- ప్రతి దానిలో ఏఐ కెమెరాలు ఏర్పాటు చేయాలి
- మిల్లర్ల బ్యాంకు గ్యారంటీలకు చర్యలు తీసుకోవాలి
- పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశం
- రైస్‌మిల్లర్ల ప్రతినిధులు, అధికారులతో సమీక్ష
విజయవాడ(చైతన్యరథం): ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలు అనంతరం సీఎంఆర్ రైస్ నిల్వ కోసం అవసరమైన స్టోరేజ్ గోడౌ న్‌లను ముందుగానే సిద్ధం చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. సచివాల యం రెండో బ్లాక్‌లోని తన ఛాంబరులో సోమవారం రైస్ మిల్లర్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. గత ఏడాది కూటమి ప్రభు త్వం రైతులకు న్యాయం చేయడంతో పాటు ధాన్యం కొనుగోలులో చరిత్ర సృష్టించిందన్నారు. ఈ సీజన్‌లో పౌర సరఫరాల శాఖకు 20 లక్షల మెట్రిక్ టన్నులు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు 14 లక్షల మెట్రిక్ టన్నులు సీఎంఆర్ రైస్ నిల్వల కోసం గోడౌన్ల ను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. డ్రైయర్లు సౌక ర్యాలు ఉన్న రైస్ మిల్లులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి గోడౌన్ వద్ద నిరంతర నిఘా ఉండేలా ఏఐ కెమెరాలు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. జిల్లాల వారీగా రైస్ మిల్లర్లు 1:2 బ్యాంక్ గ్యారంటీలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచిం చారు. ఇందుకు సుమారు 35 బ్యాంకులు సేవలు అందిస్తున్నాయ ని తెలిపారు. ఈ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సివిల్ సప్లయీస్ మేనేజింగ్ డైరెక్టర్ ఢల్లీిరావు హాజరయ్యారు. ఈ కార్యక్ర మంలో సివిల్ సప్లయీస్ సెక్రటరీ సౌరభ్‌గౌర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, సెక్రట రీ సూరిబాబు, నాయకులు సత్యనారాయణరాజు, వీరయ్య, లలిత శ్రీనివాస్, పట్టాభి శ్రీనివాస్, పౌరసరఫరాల అధికారులు పాల్గొన్నారు.















