- పార్టీ నాయకులకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా పిలుపు
- కమిటీ సభ్యులు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడాలి
- ప్రజాసేవ పట్ల నిబద్ధతతో పమాణస్వీకారం చేయాలి
- స్థానిక ప్రజలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలి
- మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి
- పార్టీ ముఖ్య నేతలతో పల్లా టెలికాన్ఫరెన్స్
అమరావతి (చైతన్యరథం): టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని నాయకులను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి జరుగనున్న కమిటీల ప్రమాణస్వీకారం కార్యక్రమాలపై పార్టీ ముఖ్య నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, జిల్లా అధ్యక్షులతో సోమవారం పల్లా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మంగళవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే మండల, క్లస్టర్, యూనిట్, గ్రామ, బూత్ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవాలను ప్రతి నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిలో పండుగ వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. కొత్తగా నియమితులైన కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. పార్టీ సిద్ధాంతాలను కాపాడుతూ ప్రజలకు సేవ చేయాలన్న నిబద్ధతతో కమిటీ సభ్యులు ప్రమాణస్వీకారం చేయాలని కోరారు. ఈ వేడుకల్లో భాగంగా మొదట పార్టీ జెండా ఆవిష్కరించాలని, ప్రమాణస్వీకారం అనంతరం కేక్ కటింగ్‌లు, సన్మానాలు, గ్రూప్ ఫోటో సెషన్‌లు, హోర్డింగ్‌లు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని మండలాలు ఒకే విధమైన యూనిఫామ్ శైలిలో వేడుకలు నిర్వహించాలి. స్థానిక ప్రజలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని ఇన్‌ఛార్జులను ఆదేశించారు. ఈ వేడుకల ద్వారా పార్టీ కేడర్‌లో నూతన ఉత్సాహం రేకెత్తి, బలమైన సంస్థాగత నిర్మాణానికి దోహదం చేస్తుందని అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు తప్పక హాజరై, కొత్త కమిటీ సభ్యులను ప్రోత్సహించాలని కోరారు. ప్రతి నియోజకవర్గ ఇన్‌చార్జ్ తమ మండలాల్లో జరిగే వేడుకల వివరాలు, ఫోటోలు, వీడియోలు అధికారిక బృందాలకు పంపాలని ఆదేశించారు. వేడుకల ముఖ్య ఘట్టాలను సోషల్ మీడియాలో జశీఎఎఱ్‌్‌వవజవశ్రీవపతీa్‌ఱశీఅ2025 చుణూ హ్యాష్‌ట్యాగ్‌లతో ప్రచారం చేయాలని సూచించారు. ప్రతి నాయకుడు తన అధికారిక సోషల్ మీడియా పేజీలో వేడుకల ఫోటోలు, వీడియోలను షేర్ చేయాలని పిలుపునిచ్చారు. కొత్త కమిటీలతో తెలుగుదేశం పార్టీ గ్రామం నుండి రాష్ట్ర స్థాయి వరకు మరింత బలపడుతోందని, ఈ వేడుకలు కేవలం ఆచారపరమైనవి కాదు, అవి మన కేడర్‌లో ఐక్యత, ఉత్సాహం, నిబద్ధతకు ప్రతీక అని పల్లా స్పష్టం చేశారు.
జయప్రదం చేయండి
ఈ నెల 11న జరగబోయే మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతి కార్యక్రమాలను రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో అధికారికంగా, వేడుకగా నిర్వహించాలని పల్లా సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజలతో కలిసి తెలుగుదేశం పార్టీకి చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు తప్పనిసరిగా ఈ వేడుకల్లో పాల్గొని మహానేతకు నివాళి అర్పించాలన్నారు.















