చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రాక్షస ప్రభుత్వాన్ని పారదోలండి!

మంగళగిరిలో రచ్చబండలో పాల్గొన్న నారా భువనేశ్వరి, యువనేత లోకేష్

by చైతన్యరధం
May 10, 2024 at 6:41am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రాక్షస ప్రభుత్వాన్ని పారదోలండి!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

మంగళగిరి(చైతన్యరథం): భయపడుతూ బతకవద్దు, గత ఐదేళ్లుగా వేధించిన వైసీపీ రాక్షస ప్రభుత్వానికి ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఓటుతో బుద్దిచెప్పాలని ప్రజలకునారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. మంగళగిరి నియోజకవర్గం కురగల్లులో తనయుడు లోకేష్‌తో కలసి గురువారం రచ్చబండ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ…. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుని 53రోజులు జైలులో పెట్టినపుడు మహిళలంతా తనకు అండగా నిలిచారన్నారు. వారి స్పూర్తితోనే రాష్ట్రవ్యాప్తంగా నిజం గెలవాలి కార్యక్రమాన్ని నిర్వహించాను. గత ఐదేళ్లుగా అరాచక ప్రభుత్వం ప్రజలను ఎన్నో అవస్థలు పెట్టింది, స్వేచ్చ,స్వాతంత్యాలు ఓటుతోనే వస్తాయి, అందరూ కలిసి రాబోయే ఎన్నికల్లో అరాచక ప్రభుత్వాన్ని సాగనంపి ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి. గత ఐదేళ్లుగా ఎంతోమంది కార్యకర్తలు తమ జీవితాన్ని త్యాగం చేశారు, ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడారు, కొందరు నాయకులు వెళ్లిపోయినా కేడర్‌ వెన్నంటి మమ్మల్ని ముందుకు నడిపించారు, వారి కష్టాన్ని మర్చిపోం, వారందరినీ కన్నబిడ్డల్లా చూసుకునే బాధ్యత నాది. ముఖ్యమంత్రి అంటే కేవలం బటన్‌ నొక్కడమే కాదు, కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలవాలి. రాష్ట్రవిభజన తర్వాత ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమించారు. ఇప్పటి పరిస్థితుల్లో కుటుంబానికి తండ్రిలా రాష్ట్రాన్ని ముందుకు నడిపించే నాయకుడు కావాలి. మీ ఓటుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం, రాబోయే ఎన్నికల్లో మంగళగిరిలో పోటీచేస్తున్న లోకేష్‌ను స్థానిక ప్రజలు ఆశీర్విదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని భువనేశ్వరి కోరారు.

  • కుప్పంతో పోటీపడి మంగళగిరిని అభివృద్ధి చేస్తా!
  • నా మెజారిటీ తగ్గించేందుకు రూ.300 కోట్ల దోపిడీ సొమ్ము పంపారు
  • అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి పనులు ప్రారంభిస్తాం
  • కురగల్లు రచ్చబండ కార్యక్రమంలో యువనేత నారా లోకేష్‌

రాబోయే ఎన్నికల్లో ప్రజలందరి ఆశీస్సులతో తాను మంగళగిరి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాక కుప్పం నియోజకవర్గంతో పోటీపడి మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని యువనేత నారా లోకేష్‌ చెప్పారు. గత పదిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా యువగళం సభల్లో పాల్గొంటూ నియోజకవర్గానికి దూరంగా ఉన్న లోకేష్‌… గురువారం తల్లి భువనేశ్వరితో కలిసి కురగల్లు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ ఇప్పుడు కుప్పం, హిందూపూర్‌, మంగళగిరి నియోజకవర్గాల నడుమ పోటీ నడుస్తోంది.. ఎక్కువ మెజారిటీ ఎక్కడ వస్తుందనే విషయంలోనే మా మధ్య ప్రధాన పోటీ నెలకొందని చమత్కరించారు. ఇక్కడ చేపట్టిన 29 అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కుప్పంలో కూడా అమలుచేయాలని అమ్మ కోరుతున్నారు. ఐదేళ్లుగా సొంత కుటుంబసభ్యుడిలా నియోజకవర్గ ప్రజలకు వెన్నంటి నిలచి సేవలందించాను. పాతికేళ్లు అధికారం అనుభవించిన మురుగుడు హనుమంతరావు కుటుంబం, ఆళ్ల రామకృష్ణారెడ్డి నేను చేసిన సేవా కార్యక్రమాల్లో 10శాతమైనా చేశారా? కురగల్లు ప్రజలు ఆర్కేకు మెజారిటీ ఇచ్చి గెలిపిస్తే ఇక్కడి ప్రజల ఇళ్లపైకి పొక్లయినర్లు పంపాడు, ఆ సమయంలో నేను కోర్టుకువెళ్లి స్టేతెచ్చి ప్రజలకు అండగా నిలిచాను. ఎమ్మెల్యే ఆర్కే ఐదేళ్లుగా నియోజకవర్గాన్ని గాలికొదిలేశారని లోకేష్‌ విమర్శించారు.

సంబంధితవార్తలు

నేడు ఉదయం 9.15 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు

కేంద్రమంత్రి కుమారస్వామికి లోకేష్‌ ధన్యవాదాలు

మాట మార్చుడు లేదు.. మడమ తిప్పుడు లేదు!

మూడుముక్కలాటతో అమరావతి నాశనం….
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మూడుముక్కలాటతో అమరావతిని సర్వనాశనం చేశారు. రాష్ట్రం కోసం భూములిచ్చిన రైతులకు కనీసం కౌలు డబ్బు కూడా అందించకుండా ఇబ్బంది పెట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన రాజధాని పనులు ప్రారంభిస్తాం, మంగళగిరి బిడ్డలకు స్థానికంగానే ఉద్యోగాలు కల్పిస్తాం. గత ప్రభుత్వ హయాంలో ఆటోనగర్‌ లో నేను ఏర్పాటు చేసిన పై కేర్‌ సాఫ్ట్వేర్‌ కంపెనీలో 580 మంది పనిచేస్తున్నారు. నన్ను మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎంత అభివృద్ధి చేస్తానో ఆలోచించండి. పేదరికం లేని మంగళగిరి నా లక్ష్యం. కుప్పంతో పోటీపడి మంగళగిరిని అభివృద్ధికి కేరాఫ్‌ గా మారుస్తానని లోకేష్‌ చెప్పారు.

ఓటుకు 10వేలు ఇస్తారట… అదంతా మీడబ్బే
మంగళగిరిలో నా మెజారిటీ తగ్గించేందుకు జగన్‌ రూ.300 కోట్ల దోపిడీ సొమ్ము పంపారు, ఓటుకు 10వేలు ఇస్తారట, తీసుకోండి… అదంతా మీ డబ్బే. విద్యుత్‌ ఛార్జీలు, ఆర్టీసీ చార్జీలు, ఇసుక, మద్యం, పెట్రోలు, డీజిల్‌, ఇంటిపన్ను, చెత్తపన్ను.. ఇలా రకరకాల పేర్లతో ఒక్కో కుటుంబం నుంచి జగన్‌ రెండున్నర లక్షలు కొట్టేశారు. అందులో పదిశాతం దోపిడీ సొమ్ము ఇప్పుడు ఎన్నికల్లో ఖర్చుచేస్తున్నారు. బిడ్డల భవిష్యత్‌ మీ ఓటుపైనే ఆధారపడి ఉంది. మరోమారు మాయమాటలు నమ్మి మోసపోవద్దు. పనిచేయడానికి, ప్రజలకు సేవ చేయడానికే వచ్చా. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటా. మరో 40ఏళ్లు రాజకీయాల్లో ఉండాలని వచ్చా. ఐదేళ్ల తర్వాత మీతో శభాష్‌ అన్పించుకుంటా, రాబోయే ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని లోకేష్‌ కోరారు.

బిడ్డల భవిష్యత్తుకు లోకేష్‌ ను గెలిపించండి: సుహాసిని
ఇక్కడి పరిస్థితులు చూశాక ఐదేళ్లుగా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థమవుతోందని నందమూరి సుహాసిని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబునాయుడు ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేస్తే, వైసీపీ ప్రభుత్వం వచ్చాక నాశనం చేసింది. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. ఇక్కడ చదువుకున్న పిల్లలు ఉద్యోగాల్లేక ఇబ్బందులు పడుతున్నారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం యువనేత లోకేష్‌ను ఎన్నికల్లో ఆశీర్వదించండి. రాబోయే మూడురోజులే కీలకం, మంగళగిరిలో పసుపుజెండా ఎగరాలి. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ తో ప్రజల భూములు కొట్టేయడానికి వైసీపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఈసారి తేడా జరిగితే ఆంధ్రప్రదేశ్‌కు భవిష్యత్తు ఉండదు. చంద్రబాబు మాదిరే లోకేష్‌ కూడా విజన్‌ ఉన్న వ్యక్తి. ఆయనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారని సుహాసిని అన్నారు.

యువనేత దృష్టికి కురగల్లు వాసుల సమస్యలు
ఈ సందర్భంగా కురగల్లు రైతులు పలు సమస్యలను యువనేత లోకేష్‌ దృష్టికి తెచ్చారు. రాజధాని రైతులకు క్యాపిటల్‌ గెయిన్స్‌ అందించాలి, దీర్ఘకాలంగా పెండిరగ్‌ లో పెట్టిన కౌలు బకాయిలు ఇప్పించాలి. శ్మశానవాటిక లేక ఇబ్బంది పడుతున్నాం. చనిపోయిన వారికి గౌరవప్రదంగా అంతిమసంస్కారాలు నిర్వహించలేకపోతున్నాం. స్కూలు భవనం శిథిలావస్థకు చేరుకుంది. విద్యార్థులు దేవాలయంలో చదువుకుంటున్నారు. టిడ్కో ఇళ్లను సకాలంలో అందించకపోవడంతో వడ్డీలకు చక్రవడ్డీలు పెరిగి అధిక భారం పడుతోంది, విముక్తి కల్పించాలి. గ్రామంలో ఎన్టీఆర్‌ హయాంలో ఇచ్చిన ఇళ్లకు వెళ్లే రోడ్డు మాయమైంది, సరైన రోడ్డులేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. యువనేత లోకేష్‌ స్పందిస్తూ… అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో రాజధాని రైతులకు కౌలు బకాయిలు చెల్లిస్తామన్నారు. భూసేకరణ చేసి దామాషా ప్రకారం శ్మశానానికి స్థలం కేటాయిస్తాం. గ్రామంలో నూతన స్కూలు భవనాన్ని నిర్మిస్తాం. కబ్జాకు గురైన రోడ్డును తిరిగి ఏర్పాటుచేస్తాం. అధికారులతో మాట్లాడి టిడ్కో లబ్ధిదారుల సమస్య పరిష్కరిస్తాం. ఎసైన్డ్‌, కొండ పోరంబోకు ప్రాంతాల్లో దశాబ్దాలుగా నివసిస్తున్న వారికి శాశ్వత పట్టాలిస్తాం. అండర్‌ గ్రౌండ్‌ భూగర్భ డ్రైనేజి, ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం. రాబోయే ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని యువనేత లోకేష్‌ కోరారు.

లోకేష్‌ దృష్టికి నిడమర్రు ప్రజల సమస్యలు
నిడమర్రులో జరిగిన రచ్చబండలో స్థానికులు పలు సమస్యలను లోకేష్‌ దృష్టికి తెచ్చారు. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని వితంతు పెన్షన్‌ కట్‌ చేశారు, కురగల్లు, నిడమర్రు రైతులకు జరీబు రైతులకు మాదిరి ప్యాకేజి ఇవ్వాలి. మంగళగిరికి ఐటి కంపెనీలు తీసుకురావాలి. పసువుల హాస్పటల్‌కు డాక్టర్‌ ను నియమించాలి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాసుపత్రిని 10పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని విన్నవించారు. యువనేత లోకేష్‌ స్పందిస్తూ… కొర్రీలతో నిలిపివేసిన పెన్షన్లను తిరిగి అందజేస్తాం. 3వేల పెన్షన్‌ ను 4వేలకు పెంచుతాం. రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తాం. మంగళగిరికి ఐటి కంపెనీలు తెచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పశువుల హాస్పటల్‌, ప్రభుత్వాసుపత్రి విస్తరణ అంశాన్ని పరిశీలిస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు.

Tags: నారా భువనేశ్వరిమంగళగిరిమంగళగిరి నియోజకవర్గంమంగళగిరి ప్రజలుమన మంగళగిరి మన లోకేష్యువనేత నారా లోకేష్‌
Previous Post

అధికారం కోల్పోతున్నామన్న అక్కసుతో బరితెగిస్తున్న వైసీపీ రౌడీ మూకలు

Next Post

మైనారిటీలకు అండగా ఉంటాం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 20-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-07-2026

కార్యకర్త
@ July 20, 2026
క్యూఆర్ కోడ్ తో పర్యాటక స్థలాల చరిత్ర
ఆంధ్రప్రదేశ్

క్యూఆర్ కోడ్ తో పర్యాటక స్థలాల చరిత్ర

చైతన్యరధం
@ July 20, 2026
తెలుగు సినిమా ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
ఆంధ్రప్రదేశ్

తెలుగు సినిమా ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

చైతన్యరధం
@ July 20, 2026
చైతన్యరధం ఈ పేపర్ 19-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-07-2026

కార్యకర్త
@ July 19, 2026
చైతన్యరధం ఈ పేపర్ 18-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-07-2026

కార్యకర్త
@ July 18, 2026
పోస్టుల భర్తీలో పారదర్శకం
ఆంధ్రప్రదేశ్

పోస్టుల భర్తీలో పారదర్శకం

చైతన్యరధం
@ July 18, 2026
ఆంధ్రప్రదేశ్

తెదేపా ఎంపీలతో సీఎం భేటీ

చైతన్యరధం
@ July 18, 2026
ఆక్వా, పొగాకు రైతుల భారం తగ్గించండి
ఆంధ్రప్రదేశ్

ఆక్వా, పొగాకు రైతుల భారం తగ్గించండి

చైతన్యరధం
@ July 18, 2026
Load More

ముఖ్య వార్తలు

ఆక్వా, పొగాకు రైతుల భారం తగ్గించండి

ఆక్వా, పొగాకు రైతుల భారం తగ్గించండి

చైతన్యరధం
@ July 18, 2026
అభివృద్ధికి రుణహస్తం

అభివృద్ధికి రుణహస్తం

చైతన్యరధం
@ July 18, 2026
పోలవరానికి పర్యాటక శోభ

పోలవరానికి పర్యాటక శోభ

చైతన్యరధం
@ July 15, 2026
పాలనలో టెక్నాలజీ అనుసంధానం

పాలనలో టెక్నాలజీ అనుసంధానం

చైతన్యరధం
@ July 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

క్యూఆర్ కోడ్ తో పర్యాటక స్థలాల చరిత్ర

క్యూఆర్ కోడ్ తో పర్యాటక స్థలాల చరిత్ర

చైతన్యరధం
@ July 20, 2026
తెలుగు సినిమా ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

తెలుగు సినిమా ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

చైతన్యరధం
@ July 20, 2026
పోస్టుల భర్తీలో పారదర్శకం

పోస్టుల భర్తీలో పారదర్శకం

చైతన్యరధం
@ July 18, 2026

తెదేపా ఎంపీలతో సీఎం భేటీ

చైతన్యరధం
@ July 18, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist