- వన భోజనాల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది
- గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
- కాపు కళ్యాణ మండప నిర్మాణానికి విరాళం
మచిలీపట్నం(చైతన్యరథం): పవిత్ర కార్తీకమాసంలో నిర్వహిం చే వన సమారాధనల్లో పాల్గొనడం అత్యంత సంతోషకరంగా ఉందని గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలో పలు వన సమారాధనల్లో మంత్రి పాల్గొన్నారు. కొండపల్లి ఎస్టేట్‌లో నిర్వహించిన కాపు సామాజిక వర్గీయుల ఆత్మీయ వేడుకలో పాల్గొన్నారు. నియోజక వర్గంలో కాపు కల్యాణ మండపం నిర్మాణానికి తన వంతుగా రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. టీటీడీ కల్యాణ మండపంలో యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన సమారాధన వేడుకల్లో కొలుసు పార్ధసారథితో కలిసి పాల్గొ న్నారు. గోకవరంలో ఆర్యవైశ్య వర్గీయుల వన సమారాధనల్లో పాల్గొన్నారు. వన సమారాధనల నిర్వహణతో సామాజిక సమస్య లపై చర్చ అభినందనీయమన్నారు. మానవ సంబంధాలు బలోపే తం కావడానికి ఇలాంటి వన సమారాధనలు కీలకంగా నిలుస్తా యి. నియోజకవర్గంలోని ప్రతి వర్గానికీ అండగా నిలుస్తాను. త్వరలోనే బందరు పోర్టును పూర్తి చేసుకుంటాం. స్థానికంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. అదే సమయంలో యువతకు స్కిల్ డెవలప్‌మె ంట్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి యువత భవితకు బాటలు వేయబోతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జి, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, కూటమి నాయకులు పాల్గొన్నారు.















