చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం

విజయనగరం సభలో యువత ప్రశ్నలకు యువనేత లోకేష్‌ సమాధానాలు

by చైతన్యరధం
May 8, 2024 at 6:07am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

విజయనగరం: ఒక రాష్ట్రం.. ఒకటే రాజధాని అనేది తమ విధానమని, అదే సమయంలో అభివృద్ధి వికేంద్రీకరణతో రాష్ట్రమంతటా పరిశ్రమలు స్థాపించి, అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకూ సమానంగా అందించాలనేది తమ ఆలోచన అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలనూ సమగ్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. విజయనగరంలోని ఎంఆర్‌ స్టేడియం గ్రౌండ్‌లో మంగళవారం నిర్వహించిన యువగళం సభలో యువనేత పాల్గొన్నారు. జర్నలిస్టు గోపి యాంకర్‌గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో యువత అడిడిన ప్రశ్నలకు యువనేత లోకేష్‌ సమాధానాలు ఇచ్చారు.

జర్నలిస్ట్‌ గోపి: ఉత్తరాంధ్రకు టీడీపీ హయాంలో తీసుకువచ్చిన పరిశ్రమల గురించి మీరు వివరించారు. 2019లో మీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఈ రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉండేది?
నారా లోకేష్‌: 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌, అదానీ డేటా సెంటర్‌ పూర్తయి ఉండేవి. విశాఖలో లక్ష మందికి ఐటీ ఉద్యోగాలు వచ్చి ఉండేవి. అనేక కంపెనీలను లైనప్‌ చేశాం. అనేకమంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అశోక్‌ గజపతిరాజు లాంటి పెద్దవాళ్లను, కంపెనీలను ఇబ్బంది పెట్టడంతో పారిశ్రామికవేత్తలు ఏపీ వద్దని పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయారు. అమర్‌రాజా సంస్థ పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోవడం వల్ల 20వేల ఉద్యోగాలు కోల్పోయాం. లూలూ వెళ్లిపోవటం వల్ల 20వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇలా దాదాపు 20 లక్షల మంది యువత ఉద్యోగాలను కోల్పోయారు. ఆనాడు ఉత్తరాంధ్రను ఫార్మాహబ్‌గా చేయాలని మేం సంకల్పించాం. అందుకే ఎయిర్‌పోర్ట్‌ కు పెద్దఎత్తున భూసేకరణ చేశాం. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వల్ల పెద్దఎత్తున అభివృద్ధి జరిగింది. అదేవిధంగా భోగాపురం విమానాశ్రయం వచ్చి ఉంటే ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోయి ఉండేవి. ఆనాడు అశోక్‌ గజపతిరాజు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లింది. ఆయన నాయకత్వంలోనే భూసేకరణ జరిగింది. అప్పుడు మేం చేసిన శంకుస్థాపనకే ఇప్పుడు జగన్‌ రెడ్డి వంగలేక రాయి పైకి తీసుకుని మళ్లీ కొబ్బరికాయ కొట్టారు. జగన్‌ రెడ్డికి మార్కెటింగ్‌ పిచ్చి ఎక్కువ. దీంతో రాష్ట్రం నష్టపోయింది.

సంబంధితవార్తలు

కేంద్రమంత్రి కుమారస్వామికి లోకేష్‌ ధన్యవాదాలు

మాట మార్చుడు లేదు.. మడమ తిప్పుడు లేదు!

ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఎస్‌ఎస్‌సి, ఇంటర్‌

ప్రసాద్‌: నేను బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ను. రీసెంట్‌ సెలెక్షన్స్‌లో కూడా ఎంపికయ్యాను. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడాలని నా కోరిక. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదు. మన ప్రభుత్వంలో క్రీడల అభివృద్ధికి ఏం చర్యలు తీసుకుంటారు?
నారా లోకేష్‌: అన్ని రంగాల్లో తెలుగువారు నెం.1గా ఉన్నారు. ఒక్క క్రీడల్లో తప్ప. క్రికెట్‌లో తెలుగువారు తక్కువగా ఉన్నారు. బ్యాడ్మింటన్‌లో ఈ మధ్య కొంతమంది రాణించారు. గోపిచంద్‌ బ్యాడ్మింటన్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించినప్పుడు చంద్రబాబు హైదరాబాద్‌లో భూమి ఇచ్చి ప్రోత్సహించారు. దీంతో అద్భుతమైన అకాడమీని ఏర్పాటుచేశారు. చంద్రబాబు క్రీడలను బాగా ప్రోత్సహించారు. మినీ స్టేడియంలు, ఇండోర్‌ స్టేడియంలు మన హయాంలో నిర్మించినవే. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది. నంద్యాలకు చెందిన ఒక వ్యక్తికి ఇచ్చారు. ఆయన ఎప్పుడూ టిక్‌ టాక్‌, యూట్యూబ్‌ వీడియోల్లో బీజీగా ఉంటారు. ఆయన ఏనాడూ క్రీడాకారుల గురించి పట్టించుకోలేదు. మన రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో ఆడేవారికి కిట్లు కూడా ఇవ్వలేదు. నేను ట్వీట్‌ పెట్టిన తర్వాత కిట్లు ఇచ్చారు. ముఖ్యమంత్రి బాధ్యత కేవలం బటన్‌ నొక్కడం కాదు.. విజన్‌ ఉండాలి. అది మన ముఖ్యమంత్రికి లేదు. జగన్‌ సగం చూపు ఎప్పుడూ జైలు వైపే. తప్పులు చేశారు కాబట్టి ఆయన చూపు జైలు వైపే. దానివల్ల మనం నష్టపోయాం. మేం వచ్చిన తర్వాత గతంలో ప్రారంభించిన మినీస్టేడియాలు, ఇండోర్‌ స్టేడియాలు పూర్తిచేస్తాం. నియోజకవర్గాల వారీగా లీగ్‌ లు ఏర్పాటుచేస్తాం. అక్కడి నుంచి స్టేట్‌ లీగ్‌లు ఏర్పాటుచేసి యువతను ప్రోత్సహిస్తాం. క్రికెట్‌లో కూడా తెలుగువారు ఉండేలా చర్యలు తీసుకుంటాం. మంగళగిరిలో ప్రీమియం లీగ్‌ లు ఏర్పాటుచేసి యువతను ప్రోత్సహిస్తాం. ఆ మోడల్‌ ఇతర నియోజకవర్గాల్లో కూడా తీసుకువస్తాం.

వనిత: మన రాజధాని ఏది అని అడిగితే సమాధానం రావడం లేదు. ఆ గతి పట్టించారు మన జగన్మోహన్‌ రెడ్డి. రాష్ట్ర విభజన తర్వాత మీరు అమరావతి రాజధాని అన్నారు. వైసీపీ వచ్చిన తర్వాత 3 రాజధానులు అంటున్నారు. మీరు వచ్చిన తర్వాత రాజధానిని నిర్ణయించడంతో పాటు ఎప్పుడు అభివృద్ధి చేస్తారు?
నారా లోకేష్‌: చంద్రబాబు ఆనాడు అసెంబ్లీ సాక్షిగా ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని ఏర్పాటుతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణకు కృషిచేశారు. రాష్ట్రం నడిబొడ్డున ఉన్న అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. ఇప్పటికే చిన్న రాష్ట్రం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం ఇష్టం లేదని, అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు జగన్‌ రెడ్డి చెప్పారు. రాజధానికి కనీసం 30వేల ఎకరాలు కావాలని చెప్పారు. చంద్రబాబు పిలుపుతో రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. సచివాలయం, అసెంబ్లీ అక్కడే ఉన్నాయి. ఒక్క అవకాశం పేరుతో వచ్చిన జగన్‌ రెడ్డి మూడు ముక్కలాట ఆడారు. న్యాయ రాజధాని, ఎకనామికల్‌ కేపిటల్‌, లెజిస్టేటివ్‌ కేపిటల్‌ అన్నారు. కర్నూలులో హైకోర్టుకు ఒక్క ఇటుక వేయలేదు, హైకోర్టుకు భూసేకరణ కూడా చేయలేదు. అమరావతిలో ప్రజావేదిక విధ్వంసంతో పాలన ప్రారంభించారు. విశాఖను పరిపాలన రాజధాని అని ఒక్క ఇటుక వేయలేదు. రుషికొండకు గుండు కొట్టి ఒక వ్యక్తి బతికేందుకు రూ.550 కోట్లు ఖర్చుపెట్టి విలాసవంతమైన ప్యాలెస్‌ కట్టుకున్నారు. ఆ డబ్బుతో విజయనగరంలో పేదలకు ఇళ్లు నిర్మించవచ్చు. ఉత్తరాంధ్రలో ఒక్క పరిశ్రమ నెలకొల్పలేదు, ఉద్యోగం కల్పించలేదు. ఉత్తరాంధ్రలో ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు, గంజాయి. పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పరిశ్రమల స్థాపన అంటూ వార్తలు చూస్తున్నాం. పరిపాలనా సౌలభ్యం కోసం ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని అమరావతి అనేది మా నినాదం. కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. 13 ఉమ్మడి జిల్లాలకు ఒక్కో జిల్లాకు ఒక్కో ప్రాధాన్యత ఇచ్చారు చంద్రబాబు. అనంతలో కార్లు తయారుచేసే కంపెనీలు, చిత్తూరులో సెల్‌ ఫోన్లు, టీవీలు తయారుచేసే కంపెనీలు, కడప స్పోర్ట్‌ కేపిటల్‌, కర్నూలు రెన్యూవబుల్‌ ఎనర్జీ పెట్టుబడులు, సిమెంట్‌ పరిశ్రమలు, ఉత్తరాంధ్రలో విశాఖను ఐటీ హబ్‌గా చేద్దాం. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం, ఫార్మా హబ్‌గా చేస్తాం. గతంలో చేసి చూపించాం. మేం అనేక పెట్టుబడులు తీసుకువచ్చాం. ఒక్క నెల ఓపిక పట్టండి. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తాం.

జర్నలిస్ట్‌ గోపి: రాజధాని ఎక్కడో చెప్పుకోలేని పరిస్థితి? రాష్ట్ర రాజధాని ఇది అని గర్వంగా చెప్పుకోవడానికి అందరూ ఎదురుచూస్తున్నారు.
నారా లోకేష్‌: ఐదు కోట్ల ఏపీ ప్రజలు గర్వపడే విధంగా అమరావతిని నిర్మిస్తాం. పొరుగు దేశాలకు వెళ్లినప్పుడు మీది ఏపీనా, అమరావతా.. అద్భుతంగా ఉంది అని గర్వపడేలా చేస్తాం. అదే సమయంలో అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తాం. గతంలో అడుగులు వేశాం, పెట్టుబడులు తీసుకువచ్చాం. అన్ని జిల్లాలను సమగ్రంగా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం.

మాధురి: నేను బీటెక్‌ చదివాను. మాకు ఎలాంటి ఉద్యోగాలు లేవు. నైపుణ్య శిక్షణ కేంద్రాలు కూడా లేవు. ఐటీ కంపెనీలు కూడా లేవు. మీరు వస్తే మాకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారా?
నారా లోకేష్‌: చంద్రబాబు అంటే ఒక బ్రాండ్‌. జగన్‌ రెడ్డి అంటే జైలు. చంద్రబాబుని చూస్తే ఆటోమేటిక్‌గా కంపెనీలు వస్తాయి. మొదటి వంద రోజుల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు విశాఖలో అనేక ఐటీ పరిశ్రమలు తీసుకువచ్చాను. ఇవాళ పొరుగు రాష్ట్రాలకు తరిమివేశారు. నేను అనేక మంది పారిశ్రామికవేత్తలను కలిశాను. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరా. వారు ప్రోత్సహకాలు ఇవ్వాలని అడిగారు. తెల్లకాగితం ఇచ్చి మీకు ఎలాంటి ప్రోత్సహకాలు కావాలో రాయండి.. దానికింద ఎంత మందికి ఉద్యోగాలు కల్పించాలో నేను రాస్తా. ఆ ఒక్క నెంబర్‌ పైనే మీపై ఒత్తిడి తెస్తానని చెప్పా. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు వెళ్తాం. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుని అక్రమంగా 53 రోజులు జైల్లో పెట్టారు. ఎక్కడున్నా సింహం సింహమే. చంద్రబాబు సింహంలా బయటకు వచ్చారు. యువతకు నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల ద్వారా 2.30 లక్షల మందికి శిక్షణ ఇవ్వగా లక్షా 20వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. మేం వచ్చిన తర్వాత స్కిల్‌ అప్‌ గ్రెడేషన్‌ కార్యక్రమాలు చేపడతాం. ఏపీకి పెద్దఎత్తున పరిశ్రమలు వస్తాయి. ఉద్యోగాల కల్పన జరుగుతుంది.

జర్నలిస్ట్‌ గోపి: చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు భువనేశ్వరి ఒక ట్వీట్‌ చేశారు. ఎవరైనా అరెస్ట్‌ అయితే వారి అక్రమాలు బయటకు వస్తాయి. చంద్రబాబు అరెస్ట్‌ అయితే ఆయన చేసిన అద్భుతాలు బయటకు వచ్చాయన్నారు. దీనిని ఎలా చూస్తారు?
నారా లోకేష్‌: నా తల్లి సూపర్‌. నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను, ప్రజల ముందుకు వచ్చానంటే కారణం నా తల్లి. చంద్రబాబు రాజకీయాల్లో, ప్రజాసేవలో బిజీగా ఉండేవారు. నేను బాగా చదువుకోవాలి, దేశానికి సేవ చేయాలని అమ్మ ఆశించేవారు. అదేవిధంగా నన్ము ప్రోత్సహించారు. అమ్మ ఏనాడు బయటకు రాలేదు. రాజకీయాలు చేయలేదు. ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా బయటకు రాలేదు. ఎప్పుడైతే జగన్‌ రెడ్డి చంద్రబాబుని అరెస్ట్‌ చేశారో అప్పుడు బయటకు వచ్చారు. యుద్ధం చేశారు. మా తల్లిని కూడా అవమానించారు. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే శాసనసభలో అడుగుపెడతానని చంద్రబాబు చెప్పారు. మహిళా మంత్రి, జబర్దస్త్‌ రోజా మహిళలను కించపరిచేలా నాకు చీర, గాజులు పంపిస్తానని చెప్పారు. ఐదేళ్లలో 31వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని పవనన్న చాలా స్పష్టంగా చెప్పారు. వీరు ఎక్కడ ఉన్నారో తెలియదు. డ్రగ్స్‌ వాళ్లు పట్టుకుపోయారా, బ్లేడ్‌బ్యాచ్‌ వాళ్లు పట్టుకుపోయారో తెలియదు. మహిళల్లో కూడా చైతన్యం రావాలి. కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం ద్వారానే శాంతిభద్రతలు ఉంటాయి.

హేమంత్‌: నేను లా స్టూడెంట్‌ను. జగన్‌ రెడ్డి జీవో నెం. 3ను రద్దు చేశారు. దీనివల్ల గిరిజన ఉపాధ్యాయులు, విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఎంత నిరసన తెలిపినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. మీరు వచ్చిన తర్వాత ఏం చర్యలు తీసుకుంటారు? యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల రిక్రూట్‌మెంట్‌ జరగడం లేదు. మీరు ఏం చర్యలు తీసుకుంటారు?
నారా లోకేష్‌: జీవో నెం.3 విషయంలో న్యాయపోరాటం చేస్తాం, జీవోను పునరుద్ధరిస్తాం. జగన్‌ రెడ్డి 117 జీవోను తీసుకువచ్చి విద్యను ప్రజలకు దూరం చేశారు. ఆ జీవోను రద్దు చేస్తాం. విద్యను మీ వద్దకు తీసుకువస్తాం. ఉపాధ్యాయులను నియమిస్తాం.

యువకుడు: జగన్‌ రెడ్డి ప్రతి ఏటా జాబ్‌ కేలండర్‌ ఇస్తానని చెప్పి మాట తప్పారు. చివరి ఏడాదిలో పోలీస్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు. 2023 నవంబర్‌లో పోలీస్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. దానితర్వాత పీఎన్టీ లేదు, మెయిన్‌ ఎగ్జామ్‌ లేదు. కేసులని తప్పించుకుంటున్నారు. కనీసం అప్‌డేట్‌ లేదు. మీరు వచ్చిన తర్వాత ఖాళీలు భర్తీచేయాలి.
నారా లోకేష్‌: మొదటి ఆరు నెలల్లో ఆ పోస్టులు భర్తీ చేస్తాం. ఉత్తరాంధ్రలో సైన్యంలో పనిచేసే వారు ఎక్కువగా ఉన్నారు. వీరి కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటుచేస్తాం. వచ్చే ఐదేళ్లలో పోలీసు శాఖలో రిక్రూట్‌మెంట్‌లు చేస్తాం.

యువకుడు: విజయనగరంలో చదువుకున్న యువత ఎక్కువగా ఉన్నారు. కానిస్టేబుళ్ల నియామకం విషయంలో విజయనగరానికి తక్కువ పోస్టులు ఉంటున్నాయి. వీటిని పెంచాలి.
నారా లోకేష్‌: మంచి సలహా ఇచ్చారు. ఇది నేను టేకప్‌ చేస్తా.

జర్నలిస్ట్‌ గోపి: నోటిఫికేషన్లు, ఉద్యోగాల గురించి యువత ఎక్కువగా అడుగుతున్నారు. విద్యాశాఖ మంత్రి ఇక్కడనుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ ఇంటర్‌ ఉత్తర్ణీత తక్కువగా ఉంది. ఇక యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి?
నారా లోకేష్‌: విద్యాశాఖ మంత్రిని చూస్తే బాధేస్తోంది. మేం వచ్చిన తర్వాత కేజీ నుంచి పీజీ వరకు కరిక్యులమ్‌ రీవ్యాంప్‌ చేస్తాం. స్కూల్‌, పీజీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌, విదేశీ విద్య, బెస్ట్‌ అవైలబుల్‌ పథకాలను పునరుద్ధరిస్తాం.

సుప్రియ: నేను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాను. నేను అన్నింటిని వదిలి పొరుగు రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి. ఇక్కడకు ఎంఎన్‌సీలను తీసుకువస్తారా?
నారా లోకేష్‌: మేం వచ్చిన తర్వాత ఎంఎన్‌సీ కంపెనీలను తీసుకువస్తాం. గతంలో మేం అదానీ డేటా సెంటర్‌ తీసుకువచ్చాం. బిగ్‌డేటా తీసుకువచ్చాం. ఫిన్‌ టెక్‌ తీసుకువచ్చాం. ఎకో సిస్టమ్‌ ఏర్పాటుచేశాం. అంత్రోపెన్యూర్‌ అంటే ఏమిటో జగన్‌ రెడ్డికి తెలియదు. తిరిగి విశాఖను ఐటీ రాజధానిగా చేసే బాధ్యత మేం తీసుకుంటాం.

హిమ: జగన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎన్నో అప్పులు చేసి, దోచుకున్నారు. ఆ లెక్కలేమీ మాకు తెలియదు. మీరు చెబుతారా?
నారా లోకేష్‌: అవినీతిపరుల ఆట కట్టించేందుకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని ప్రధాని మోదీ చాలా స్పష్టంగా చెప్పారు. మేం వదిలిపెట్టం. ఇసుక, మద్యం, భూకబ్జాల ద్వారా దోచుకున్నారు. ఓట్లు కొనుగోలు చేసేందుకు ఆ డబ్బుతోనే వస్తారు. అవి మన డబ్బులే. మన సొమ్మే. తీసుకుని సైకిల్‌ కు ఓటు వేయాలి.

యశస్వి భార్గవి: ఇప్పుడు పేదలకే అన్ని అవకాశాలు, వసతులు సమకూరుస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మీరేం చేస్తారు? రుషికొండ ప్యాలెస్‌ను ఏం చేస్తారు?
నారా లోకేష్‌: చంద్రబాబు ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. టీఏ, డీఏ సకాలంలో ఇచ్చారు. ఏపీ అభివృద్ధిలో ప్రభుత్వ ఉద్యోగులది కీలకపాత్ర. నెల రోజులు ఓపిక పట్టండి.. ఉద్యోగులకు సకాలంలో జీతం, పెన్షన్‌ అందించేలా చర్యలు తీసుకుంటాం. చంద్రబాబుకి నిర్మించడమే కానీ కూల్చివేయడం తెలియదు. చిన్న చీమను కూడా ఏం చేయరు. పిల్లల భవిష్యత్‌ కోసమే నిరంతరం తపిస్తారు. వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే కుటుంబ పరిస్థితులు మారతాయని బలంగా నమ్ముతారు. నెల రోజులు తర్వాత రుషికొండ భవనాన్ని ఎలా వినియోగించాలో పరిశీలిస్తాం. అక్కడ నుంచి ఒక్క ఇటుక కూడా తీయబోము.

సత్తిరాజు: నేను ఐటీఆర్‌ కట్టడం వల్ల పథకాలేవీ అందడం లేదు. ఫాం-26 ఇచ్చినా ఫలితం లేదు. నా కూతురుకు అనారోగ్య సమస్య ఉన్నా పెన్షన్‌ రావడం లేదు. మీరు వచ్చిన తర్వాత నాలాంటి వారికి ఏవిధంగా న్యాయం చేస్తారు?
నారా లోకేష్‌: గతంలో ఏ విధంగా చేశామో అదేవిధంగా లబ్ధిదారులను గుర్తించి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాం. వాలంటీర్‌ వ్యవస్థను కొనసాగిస్తాం. పెన్షన్‌తో పాటు అన్ని సంక్షేమ కార్యక్రమాలు మీ గడప దగ్గరకే అందిస్తాం. చంద్రబాబు 120 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. చంద్రన్న బీమా, పెళ్లి కానుక, పసుపు కుంకుమ అందజేశాం. పట్టణానికి పనికోసం వస్తే అన్న క్యాంటీన్‌ ద్వారా భోజనం పెట్టాం. జగన్‌ రెడ్డి రద్దు చేసిన సంక్షేమ కార్యక్రమాలు పునరుద్ధరించే బాధ్యత మేం తీసుకుంటాం.

బోధన్‌ కుమార్‌ : 500లకు పైగా జనాభా ఉన్న గిరిజన తండాలను పంచాయతీలుగా మారుస్తామని హామీ ఇచ్చి జగన్‌ రెడ్డి మోసం చేశారు. మీరు గిరిజనుల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు?
నారా లోకేష్‌: టీడీపీ హయాంలో గిరిజనులకు అందాల్సిన నిధులు సబ్‌ప్లాన్‌ ద్వారా అందించాం. కార్పొరేషన్‌ ద్వారా గిరిజనులను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చే లక్ష్యంతో పనిచేశాం. విద్యను పెద్దఎత్తున ప్రోత్సహించాం. బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, విదేశీవిద్య లాంటి కార్యక్రమాలు అమలు చేశాం. ఏపీకి ఐటీడీఏను తీసుకువచ్చింది అన్న ఎన్టీఆర్‌. నేడు ఐటీడీఏకు నిధులు లేవు. మేం వచ్చిన తర్వాత నిధులు కేటాయిస్తాం. ఆ నిధులు గిరిజనుల అభివృద్ధి కోసం ఖర్చుచేస్తాం. గిరిజన తండాలను పంచాయతీలుగా ఏర్పాటుచేసే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. గిరిజనులంటే జగన్‌ రెడ్డికి చిన్నచూపు. జగన్‌ నిలిపివేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వంలో తిరిగి ప్రారంభిస్తాం.

జర్నలిస్ట్‌ గోపి: రాష్ట్రపతిగా గిరిజన మహిళ ఉన్నారు. మీ ప్రభుత్వం వస్తే గిరిజనులకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు?
నారా లోకేష్‌: గతంలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. అందుకు ఐటీడీఏ ఒక ఉదాహరణ. ఆరోగ్యం, రోడ్లు, తాగునీరు అందించేందుకు కృషిచేశాం. ఇంకా సమస్యలు ఉన్నాయి. నిలిపివేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తాం. రాజకీయంగా గిరిజనులను ప్రోత్సహించింది తెలుగుదేశం. 2019లో గిరిజన ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించలేదు. ప్రజలపై కూడా బాధ్యత ఉంది. కూటమి బలపర్చిన గిరిజన అభ్యర్థులను గెలిపిస్తే రాజకీయంగా మెరుగైన అవకాశాలు వస్తాయి. మంత్రివర్గంలో కూడా కీలక బాధ్యతలు వహిస్తారు.

యువతి: ఎండ తీవ్రత వల్ల నీటి సమస్య ఎక్కువగా ఉంది. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తామని జగన్‌ రెడ్డి హామీ ఇచ్చి మాటతప్పారు. మీరు వచ్చిన తర్వాత నీటి సమస్యను పరిష్కరించాలి.
నారా లోకేష్‌: ఆగిపోయిన పోలవరం పనులు ప్రారంభిస్తాం. గ్రావిటీ ద్వారా ఉత్తరాంధ్రకు నీరు అందిస్తాం. ఉత్తరాంధ్రకు సుజల స్రవంతి ప్రాజెక్టు కీలకమైంది. దానిని పూర్తిచేస్తాం. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం.

జర్నలిస్ట్‌ గోపి: నదుల అనుసంధానం చేస్తే ఉత్తరాంధ్రకు తాగునీటి కొరత ఉండదు. నదుల అనుసంధానానికి భరోసా ఇస్తారా?
నారా లోకేష్‌: ప్రధాని చాలా స్పష్టంగా పోలవరం గురించి మాట్లాడారు. ఏపీకి జీవనాడి పోలవరం. ఆ ప్రాజెక్టును పూర్తిచేస్తాం. పోలవరం జలాలు రాయలసీమ, ఉత్తరాంధ్రకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న గ్యాప్స్‌ ఉంటే నదులు అనుసంధానం చేసి ప్రతి ఎకరాను సాగులోకి తీసుకువస్తాం. ప్రతి గడపకు సురక్షితమైన తాగునీరు అందిస్తాం. ఆ లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది.

యువతి: ఇక్కడున్న విద్యార్థులందరూ మధ్యతరగతి నుంచి వచ్చిన వారే. జగన్‌ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సరిగా అందిండం లేదు. మీరు వచ్చిన తర్వాత ఇబ్బందులు తొలగించాలి. విద్యార్థులు పార్ట్‌ టైం జాబ్‌ చేసుకుంటూ చదువుకుంటున్నారు.
నారా లోకేష్‌: గతంలో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానాన్ని అమలుచేస్తాం. ఇప్పుడు హాల్‌ టికెట్‌, మార్కుల లిస్ట్‌ కావాలంటే డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. విద్యకు ఎంత ఖర్చైనా పర్వాలేదు.. పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటాం. పార్ట్‌ టైం ఉద్యోగం మంచి ఆలోచన. నేను అమెరికాలో ఉన్నప్పుడు కంపెనీలో చేరి మూడు నెలలు పనిచేసేవాడిని. నాలుగు వేరేవేరు కంపెనీల్లో పనిచేశా. దానివల్ల నాకు క్రమశిక్షణ వచ్చింది. పార్ట్‌ టైం జాబ్‌ చేయడంలో తప్పులేదు.

రాజశేఖర్‌: మన ప్రభుత్వం వచ్చాక యూనివర్సిటీలను ఏవిధంగా అభివృద్ధి చేస్తారు? జగన్‌ రెడ్డి హయాంలో ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో రెండు యూనివర్సిటీలు మాత్రమే ఉన్నాయి. మరోవైపు 25 ఎంపీ సీట్లు వస్తే ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పి మాట తప్పారు. మీరేం చేస్తారు?
నారా లోకేష్‌: ఈ రోజు యూనివర్సిటీలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి. దీంతో ర్యాంకింగ్‌లో మన యూనివర్సిటీలు పడిపోయాయి. యూనివర్సిటీ గ్రాంట్లు పక్కదారి పట్టించారు. మన ప్రభుత్వంలో యూనివర్సిటీల నుంచి రాజకీయాలను దూరం చేస్తాం. మెరుగైన విద్య అందిస్తాం. మూడేళ్లలో మన యూనివర్సిటీలు టాప్‌-20లో వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ఆగిపోయిన అమరావతి పనులు పూర్తిచేయాలి. పోలవరం పూర్తిచేయాలి. వెనుకబడిన జిల్లాలకు నిధులు తీసుకురావాలి. పెట్టుబడులు ఏపీకి రావాలంటే కేంద్ర సహకారం చాలా అవసరం. గ్రామాల అభివృద్ధికి ఉపాధి హామీ నిధులు కావాలి. ఇళ్లు కట్టాలంటే కేంద్ర సహకారం అవసరం. బీజేపీతో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంది అందుకోసమే. యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేం తీసుకుంటాం.

యువకుడు: ఏయూలో పీజీ చేశాను. యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ కు గత టీడీపీ ప్రభుత్వం రుణ ప్రోత్సాహకం 35శాతం ఇచ్చారు. జగన్‌ రెడ్డి 45 శాతం ఇస్తామని చెప్పి మోసం చేశారు. మన ప్రభుత్వంలో ఏం చర్యలు తీసుకుంటారు?
నారా లోకేష్‌: మన ప్రభుత్వం వచ్చిన వెంటనే దామాషా ప్రకారం ఉపకులాల వారీగా నిధులు కేటాయించి కార్పొరేషన్లను బలోపేతం చేస్తాం. ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకువస్తాం. గతంలో కార్పొరేషన్ల ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టాం. 2 లక్షల మందికి సబ్సిడీలు ఇచ్చి పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చాం. ఆ విధానం తిరిగి తీసుకువస్తాం.

యువకుడు:
నేను డిగ్రీ చదువుకుని ఉద్యోగాలు లేక ఆటో నడుపుకుంటున్నాను. ఆటోలో ఎక్కువమందిని ఎక్కించుకునే వెసులుబాటు కల్పించాలి.
నారా లోకేష్‌: పోలీసులకు జగన్‌ రెడ్డి టార్గెట్‌ పెట్టి ఇష్టానుసారంగా చలాన్లు రాయిస్తున్నారు. వేధింపుల నుంచి విముక్తి కలిగిస్తాం. గ్రీన్‌ ట్యాక్స్‌, ఆ ట్యాక్స్‌ అని వేస్తున్నారు. ఆటో కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుచేస్తాం. ఆటో డ్రైవర్లను ఆటో యజమానులను చేస్తాం.

యువకుడు: మాది సాధారణ రైతు కుటుంబం. విజయనగరంలో అద్దెకుండి చదువుకుంటున్నాను. జగన్‌ రెడ్డి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. మన ప్రభుత్వం వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. అప్పటివరకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మన ప్రభుత్వంలో జూన్‌ నెల నుంచే నిరుద్యోగ భృతి ఇవ్వాలి.
నారా లోకేష్‌: మన ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే నిరుద్యోగ భృతి అమలుచేస్తాం. యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాం. ఏపీని జాబ్‌ కేపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా తీర్చిదిద్దుతాం.

Tags: నారా లోకేష్ యువగళంముఖాముఖి సమావేశంయువగళం సభయువత భవిష్యత్యువనేత నారా లోకేష్‌విజయనగరం
Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 07-05-2024

Next Post

చివరిశ్వాస వరకు కుప్పం ప్రజలకు రుణపడి ఉంటాం

మరిన్ని వార్తలు

ఆంధ్రప్రదేశ్

మహానాడు ఏర్పాట్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా సమీక్ష

చైతన్యరధం
@ May 18, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో..టీడీపీ అభ్యర్థుల విజయం ఖాయం
ఆంధ్రప్రదేశ్

మన త్రివిధ దళాలకు శిరసాభివందనం

చైతన్యరధం
@ May 18, 2025
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

చైతన్యరధం
@ May 18, 2025
చైతన్యరధం ఈ పేపర్ 18-05-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-05-2025

కార్యకర్త
@ May 18, 2025
ఆర్ధిక వృద్ధి గ్రేట్‌
ఆంధ్రప్రదేశ్

బల్లెం వీరుడి ప్రదర్శన భేష్‌ 

చైతన్యరధం
@ May 18, 2025
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర విద్యార్థి హార్డీకి మాస్టర్‌ స్పెల్లర్‌ అవార్డ్‌

చైతన్యరధం
@ May 18, 2025
మహిళలకు శుభవార్త ..ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం
ఆంధ్రప్రదేశ్

మహిళలకు శుభవార్త ..ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం

చైతన్యరధం
@ May 18, 2025
ప్రధాని మోదీతో మంత్రి లోకేష్‌ భేటీ
ఆంధ్రప్రదేశ్

ప్రధాని మోదీతో మంత్రి లోకేష్‌ భేటీ

చైతన్యరధం
@ May 18, 2025
Load More

ముఖ్య వార్తలు

రాష్ట్ర విద్యార్థి హార్డీకి మాస్టర్‌ స్పెల్లర్‌ అవార్డ్‌

చైతన్యరధం
@ May 18, 2025
ప్రధాని మోదీతో మంత్రి లోకేష్‌ భేటీ

ప్రధాని మోదీతో మంత్రి లోకేష్‌ భేటీ

చైతన్యరధం
@ May 18, 2025
20 లక్షల ఉద్యోగాలు..హామీ నిలబెట్టుకుంటాం

దేశ క్లీన్‌ ఎనర్జీ విప్లవానికి పునాదిరాయి రెన్యూ!

చైతన్యరధం
@ May 17, 2025
అడుగడుగునా జేజేలు..

ఇబ్బందులు తీర్చి అండగా ఉంటా

చైతన్యరధం
@ May 17, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

వేటాడాల్సింది తిమింగలాన్ని!?

చైతన్యరధం
@ May 16, 2025 7:00 AM

చంద్రబాబుపై గుడ్డి వ్యతిరేకత విడనాడాలి

చైతన్యరధం
@ May 12, 2025 6:50 AM

జగన్‌ ఐదేళ్ల పాలనలో అధ్వాన్నంగా సీమ ప్రాజెక్టులు

చైతన్యరధం
@ May 11, 2025 6:00 AM

రాజధాని పునః ప్రారంభ సభపై సాక్షి విద్వేష దాడి

చైతన్యరధం
@ May 5, 2025 7:20 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మహానాడు ఏర్పాట్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా సమీక్ష

చైతన్యరధం
@ May 18, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో..టీడీపీ అభ్యర్థుల విజయం ఖాయం

మన త్రివిధ దళాలకు శిరసాభివందనం

చైతన్యరధం
@ May 18, 2025
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

చైతన్యరధం
@ May 18, 2025
ఆర్ధిక వృద్ధి గ్రేట్‌

బల్లెం వీరుడి ప్రదర్శన భేష్‌ 

చైతన్యరధం
@ May 18, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist