అమరావతి (చైతన్య రథం): సవాళ్లతో కూడిన శాఖలను సాహసంతో పంచుకుని.. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్‌ను ప్రశంసిస్తూ ‘కంగ్రాట్స్ డియర్.. ’ అంటూ ఆయన సతీమణి నారా బ్రాహ్మణి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘వ్యక్తిత్వ హననం చేసినవాళ్లే అవాక్కయ్యేలా నువ్వేంటో చూపించావ్. అంతా పల్లెలనుంచి అమెరికాకు వెళ్తుంటే, అక్కడ చదువుకున్న నువ్వు పల్లె గడపలకొచ్చి, సిమెంటు రోడ్లతో, ఎల్ఈడి వెలుగులతో రూపురేఖలే మార్చేశావ్. ఎలాంటి విమర్శలూ పట్టించుకోకుండా పనిలోపడి అవార్డుల పంట పండిరచావ్’ అంటూ బ్రాహ్మణి కొనియాడారు. ‘మీ సమర్థతతో నేటితరం భావితరం భాగ్యరేఖలు నువ్వు మార్చగలవనే నమ్మకం నాకుంది’ అంటూ ట్వీట్లో ఆమె ధీమా వ్యక్తం చేశారు. కుటుంబపరంగా ఎల్లవేళలా మా సహకారం ఉంటుంది.. అంటూ బ్రాహ్మణి చేసిన ట్వీట్ వైరలైంది. ఈరోజు సచివాలయంలో లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వీడియోను ఈ పోస్ట్‌తో ఆమె పంచుకున్నారు.