- పీఎం కుసుమ్ కింద మరో రెండు లక్షల కనెక్షన్లు
- త్వరలోనే టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తాం
- కనెక్షన్లు, ఉచిత విద్యుత్‌కు ఏటా రూ.12,400 కోట్లు
- విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి(చైతన్యరథం): రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. శాసనసభలో విద్యుత్ శాఖకు సంబంధించి సభ్యులు బత్తుల బలరామకృష్ణ, ఉగ్ర నరసింహారెడ్డి, బండా రు సత్యానందరావులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సోమవారం సమాధానమిచ్చారు. ఈ కూటమి ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు, ఉచిత విద్యుత్‌కు ఏడాదికి రూ. 12,400 కోట్లకు పైగా వ్యయం చేస్తుందని వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే 22,709 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని చెప్పిన ఆయ న మొత్తం 69,975 కనెక్షన్లను మంజూరు చేశామని స్పష్టం చేశారు. ఒక్కో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం కూటమి ప్రభుత్వం రూ.2.60 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు వివరిం చారు. డిస్కంలలో విద్యుత్ ఉపకరణాల ధరలు తేడా ఉండడంపై స్పందించారు. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిందని మంత్రి విమర్శించారు. స్థంభాలు, ట్రాన్స్‌మిషన్ లైన్లను అత్యధిక ధరలకు కొనుగోలు చేయడంతో మూడు డిస్కంల పరిధి లోని ధరల్లో వ్యత్యాసం ఏర్పడిరదని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఉపకరణాల కొనుగోలు ధరల్లో మార్పులు లేకుండా స్థిరీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు.
పీఎం కుసుమ్ గటి పూటే రైతులకు నిరంతర ఉచిత విద్యుత్
పీఎం కుసుమ్ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో రైతులకు పగటి పూట పూర్తిస్థాయి విద్యుత్ సరఫరాలో కొన్ని ఆటంకాలు ఏర్పడిన విషయాన్ని మంత్రి గొట్టిపాటి సభలో ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబా బు ఆదేశాల ప్రకారం పీఎం కుసుమ్ పథకం ద్వారా అతి త్వరలోనే రైతులకు 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను నిరంతరాయంగా అందించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సుమారు 4.50 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అవసరమని అంచనా వేసిన మంత్రి…ఇప్పటికే లక్ష పీఎం కుసుమ్ కనెక్షన్లు మంజూరయ్యాయని తెలిపారు. మరో రెండు లక్షల కనెక్షన్లకు సంబంధించి కేంద్రం సానుకూలంగా స్పందిం చిందని చెప్పారు. వీటికి సంబంధించి త్వరలోనే టెండర్ల ప్రక్రియ మొదలు పెడుతు న్నామని వివరించారు.
అల్యూమినియం ట్రాన్స్‌ఫార్మర్లతో దొంగతనాలకు అడ్డుకట్ట
రైతులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలనూ పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పేర్కొన్నారు. లో ఓల్టేజ్‌తో పాటు అధిక లోడ్ సమస్యలను పరిష్కరించేందుకు మూడు డిస్కంల పరిధిలో త్వరలోనే 70 సబ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా పల్నాడు, ప్రకాశం, బాపట్ల ప్రాం తాల్లో జరుగుతున్న ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలను నిలువరించడానికి ప్రత్యేక ఏర్పా ట్లు చేస్తున్నట్లు చెప్పారు. ట్రాన్స్‌ఫార్మర్లలో ఉండే రాగి వైరు కోసమే దొంగతనాలు జరు గుతు న్నాయని తెలిపారు. ఇకపై అల్యూమినియం ట్రాన్స్‌ఫార్మర్లను వినియోగించే విధం గా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అదేవిధంగా ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాల విష యంలో వెంటనే కేసులు నమోదు అయ్యేలా చూడాలని పోలీస్ సిబ్బందికి సూచిం చామని వివరించారు. రాబోయే వ్యవసాయ సీజన్ సమయానికి రైతులకు విద్యుత్ పరంగా ఎటువంటి ఇబ్బందీ లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.