- పేరేచెర్ల వీఆర్వో ఇబ్బందులు
- ప్రజావినతుల్లో బాధితుడి ఫిర్యాదు
- అర్జీలు స్వీకరించిన మర్రెడ్డి, గొట్టిముక్కల
మంగళగిరి(చైతన్యరథం): మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ప్రజా వినతుల కార్యక్రమం జరిగింది. వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలు అర్జీలు అందజే శారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గొట్టిముక్కల రఘురామ రాజు, అగ్రికల్చరల్ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో అర్జీలు స్వీక రించారు. సంబంధిత అధికారులకు, నాయకులకు ఫోన్ చేసి వారి సమస్యలను పరిష్క రించాలని ఆదేశించారు.
` పేరేచెర్లకు చెందిన వీఆర్వో తనకు అన్యాయం చేస్తున్నాడంటూ షేక్ జాన్ సైదా ఫిర్యాదు చేశారు. రీ సర్వేలో భూమి తప్పుగా చూపించి అడిగితే ఇబ్బందులకు గురి చేస్తు న్నాడని వాపోయారు. తనకు న్యాయం చేయాల్సిందిగా కోరారు.
` వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నాయకులు సోపర్ల హర్షారెడ్డి, సాంబారెడ్డి తదితరులు ఇబ్బందిపెట్టారని ఒంగోలు పట్టణానికి చెందిన దావులూరి ఆదెయ్య ఫిర్యాదు చేశారు. తన ఇంటి నిర్మాణ పనులకు అడ్డు తగులుతూ దాడి చేయగా పోలీసులకు ఫిర్యా దు చేసినట్లు వివరించారు. ఆ కేసులో ఇంతవరకు పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయలేదని, తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
` వైసీపీకి చెందిన వదర్ల శీను తనను హింసిస్తున్నాడని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన కొండాపురం మండలం గొండి గుండాలపాలెం గ్రామానికి చెందిన పి.చిన్న ఫిర్యాదు చేశాడు. తనపై దాడి చేసిన శీనుపై చర్యలు తీసుకోవాలని కోరారు.
` కన్న కొడుకే కాలయముడిగా మారాడని, తనకు రక్షణ కల్పించాలని అనకాపల్లి జిల్లా రాయవరం మండలం వేమగిరి గ్రామానికి చెందిన తల్లి సరోజ ఫిర్యాదు చేశారు. రూ.15 లక్షలు అప్పు చేసి తమ కుమారుడి వివాహం చేశామని వివరించింది. తమకున్న 60 సెంట్ల భూమి అమ్మి అప్పు తీర్చబోతుంటే అడ్డుకుంటూ కొనేవారిపై దాడి చేస్తున్నా డు. ఎస్‌ఐకు చెప్పినా ఫలితం లేదని, తమకు రక్షణ కల్పించాలని కోరింది.
` ఆస్తి తగాదా విషయంలో తమ సమీప బంధువులు అకారణంగా తమపైకి దాడికి దిగుతున్నారని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామానికి చెందిన చింతలపల్లి షణ్ముఖేశ్వరి ఫిర్యాదు చేశారు. స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులే తమను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తమకు పోలీసుల నుంచి రక్షణ కల్పించాలని వినతిపత్రం అందజేసి వేడుకుంది.
` విదేశీ విద్య పథకం కింద రావాల్సిన మొత్తం గత వైసీపీ ప్రభుత్వం నిలిపి వేసింద ని తిరుపతికి చెందిన అన్నం రేష్మా వివరించారు. దాన్ని తిరిగి ఇప్పించాలని వినతిపత్రం అందజేశారు.
` సత్యసాయి జిల్లా చెన్నకొత్తపల్లె మండల ఎస్టీ కాలనీవాసులు తమకు ప్రత్యేకంగా రేషన్ షాపు మంజూరు చేయాలని కోరారు. రేషన్ పంపిణీ సమయాల్లో రెండు కిలో మీటర్ల దూరం వెళ్లి రేషన్ తెచ్చుకోవాల్సి వస్తుందని వివరించారు. దాంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.