- పాడెమోసిన నందమూరి రామకృష్ణ
- పోతుగంటి సేవలు అజరామరం
- ఆయన మరణం కలచివేసిందని ఆవేదన
- భౌతికకాయాన్ని చూసి కన్నీటిపర్యంతం
కడప(చైతన్యరథం): ఎన్టీఆర్ వీరాభిమాని, నందమూరి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, కుటుంబసభ్యుడిగా మెలగిన కడపకు చెందిన టీడీపీ నాయకుడు, ఉపాధి హామీ పథకం మాజీ కౌన్సిల్ మెంబర్ పోతుగంటి పీరయ్య మృతిచెందారు. సోమవారం జరిగిన అంత్యక్రియల్లో నందమూరి రామకృష్ణ పాల్గొని పాడె మోశారు. మృతదేహాన్ని చూసి కంటతడి పెట్టుకున్నారు. ఆయనతో పాటు గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురు మూర్తి ఉన్నారు. ఈ సందర్భంగా కార్యకర్త స్థాయి నుంచి పార్టీలో రాష్ట్రస్థాయిలో గుర్తిం పు పొందిన పీరయ్యకు నందమూరి, నారా కుటుంబాలతో పాటు వ్యక్తిగతంగా తనకున్న స్నేహబంధాన్ని, ఆత్మీయతను గుర్తు చేసుకున్నారు. పీరయ్య ఆకస్మిక మరణం తమను ఎంతగానో బాధించి ందన్నారు. పార్టీ సుశిక్షితుడైన కార్యకర్తను కోల్పోయిందని, మా అందరి హృదయాల్లో పీరయ్య చెరగని ముద్రవేశారని తెలిపారు.
ప్రజాసమస్యల పరిష్కా రం, పార్టీ శ్రేణులకు వెన్నుదన్నుగా నిలవడంలో పీరయ్య ఎప్పుడూ ముందుండేవారని, ఆయన సేవలు అజరామరమని కొనియాడారు. పీరయ్య తమ కుటుంబసభ్యులలో ఒకరు.. అత్యంత ఆప్తుడు..మా కుటుంబంలో వ్యక్తిని కోల్పోవడం తమకు, పార్టీకి తీరని లోట న్నారు. కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా తాము ముందుంటామని, వారిని కాపాడు కోవటం మా కర్తవ్యమన్నారు. ఎన్టీఆర్ వీరాభిమానిగా, కడప జిల్లా నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా, టీడీపీలో చురుగ్గా పనిశారు..పార్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారు..వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు ఎన్నో ఇబ్బందులకు గురిచేసినా తలొగ్గక ప్రజాపక్షాన పోరాటం సాగించారని గుర్తుచేశారు. వైసీపీ దురాగతాలకు ఎదురొడ్డి రూ.3 వేల కోట్ల పెండిరగ్ ఉపాధి హామీ నిధులు సాధించిన విషయాన్ని గుర్తుచేశారు.
నాడు చంద్రబాబు అరెస్టుకు నిరసిస్తూ వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ 53 రోజుల పాటు నల్లదుస్తులు ధరించి కాళ్లకు చెప్పులు లేకుండా దీక్ష చేసి చంద్రబాబుపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారని, మంగళగిరి పార్టీ కార్యాలయంపై దాడి చేసినప్పుడు వైసీపీ గూండాలపై వీరోచితంగా పోరాడిన ధీరుడని కొనియాడారు. ఎవరు కష్టాల్లో ఉన్నా వెన్నంటే ఉండేవారు..గత ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయంలో కీలక భూమిక పోషించారు. వారి కుటుంబసభ్యులకు నందమూరి, నారా కుటుంబాలు, పార్టీ తరపున సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు లింగారెడ్డి, అమీర్ బాబు, పాలిశెట్టి హరిప్రసాద్, సింగారెడ్డి గోవర్ధన్‌రెడ్డి, యాదగిరి రాంప్రసాద్, జనసేన నాయకులు సుంకర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.