- విపత్తు సమయంలో ప్రజలతోనేవున్న ముఖ్యమంత్రి
- తెల్లవారుఝాము 5గంటలనుంచే తుపాను పరిణామాలపై ఫోకస్
- తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే
- ‘మొంథా’ అనంతర పరిణామాలపై విస్తృత సమీక్షలు
- తుపాను తీరంతాకిన పరిసరాలకు వెళ్లిన ముఖ్యమంత్రి
- ఓడరేవులో బాధిత ప్రజలను కలిసి ధైర్యం చెప్పిన వైనం
- రోజంతా తుపానుపైనే గడిపిన సీఎం చంద్రబాబు
- రాత్రికి ఆర్టీజీఎస్లో ప్రభావిత ప్రాంతాలపై సమీక్ష
అమరావతి (చైతన్య రథం): ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు ప్రభుత్వం దగ్గరగావుంటే -ప్రజలు ధైర్యంగా ఉంటారన్న సిద్ధాంతాన్ని నమ్మే సీఎం చంద్రబాబు -ప్రజలకు అందుబాటులో ఉంటూ విపత్తునుంచి రాష్ట్రాన్ని బయటపడేశారు. మొంథా తీవ్ర తుపాను హెచ్చరికలు వచ్చిన దగ్గర్నుంచీ -అనుక్షణం యంత్రాగాన్ని అప్రమత్తం చేస్తూ..
సమాచార సరఫరాతో రాష్ట్ర ప్రజలకు దగ్గరగావున్న ముఖ్యమంత్రి – పెను తుఫాను తీరానికి చేరిన దగ్గర్నుంచీ తీరం దాటిన తరువాత -ప్రజలకు అందబాటులో ఉండి ధైర్యం చెబుతూనే ఉన్నారు. ఒకపక్క సమీక్షలు, టెలికాన్ఫరెన్స్లతో యంత్రాగాన్ని అప్రమత్తం చేస్తూ.. ప్రకృతి విపత్తును ధైర్యం ఎదుర్కొందామంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
మంగళవారం రాత్రి 12 గంటల వరకూ సమీక్షలతో సచివాలయంలోనే గడిపిన ముఖ్యమంత్రి…బుధవారం ఉదయం 5 గంటలనుంచే తుఫాను సహాయక చర్యలపై ఫోకస్ పెట్టారు. మొంథా తుఫాను సహాయక చర్యలపై ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పర్యటన జరిపారు.
ఉదయం 5 గంటలకే రోజును ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. వివిధ వర్గాలనుంచి, ప్రసార మాధ్యమాలనుంచి వస్తున్న సమాచారం ఆధారంగా ఎప్పటికప్పుడు అధికారులను, ప్రభుత్వ విభాగాలను అలెర్ట్ చేయడం మొదలుపెట్టారు.
ఉదయం 9 గంటలకు తుఫాను ఎఫెక్ట్, రాష్ట్రవ్యాప్త పరిస్థితిపై సీఎంవో, ఆర్టీజీ అధికారులతో చర్చించి సమాచారం తీసుకున్నారు.
ఉదయం 10 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా 25 వేల మందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం… ఆయా ప్రాంతాల్లో గ్రామస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు.
తుఫాను సమయంలో ప్రాణ, ఆస్తినష్టం నియంత్రణకు తీసుకున్న చర్యలపై అధికారులతో మాట్లాడిన సీఎం… బుధవారంనాటి ప్రణాళికపై అధికారులు, మంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు.
క్షేత్రస్థాయిలో ఉండి చాలా ఎఫెక్టివ్ పనిచేశారంటూ టెలీకాన్ఫరెన్స్లో అధికారులు, ఉద్యోగులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.
ఉదయం 11 గంటలకు తుఫాను బాధితులకు బియ్యం, నిత్యావసరాలు, ఆర్థిక సాయం అందించే విషయంపై సమీక్ష నిర్వహించారు. బాధిత ప్రజలను ఆదుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మధ్యాహ్నం 12:30కు అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేకు సీఎం చంద్రబాబు బయలుదేరారు.
పల్నాడు, బాపట్ల, కృష్ణా, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల్లో ఏరియల్ సర్వే ద్వారా ఆయా ప్రాంతాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు.
చిలకలూరిపేట, పరుచూరు, చీరాల, బాపట్ల, నాగా యలంక, మచిలీపట్నం, కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడరేవువరకు ఏరియల్్వజిట్ సాగించారు.
దాదాపు గంటన్నరపాటు ఏరియల్ విజిట్ అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు అంబేద్కర్
కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడరేవులో హెలిపాడ్ వద్ద చంద్రబాబు ల్యాండయ్యారు.
2:15కు జెడ్ క్యాటగిరీస్థాయి భద్రత లేకుండా, బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం లేకుండా, సాధారణ వాహనంలో పూర్తిస్థాయి సెక్యూరిటీ లేకుండా ప్రజలమధ్యకు ముఖ్యమంత్రి పర్యటన సాగింది.
ఓడరేవు సమీపంలోని పునరావాస కేంద్రంలో దాదాపు అరగంటపాటు తుఫాను బాధితులతో మాట్లాడి వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. ప్రభుత్వంనుంచి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. బాధిత వర్గాలకు కలుసుకుని ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
తుఫాను బాధిత ప్రజలకు సీఎం చంద్రబాబు నిత్యావసరాలు పంపిణీ చేశారు.
అనంతరం అంగన్వాడీ సెంటర్ను సందర్శించి పిల్లలతో ముఖ్యమంత్రి ముచ్చటించారు.
మధ్యాహ్నం 3 గంటలకు అరగట్లపాలెం, బెండమూరు లంకలో నీటి మునిగిన పొలాలను స్థానికులతో కలిసి పరిశీలించారు. రైతులకు జరిగిన నష్టానికి పరిహారంపై హామీ ఇచ్చారు. పొలంలోకి వెళ్లి అన్నదాతలతో సీఎం చంద్రబాబు చర్చించారు.
సాయంతకు 4:30కు క్షేత్రస్థాయి పర్యటన అనంతరం మళ్లీ హెలికాఫ్టర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుగు ప్రయాణమయ్యారు. తిరుగు ప్రయాణంలో కోనసీమ జిల్లాలోని కాట్రేనికోన, అమలాపురం, అంబాజీపేట, మండపేట, రాయవరం, ఏలూరు జిల్లా ముదినేపల్లి గ్రామాల్లో తుఫాను ప్రభావం, పంటనష్టాన్ని ఏరియల్ వ్యూ ద్వారా ముఖ్యమంత్రి పరిశీలించారు.
సాయంత్రం 5:30కు ఏరియల్ విజిట్ ముగించుకుని నేరుగా సచివాలయం సమీపంలోని హెలిపాడ్వద్ద సీఎం చంద్రబాబు ల్యాండయ్యారు.
సాయంత్రం 6 గంటలకు సచివాలయ రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ నుంచి మంత్రులు, అధికారులతో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, పంట నష్టం, బాధిత కుటుంబాలకు అందుతున్న ప్రభుత్వ సాయంపై సమీక్ష నిర్వహించారు.
ఏరియల్ విజిట్ గమనించిన అంశాలు, బాధిత ప్రాంతాల్లో ప్రజలకు అందించాల్సి సాయంపై అధికారులతో చర్చించారు.
రాత్రి 7:30కు సచివాలయంలో ఆర్టీజీ సెంటర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తుపాను అనంతర పరిణామాలు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహిస్తున్నారు.












