- కళ్యాణదుర్గంలో భక్త కనకదాస జయంత్యోత్సవాల్లో లోకేష్
- 9 అడుగుల భక్త కనకదాస కాంస్య ఆగ్రహం ఆవిష్కరణ
- వేలాదిగా మహిళలు, స్థానిక ప్రజలతో కలిసి లోకేష్ ర్యాలీ
కళ్యాణదుర్గం (చైతన్య రథం); అనంతపురంజిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో సామాజిక తత్వవేత్త, స్వరకర్త, కురుబల ఆరాధ్య దైవం భక్త కనకదాస 538వ జయంతి రాష్ట్ర ఉత్సవాల్లో విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణ, హిందూపురం రోడ్డు, బైపాస్ సర్కిల్లో స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటుచేసిన 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. బైపాస్ సర్కిల్కు శ్రీ భక్త కనకదాస సర్కిల్ నామకరణం చేశారు. అంతకుముందు బైపాస్ సర్కిల్కు వేలాది మంది మహిళలు, స్థానిక ప్రజలతో కలిసి మంత్రి నారా లోకేష్ ర్యాలీగా వెళ్లారు. కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, ఎస్ సవిత, ఎంపీలు బీకే పార్థసారథి, అంబికా లక్ష్మీ నారాయణ, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షులు వెంకట శివుడు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు, కందికుంట వెంకట ప్రసాద్, గుమ్మనూరు జయరాం, దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్, బండారు శ్రావణిశ్రీ, తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భక్త కనకదాస వేడుకల్లో పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు.















