- బడులు తెరిచేనాటికి డిఎస్సీ పూర్తిచేయాలి
- కేబినెట్ తరువాత మంత్రులతో సీఎం భేటీ
- వివిధ పథకాల అమలు తీరుపై విస్తృత చర్చ
నిజాలు సైతం నివ్వెరపోయేలా అబద్ధాల గోడలు కట్టడం `జగన్‌రెడ్డికి అవకాశవాదంతో పెట్టిన విద్య. తన అసహజ, అసమర్థ పాలనా విధానానికి మూల్యం చెల్లించుకున్న తరువాత కూడా.. పచ్చి అబద్ధాలను ప్రచారంలోకి తెచ్చి `కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్న జగన్‌ను రాష్ట్ర జనం ఏవగిస్తున్నారు. పాలనా విధానంమీదే కాదు, ప్రభుత్వంలోని విభాగాలపైనే ఏమాత్రం పట్టులేని జగన్ `కూటమిపై విషంగక్కడం.. అతని చేతగాని తనాన్ని బయటపెట్టుకోవడమే. జగన్ చెప్పిందంతా నిజమని నమ్మడానికి `రాష్ట్ర ప్రజానీకం అంత అమాయకులు కాదు. ఐదేళ్ల జగన్ పాలన అనుభవంలోకి వచ్చిన తరువాత `జగన్‌ను ఎంత ఏవగించారో.. సార్వత్రిక ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమైన వైసీపీ ఇకనైనా గ్రహించాలి. లేదంటే `జగన్‌ను, అతని పరివారాన్ని గంగలోకి విసిరేసి.. వైసీపీ ఆనవాళ్లు లేకుండా `ఏపీ చరిత్రనుంచే చెరిపేయడం పెద్ద కష్టం కాదు. కాకపోతే `ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నట్టు.. జగన్ తప్పుడు మార్గాల్లో తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ తన గోరీ తనే కట్టుకుంటున్నాడని చెప్పడానికి సందేహించక్కర్లేదు.
అమరావతి (చైతన్య రథం): ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత కొద్దిసేపు మంత్రులతో మాట్లాడారు. వచ్చే మూడు నెలలు జనంలోకి వెళ్లే పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు కీలకంగా వ్యవహరించి ప్రచారం నిర్వహించాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ‘తల్లికి వందనం’ పథకం అమలుపై మంత్రులతో చర్చించారు. ఏప్రిల్‌లో మత్స్యకార భరోసా ఇవ్వడంపై దృష్టి పెట్టాలని మంత్రులకు సూచించారు. అన్నదాత సుఖీభవకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు రాష్ట్రం మరో రూ.14 వేలు కలిపి ఇచ్చే అంశంపై దృష్టి పెట్టాలన్నారు. కేంద్రంతోపాటు మూడు విడతలుగా రాష్ట్రం ఆర్థిక సాయం ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలిపారు. బడులుతెరిచే నాటికి డీఎస్సీ పోస్టులు భర్తీ చేయాలని ఆదేశించారు.
రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెరగటానికి వీల్లేదని సీఎం తేల్చి చెప్పారు. సమగ్ర పవర్ మేనేజ్‌మెంట్‌తో రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు వీలైతే తగ్గాలే తప్ప పెరగటానికి వీల్లేదన్నారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాలను వేగవంతం చేసేలా కలెక్టర్లు, విద్యుత్ ఎస్‌ఈలకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. విద్యుత్ సంస్కరణల్లో భాగంగా 7.5 లక్షల ఉద్యోగాల హామీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఎన్ని పెట్టుబడులు అమల్లోకి వచ్చాయో ఎప్పటికప్పుడు పరిశీలించి అందుకు తగ్గట్టు ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేలోగా డీఎస్సీ నియామకాలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. నకిలీ రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
మంత్రులు గేరు మార్చాలి…
శాఖలపరంగా మంత్రుల పనితీరు మెరుగుపడాలని సీఎం అన్నారు. అందరూ గేరు మార్చాలని సూచించారు. ‘‘మొదటి ఆరు నెలలు మంత్రుల పనితీరును అంతగా పట్టించుకోలేదు. ఇకపై ఎవరినీ ఉపేక్షించను. నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ఆప్కోస్ ద్వారా కాకుండా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని శాఖల వారీగా తీసుకోవచ్చు. వాట్సప్ గవర్నెన్స్‌కు మంచి స్పందన వస్తోంది. వివిధ పథకాల అమలు తీరుపై చేయిస్తోన్న సర్వేల్లో సానుకూల స్పందన వస్తోంది’’ అని అన్నారు.
సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం
ఇకపై నాణ్యమైన, పోషక విలువలు కలిగిన సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై కేబినెట్‌లో చర్చ జరిగింది. మెనూలో చేసిన మార్పులపై సమావేశంలో లోకేశ్ వివరించారు. ప్రాంతాల వారీగా పిల్లలు ఇష్టపడి తినే విధంగా మెనూలో తీసుకొచ్చిన మార్పులను లోకేశ్ ప్రస్తావించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలుకు పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ సహకారాన్ని లోకేశ్ కోరారు. ఈ పథకం అమలుకు అవసరమైన నాణ్యమైన పోషకాలు కలిగిన సన్న బియ్యం పౌరసరఫరాల శాఖ వద్ద అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ తెలిపారు.