అమరావతి (చైతన్యరథం): కర్ణాటక రాష్ట్ర న్యాయ విశ్వవిద్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రతిష్టాత్మక డాక్టర్ ఆఫ్ లాస్ డిగ్రీని అందుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ గౌరవం.. చట్టం, న్యాయం, ప్రజాసేవలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చేసిన కృషిని ప్రతిబింబిస్తోందన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ను సీఎం చంద్రబాబు అభినందనలతో ముంచెత్తారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు, బుధవారం హుబ్లీలోని నవనగర్ కర్ణాటక రాష్ట్ర న్యాయ విశ్వవిద్యాలయం.. ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ సజీర్కు ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ చేతుల మీదగా డాక్టర్ ఆఫ్ లాస్ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతోపాటు యూనివర్శిటీ అధికారులు పాల్గొన్నారు.











