- జగన్ కోసం ప్రత్యేక చట్టం తేవాలా
- సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి మండిపాటు
అమరావతి (చైతన్యరథం): వైఎస్ జగన్ అసెంబ్లీకి హాజరుకావడంపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అనర్హత వేటు భయంతోనే జగన్ అసెంబ్లీకి వస్తున్నారని తప్పుబట్టారు. ప్రతిపక్ష హోదాకు అవసరమైన సంఖ్యలో ఎమ్మెల్యేల బలం లేని పార్టీకి ఆ హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. జగన్ కోసం ఏమైనా ప్రత్యేక చట్టం తీసుకురావాలా అని సోమిరెడ్డి వ్యంగ్యబాణాలు సంధించారు. తన హయాంలో జరిగిన అక్రమాలు, తప్పుడు వ్యవహారాలన్నీ తెరపైకి వస్తాయనే భయంతోనే అసెంబ్లీకి జగన్ ముఖం చాటేస్తున్నారంటూ సోమిరెడ్డి దుయ్యబట్టారు.