- రాష్ట్రం రెండోస్థానంలో నిలవడంపై సీఎం సంతోషం
- అధికారులకు బహుమతిగా అరకు కాఫీ గిఫ్ట్ ప్యాక్‌లు
అమరావతి (చైతన్య రథం): ఆర్ధిక వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో నిలవడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్ధిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్‌ను, అధికారులను అభినందించారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గాడిలో పడినందుకు ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆర్ధిక-ప్రణాళిక శాఖల ఉన్నతాధికారులను సోమవారం సచివాలయంలో ప్రత్యేకంగా ప్రశంసించారు. జిల్లా పర్యటనలో ఉన్న ఆర్ధిక శాఖా మంత్రి ముఖ్యమంత్రితో భేటీకి హాజరు కాలేకపోగా… తనను కలిసిన రాష్ట్ర ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, పలువురు ఆర్ధిక శాఖ, ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులకు బహుమతిగా అరకు కాఫీ గిఫ్ట్ ప్యాక్‌లు అందించారు.