జగన్ అవినీతి, అరాచకాలు పెరగిపోయాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. జగన్ నాలుగేళ్ల పాలనలో విద్వంసం పెరిగిపోయిందన్నారు. కడప స్టీల్ ప్లాంట్‌కు మూడోసారి శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు.
జగన్‌కు మళ్ళీ పెళ్ళి గుర్తుకొచ్చిందని విమర్శించారు. న్యాయ వ్యవస్థను, మీడియాను బ్లాక్ మొయిల్ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబాయ్‌ను హత్య చేయించిన జగన్‌కు ప్రత్యేక భద్రత కావాలా? అని ప్రశ్నించారు. జగన్ నేరస్థుడన్నారు. జగన్ ఎర్రగడ్డకు వెళ్లతానన్న భయంతో వణికిపోతున్నాడని విమర్శించారు.
ఎంపీ భరత్‌కు మతిపోయిందన్నారు.ఎంపీ భరత్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని వదిలేసి రాజమండ్రి నియోజకవర్గానికే పరిమితమయ్యాడన్నారు. సవాల్ విసురుతున్నానని…. పోలీసులు లేకుండా వైసీపీ నేతలు బయట తిరగగలరా? అని ప్రశ్నించారు. మద్యం విధానంతో జనం డబ్బు దోచుకుంటున్నాడని ఆరోపించారు.