- పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే చర్యలు తప్పవు క్రమశిక్షణతో పని చేయాలి
- 15 లోపు గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ కమిటీల వరకు నియామకాలు పూర్తి కావాలి
- కూటమి నాయకులతో సఖ్యతగా, సమష్టిగా పనిచేయాలి
- ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
- పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా
అమరావతి (చైతన్యరథం): క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశం పార్టీలో అన్ని స్థాయిల నాయకులందరూ పార్టీ విధానాలకు కట్టుబడి పనిచేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. నేతలు ఎవరైనా పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఇకపై ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించాలని సూచించారు. అదే రోజు స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించి నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని సూచించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి ముఖ్యనేతలతో బుధవారం పల్లా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గ్రీవెన్స్ సక్రమంగా నిర్వహించడం లేదన్నారు. నాయకులు ప్రజల సమస్యలు సరైన రీతిలో పరిష్కరించి వుంటే కేంద్ర కార్యాలయంలో మంగళవారం మంత్రి లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బారు 4వేల మంది ఎందుకు వస్తారన్నారు.
15 లోపు పార్టీ కమిటీలు
ఈ నెల 15వ తేదీ లోపు నియోజకవర్గ కమిటీల నుంచి గ్రామ స్థాయి కమిటీల వరకు పార్టీ నియామకాలు పూర్తి చేయాలని డెడ్లైన్ విధించారు. ఆలోపు పూర్తి చేయలేకపోతే జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుట హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారు పేరు.. కొందరు నాయకుల వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోంది.. పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారని పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి నాయకులు వారి ప్రవర్తన మార్చుకోవాలని, పదేపదే పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ కార్యక్రమా లను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ నాయకులు నిరంతరం కృషిచేయాలి. దానికి తగ్గట్టు నియోజక వర్గాల్లో కార్యక్రమాల్లో నిర్వహిస్తూ.. క్యాడర్ను కలుపుకుంటూ.. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయా లని సూచించారు. కూటమి నేతల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తున్నందున..
అందరూ సఖ్యతతో పని చేయాలి. సంయమునం












