకు అవకాశం ఇచ్చిన చంద్రబాబుకి రుణపడి ఉంటాను. ఎంత కష్టమైనా పడి మా నియోజకవర్గంలో మన పార్టీ జెండాను ఎగురవేస్తాం. అత్యధిక మెజారిటితో గెలిపించి చంద్రబాబు గారికి గిఫ్టుగా ఇస్తాం. నేను నా సైన్యం చంద్రబాబుకి, లోకేష్‌కి రుణపడి ఉంటాం.’’

రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ…

‘‘ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలనను కాపాడే వ్యక్తి ఒక్క చంద్రాబాబు మాత్రమే. రాబోయే ఎన్నికల్లో మంత్రాలయం నియోజకవర్గాన్ని గెలిచి చంద్రబాబు పాదాలు దగ్గర గిఫ్టుగా పెడుతాం. వెనుకబడిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టి వారిని కాపాడాలని కోరుకుంటున్నాను.’’

మాజీ శాసన మండలి సభ్యులు బుదాటి రాధా కృష్టయ్య మాట్లాడుతూ…

‘‘నేను నా జీవితంలో కాంగ్రెస్‌ పార్టీకి తప్పా ఇంకో పార్టీలో చేరుతానని కలలో కూడా అనుకోలేదు. 1983లో నన్ను టీడీపీలోకి రమ్మని చంద్రబాబు పిలిచారు. ఆ రోజు నేను నిరాకరించినందుకు చంద్రబాబుకి నా క్షమాపణలు. క్రిమినల్‌ నాయకుడు నన్ను అతని పాదయాత్రకు రమ్మని నన్ను పిలిస్తే నీతో రావటం జరగదని జగన్‌ రెడ్డికి చెప్పాను. అప్పటి నుంచి నేను రాజకీయాల్లో నిశబ్దంగా ఉన్నాను. ఒక కార్యకర్త నిశబ్దంగా ఉండటం దేశ ద్రోహం అవుతుందని గమనించి దేశ, రాష్ట్ర, పేద, బడుగు బలహీన వర్గాలు, రైతులు భవిష్యత్తులు గురించి ఆలోచించి చంద్రబాబు నాయకత్వంలో పనిచేయటమే న్యాయం, ధర్మమని తెలుగుదేశం పార్టీలో చేరాను. చేనేత, కార్మిక రంగాలలో నాయకత్వం వహించాను. ఆ స్ఫూర్తితోనే ఈ అరాచక పాలన వల్ల కుప్పకూలిపోతున్న బలహీన వర్గాల్ని కాపాడుకొనుటకు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టటానికి టీడీపీలో చేరాను. పార్టీ గెలుపు కోసమే నేను కృషి చేస్తానని మాట ఇస్తున్నాను. ఆయన అడిగిన ఒక్క ఛాన్స్‌ అయిపోయింది. రెండో ఛాన్స్‌ ఇవ్వాల్సినవసరం లేదు. ప్రజలకు నమస్కారం చేస్తున్నా రాష్ట్రాన్ని బాగు చేయగలిగిన శక్తి మీ దగ్గరే ఉంది. జగన్‌ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమికొట్టండి. రాష్ట్రాన్ని కాపాడండి.’’

రాయపురెడ్డి సూరిబాబు మాట్లాడుతూ…

‘‘తెలుగుదేశం పార్టీ కుటుంబంలో సభ్యుడిగా చేరినందుకు నేను గర్వపడుతున్నాను. నాకు శక్తి ఉన్నంత వరకు టీడీపీకి నా సేవలను అందిస్తూనే ఉంటాను. రామచంద్రాపురం నియోజకవర్గాన్ని చంద్రబాబుకి గిఫ్టుగా గెలిపించి తీసుకువచ్చి అప్పజెప్తాను.’’

డా. కే శ్రీధర్‌ మాట్లాడుతూ…

‘‘చంద్రన్న అంటే ఒక వ్యక్తి కాదు.. ఆయన ఒక సమ్మోహమైన శక్తి. చంద్రన్న గెలువబోతున్నాడు. మరలా ముఖ్యమంత్రి కాబోతున్నాడని జగన్‌ రెడ్డికి తెలిసి ఎమ్మెల్యేల స్థానాలను మారుస్తున్నాడు. వైకాపాలో 150 ఎమ్మెల్యేలు గెలవలేదు. గెలిచింది 150 బలిపశువులు. చంద్రబాబులాంటి గొప్ప నాయకుడు ఉండగా ఒక దొంగని, ఒక దుర్మార్గుడిని మనం ఎన్నుకున్నాం. జగన్‌ రెడ్డి ప్రభుత్వంపై గాండ్రిరచి ఉమ్ము వేస్తున్నాం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రన్నే గెలవాలి. చంద్రన్నకు ఓటు వేస్తే పోయేదేమి లేదు బానిస సంకెలు, అవినీత ప్రభుత్వం, అక్రమ మద్యం తప్పా. జనం జనం అంటూ చంద్రన్న మన మధ్య తిరుగుతుంటే డబ్బు డబ్బు అనే వ్యాధితో జగన్‌ రెడ్డి బాధపడుతున్నాడు. లోకేష్‌ బాబు తండ్రికి మించిన కొడుకు. వీరిద్దరి నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షం అవుతుంది.’’

Tags: చంద్రబాబునాయుడుచిల్లు పడిన వైసిపి నావజగన్‌రెడ్డిజనవరిటీడీపీ అధినేతతుక్కు..తుక్కుపది ప్రశ్నలుప్యాన్‌ రెక్కలుమునిగిపోతుందిసమాధానంసైకిల్‌ స్పీడ్‌
Previous Post

ఎన్నికల నోటిఫికేషన్‌ నాటికి వైసీపీ అంతా ఖాళీ

Next Post

Day-224: LIVE యలమంచిలి/అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలలో యువగళం పాదయాత్ర.

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-05-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-05-2025

కార్యకర్త
@ May 19, 2025
ఆంధ్రప్రదేశ్

మహానాడు ఏర్పాట్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా సమీక్ష

చైతన్యరధం
@ May 18, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో..టీడీపీ అభ్యర్థుల విజయం ఖాయం
ఆంధ్రప్రదేశ్

మన త్రివిధ దళాలకు శిరసాభివందనం

చైతన్యరధం
@ May 18, 2025
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

చైతన్యరధం
@ May 18, 2025
చైతన్యరధం ఈ పేపర్ 18-05-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-05-2025

కార్యకర్త
@ May 18, 2025
ఆర్ధిక వృద్ధి గ్రేట్‌
ఆంధ్రప్రదేశ్

బల్లెం వీరుడి ప్రదర్శన భేష్‌ 

చైతన్యరధం
@ May 18, 2025
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర విద్యార్థి హార్డీకి మాస్టర్‌ స్పెల్లర్‌ అవార్డ్‌

చైతన్యరధం
@ May 18, 2025
మహిళలకు శుభవార్త ..ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం
ఆంధ్రప్రదేశ్

మహిళలకు శుభవార్త ..ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం

చైతన్యరధం
@ May 18, 2025
Load More

ముఖ్య వార్తలు

రాష్ట్ర విద్యార్థి హార్డీకి మాస్టర్‌ స్పెల్లర్‌ అవార్డ్‌

చైతన్యరధం
@ May 18, 2025
ప్రధాని మోదీతో మంత్రి లోకేష్‌ భేటీ

ప్రధాని మోదీతో మంత్రి లోకేష్‌ భేటీ

చైతన్యరధం
@ May 18, 2025
20 లక్షల ఉద్యోగాలు..హామీ నిలబెట్టుకుంటాం

దేశ క్లీన్‌ ఎనర్జీ విప్లవానికి పునాదిరాయి రెన్యూ!

చైతన్యరధం
@ May 17, 2025
అడుగడుగునా జేజేలు..

ఇబ్బందులు తీర్చి అండగా ఉంటా

చైతన్యరధం
@ May 17, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

వేటాడాల్సింది తిమింగలాన్ని!?

చైతన్యరధం
@ May 16, 2025 7:00 AM

చంద్రబాబుపై గుడ్డి వ్యతిరేకత విడనాడాలి

చైతన్యరధం
@ May 12, 2025 6:50 AM

జగన్‌ ఐదేళ్ల పాలనలో అధ్వాన్నంగా సీమ ప్రాజెక్టులు

చైతన్యరధం
@ May 11, 2025 6:00 AM

రాజధాని పునః ప్రారంభ సభపై సాక్షి విద్వేష దాడి

చైతన్యరధం
@ May 5, 2025 7:20 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మహానాడు ఏర్పాట్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా సమీక్ష

చైతన్యరధం
@ May 18, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో..టీడీపీ అభ్యర్థుల విజయం ఖాయం

మన త్రివిధ దళాలకు శిరసాభివందనం

చైతన్యరధం
@ May 18, 2025
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

చైతన్యరధం
@ May 18, 2025
ఆర్ధిక వృద్ధి గ్రేట్‌

బల్లెం వీరుడి ప్రదర్శన భేష్‌ 

చైతన్యరధం
@ May 18, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist