అమరావతి: రాజకీయ పార్టీల సభలు, ఇతర కార్యక్రమాలకు అద్దె ప్రాతిపదిక మీద బస్సులు ఇవ్వటంలో ఏపీఎస్ ఆర్టీసీ వివక్ష చూపిస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. అధికార వైసీపీ సభలకు బస్సులు ఇస్తూ, టీడీపీ నాయకులు అడిగితే ఇవ్వటం లేదన్నారు. ఇటీవల అధికార వైసీపీ విశాఖ జిల్లా భీమిలి సమీ పంలో నిర్వహించిన సభకు ఆర్టీసీ ఎన్ని బస్సులు పంపించింది, ఎంత అద్దె ప్రాతిపదిక మీద పంపించింది, ఆ డబ్బులు ఎవరు చెల్లించారనే వివరాలు కోరుతూ ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌కు వర్ల రామయ్య లేఖ రాశారు.
లేఖ వివరాలు:
రాజకీయ పార్టీలకు ఏపీఎస్ ఆర్టీసీ అద్దె ప్రాతి పదిక మీద బస్సులను సరఫరా చేయటం సర్వ సాధారణం. గతంలోనూ పార్టీలకు అతీతంగా ఏపీ ఎస్ ఆర్టీసీ చెల్లింపు విధానంలో బస్సులు అద్దెకు సరఫరా చేసేది. కానీ ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ కేవలం అధికార వైఎస్‌ఆర్‌సీపీ పార్టీకి అనుకూలం గా వ్యవహరిస్తూ.. ఆ పార్టీ కార్యక్రమాలకు, సభల కు మాత్రమే పెద్దఎత్తున బస్సులు సరఫరా చేస్తోం ది. ఇతరపార్టీల అభ్యర్థనలను ప్రక్కన పెడుతోంది. ఈనెల 27న విశాఖపట్టణం జిల్లా భీమిలిలో జరిగిన వైకాపా సభకు భారీ సంఖ్యలో ఆర్టీసీ బస్సులను పంపారు. ఈ నేపథ్యంలో మేము అడిగే ఈ కింది సమాచారం ఇవ్వగలరు.
1. భీమునిపట్నం సభకు మొత్తం ఎన్ని బస్సులు పంపారు?
2. పంపిన బస్సులు నగదు చెల్లింపు ప్రాతిపదికిన పంపించారా?ఏలెక్కన అద్దె వసూలు చేశారు?
3. ఆర్టీసీ నిర్ణయించిన రేట్ల ప్రకారం వైఎస్‌ఆర్సీపీ వారు అద్దె చెల్లించారా? చెల్లిస్తే ఏ విధానం లో, ఎంత, ఎవరి పేరు మీద చెల్లించారో వాటి వివరాలు?
4. అధికార వైఎస్‌ఆర్‌సీపీతో సమానంగా తెలుగు దేశంపార్టీ కార్యక్రమాలకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సు లను ఇవ్వకపోవటానికి కారణాలు ఏమిటి?