- 335 మద్యం దుకాణాల కేటాయింపు
- లైసెన్స్ ఫీజులో 50 శాతం రాయితీ
- కల్లుగీత కార్మికులను బాబు కాపాడారు
- కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి
అమరావతి(చైతన్యరథం): గీత కులస్తులకు యువత నేత నారా లోకేష్ యువగ ళం పాదయాత్రలో ఇచ్చిన హమీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీని నెరవే రుస్తూ జీవో 13 ద్వారా గీత కులస్తులకు మద్యం దుకాణాల్లో 10 శాతం వాటా కింద 335 మద్యం దుకాణాలను కేటాయించారని గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ఆయన మద్యం దుకాణాల లైసెన్స్ ఫీజులోనూ 50 శాతం రాయితీని అందిం చడం ద్వారా వారి ఆర్థికాభివృద్ధికి కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. గీత కార్మికుల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం గీసేవానికే చెట్టు పథకాన్ని తీసుకువస్తే వైసీపీ ప్రభుత్వం దోచుకునే వారిదే పాలసీని అనుసరించిందని విమర్శించారు. ఉమ్మ డి ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ పట్టణాలకు 55 కిలోమీటర్ల పరిధిలో ఉండాలని జీవో తీసుకొచ్చారు. గత ఐదేళ్ల పాలనలో జగన్రెడ్డి జీవో 693 తీసుకొచ్చి 100 కిలోమీట ర్ల దూరంలో కల్లు దుకాణాలు ఉండాలని నిబంధనలు పెట్టారని గుర్తు చేశారు. గీత కార్మికులకు 50 ఏళ్లకే పింఛన్ టీడీపీ హయాంలో ఇవ్వడం జరిగిందని తెలిపారు. వారికి రూ.105 కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో గీత కార్మికుల కోసం 60 ఎకరాల భూమిని కేటాయించి నీరా తాడి పరిశ్రమను స్థాపించేందుకు కృషి చేసినట్లు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలు కల్పనలో భాగంగా రాబోయే ఐదేళ్లలో చిన్న పరిశ్రమల ద్వారా ఉద్యోగాలు సృష్టిస్తామని అన్నారు. బీసీలకు స్థానిక సంస్థలలో 33 శాతం రిజర్వేషన్లు టీడీపీ ప్రభుత్వం కల్పించడం ద్వారా రాజ్యాధికారంలో భాగం కావడం సాధ్యమైందని చెప్పారు. గత వైసీపీ పాలనలో 10 శాతం రిజర్వేషన్ తగ్గించడం వల్ల 18 వేల మంది బీసీలు రాజకీయ పదవులకు దూరం అయ్యారని ఆరోపించారు. విదే శీ విద్య ద్వారా బీసీ విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకునే అవకాశం టీడీపీ ప్రభు త్వం కల్పించిందన్నారు. బీసీల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 2024-25 బడ్జెట్లో బీసీల అభివృద్ధి కోసం రూ.37,970 కోట్లు కేటా యించడం జరిగిందని, రాబోయే రోజుల్లో కుట్టు మిషన్లు, పాడి గేదెలు, గొర్రెల పెంప కం, జనరిక్ మెడిసిన్ షాపులు ద్వారా బీసీలకు 50 శాతం అవకాశాలు కల్పించి వారి అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు.