చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

నవంబరు నుంచి చింతలపూడి పనులు పునః ప్రారంభం

అప్రమత్తంగా ఉండాలి - ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నా జలవనరుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

by చైతన్యరధం
Oct 24, 2026 at 6:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పోలవరం కుడి, ఎడమ కాలువల విస్తరణపై దృష్టి – నిరంతర కార్యక్రమంగా జలధార-జలహారతి
  • తుపాను, వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి
  • ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నా జలవనరుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

రాష్ట్రంలో సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేసి 2028 డిసెంబరు నాటికి అన్ని ప్రాధాన్య ప్రాజెక్టు లను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి అన్ని రకాల పర్యావరణ అనుమతులు లభించినందున ఈ ఏడాది నవంబరు నుంచే పనులను పునః ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎం జలవనరుల శాఖపై సమీక్షించారు. రాష్ట్రంలో గుర్తించిన 36  ప్రాధాన్య ప్రాజెక్టులను నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయాలని, ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీరు, ప్రతి ఎకరానికీ సాగునీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని సీఎం పేర్కొన్నారు. పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేయాలన్నారు. జలధార-జలహారతిని నిరంతర కార్యక్రమంగా నిర్వహించాలన్నారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండడమే కాక వర్షపు నీటిని చెరువులు, రిజర్వాయర్లలో నింపుకోవాలని ఆదేశించారు.

అమరావతి (చైతన్యరథం): ఈ ఏడాది నవంబరు నుంచి చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఇప్పటికే పర్యావరణ అనుమతులన్నీ వచ్చినందున త్వరితగతిన పనులను పునః ప్రారంభించాలని జలవనరుల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించి రాజకీయపరమైన అంశాల్లో బిజీగా ఉన్నప్పటికీ సీఎం రెండు గంటలకు పైగా సమయాన్ని జలవనరుల శాఖపై సమీక్షకు వెచ్చించారు. అటు బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచనలు జారీ చేశారు. రాష్ట్రంలో జలవనరుల సమర్థ నిర్వహణ, నదుల అనుసంధానమే లక్ష్యంగా జలవనరుల శాఖ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో గుర్తించిన 36 ప్రాధాన్య ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయాలని, 2028 డిసెంబరు నాటికి అన్ని ప్రాజెక్టులనూ అందుబాటులోకి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-10-2026

ఎన్నికల్లో హింసకు పాల్పడితే ఊరుకోం

చంద్రబాబుతో పవన్ మరోసారి భేటీ

ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రస్తుతం ఉన్న కాలువల వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. కాలువలపై సౌర విద్యుత్ ఫలకాలు ఏర్పాటుచేసి విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. జలహారతి కార్పొరేషన్ ద్వారా జలవనరుల శాఖకు ఆదాయాన్ని సమకూర్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

పోలవరం కాలువల ద్వారా నేవిగేషన్ వ్యవస్థ
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక అంశాల విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రామాణిక కార్యాచరణ విధానం ప్రకారం పనులు చేపట్టాలని, అత్యుత్తమ నిపుణులను నియమించి ఎప్పటికప్పుడు నిర్మాణ పనులను పర్యవేక్షించాలని సూచించారు. చారిత్రక ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నందున నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రాజెక్టులో ఇప్పటివరకు 90.2 శాతం సివిల్ పనులు పూర్తయినట్టు అధికారులు సీఎంకు వివరించారు. ప్రధాన కట్టడమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్లో గ్యాప్-1, గ్యాప్-2 పనులను వేగంగా పూర్తి చేస్తున్నట్టు తెలిపారు. నిపుణుల కమిటీ పలుమార్లు ప్రాజెక్టును సందర్శించి నిర్మాణ పనుల తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల పనులను 2027 మార్చినాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాలువల ద్వారా గరిష్ఠ స్థాయిలో నీటిని తరలించేలా వాటి సామర్థ్యాన్ని పెంచాలన్నారు.

ప్రాజెక్టు వద్ద నిర్మిస్తున్న ఐకానిక్ బ్రిడ్జిని పూర్తి చేసి రాకపోకలతోపాటు పర్యాటక అభివృద్ధికి అవకాశాలు కల్పించాలని సూచించారు. గోదావరి-పెన్నా అనుసంధానంపై కార్యాచరణ ప్రారంభించాలని, గోదావరి నుంచి కావేరి వరకు నీటిని తరలించే దిశగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రకాశం బ్యారేజికి ఎగువన, దిగువన వైకుంఠపురం, చోడవరం వద్ద ఆనకట్టల నిర్మాణం ద్వారా 14 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. రాష్ట్రంలోని ఎత్తిపోతల పథ కాలన్నీ క్రియాశీలంగా పనిచేసేలా చర్యలు తీసుకోవా లన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాలువల వ్యవస్థను బలో పేతం చేయడంతోపాటు, భద్రాచలం నుంచి రాజ మహేంద్రవరం, విజయవాడ మీదుగా విశాఖపట్నం వరకు అంతర్గత జల రవాణాకు అవసరమైన నావి గేషన్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఆదేశించారు.

జలధార-జలహారతి నిరంతర కార్యక్రమం
జలధార–జలహారతి రెండో దశ పనులను మార్చి 31 వరకు కొనసాగిస్తూ 150 రోజుల కార్యక్రమంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉపాధి హామీ పథకం వీబీజీ రామ్ తో అనుసంధానం చేసి పనులు చేపట్టాలన్నారు. 2027 ఏప్రిల్ 1 నుంచి మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. భూగర్భజలమట్టాలను మూడు మీటర్లకు పైగా పెంచే లక్ష్యంతో చర్యలు చేపట్టాలన్నారు. జలధార-జలహారతిని నిరంతర కార్యక్రమంగా కొనసాగిస్తూ వర్షపు నీటిని ఒడిసి పట్టాలని, చెరువులు, రిజర్వాయర్లలో నీటి నిల్వలను పెంచాలని చెప్పారు. వర్షపాతం తక్కువగా ఉన్నా ప్రకృతి వ్యవసాయం ద్వారా స్థూల వ్యవసాయ ఉత్పత్తి తగ్గకుండా చూడాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యతాక్రమంలో చేపట్టే 36 ప్రాజెక్టులతో పాటు ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ నిర్దేశిత గడువులో పూర్తయ్యేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కాలువలపై సౌర విద్యుత్ ఫలకాలను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలన్నారు. డెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టి కాలువల నిర్వహణను మెరుగుపరచాలని, పూడిక తొలగించి చిట్ట చివరి ఎకరాకు కూడా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. లాకులు, షట్టర్లు, గేట్ల నిర్వహణను పటిష్ఠం చేయాలని సూచించారు.

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తత
బంగాళాఖాతంలో ఏర్పడే తుపాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలను సద్వినియోగం చేసుకుంటూ రిజర్వాయర్లు, చెరువులను నింపాలని సూచించారు. వరద నిర్వహణ, నీటి నిర్వహణ, విపత్తుల నిర్వహణపై సమగ్ర కార్యాచరణ అమలు చేయాలన్నారు. భూగర్భ జలాలు పెరిగేలా ముందస్తు చర్యలు చేపట్టి కరువును సమర్థంగా ఎదుర్కోవాలన్నారు. వర్షపు నీటిని వృథా కాకుండా నిల్వ చేసుకోవడం, సాగునీటి వనరులను సమర్థంగా నిర్వహించడం ద్వారా రైతులకు గరిష్ఠ ప్రయోజనం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల కు దిశానిర్దేశం చేశారు. సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

Previous Post

రాష్ట్రాభివృద్ధిని, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే జగన్ అజెండా

Next Post

చంద్రబాబుతో పవన్ మరోసారి భేటీ

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-10-2026

కార్యకర్త
@ October 24, 2026
ఎన్నికల్లో హింసకు పాల్పడితే ఊరుకోం
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల్లో హింసకు పాల్పడితే ఊరుకోం

చైతన్యరధం
@ October 24, 2026
చంద్రబాబుతో పవన్ మరోసారి భేటీ
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబుతో పవన్ మరోసారి భేటీ

చైతన్యరధం
@ October 24, 2026
రాష్ట్రాభివృద్ధిని, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే జగన్ అజెండా
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రాభివృద్ధిని, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే జగన్ అజెండా

చైతన్యరధం
@ October 24, 2026
మేనమామ కాదు.. మహిళల కన్నీళ్లకు కారణమైన కంసమామ
ఆంధ్రప్రదేశ్

మేనమామ కాదు.. మహిళల కన్నీళ్లకు కారణమైన కంసమామ

చైతన్యరధం
@ October 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 23-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-10-2026

కార్యకర్త
@ October 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-10-2026

కార్యకర్త
@ October 23, 2026
నిత్యవసరాల ధరలను కట్టడి చేయాలి
ఆంధ్రప్రదేశ్

నిత్యవసరాల ధరలను కట్టడి చేయాలి

చైతన్యరధం
@ October 22, 2026
Load More

ముఖ్య వార్తలు

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

కోర్టు తీర్పులను వక్రీకరించి గొడ్డలిపార్టీ కుట్రలు

చైతన్యరధం
@ October 22, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

హింస.. నా డిక్షనరీలోనే లేదు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

చైతన్యరధం
@ October 20, 2026
దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎన్నికల్లో హింసకు పాల్పడితే ఊరుకోం

ఎన్నికల్లో హింసకు పాల్పడితే ఊరుకోం

చైతన్యరధం
@ October 24, 2026
చంద్రబాబుతో పవన్ మరోసారి భేటీ

చంద్రబాబుతో పవన్ మరోసారి భేటీ

చైతన్యరధం
@ October 24, 2026

నవంబరు నుంచి చింతలపూడి పనులు పునః ప్రారంభం

చైతన్యరధం
@ October 24, 2026
రాష్ట్రాభివృద్ధిని, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే జగన్ అజెండా

రాష్ట్రాభివృద్ధిని, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే జగన్ అజెండా

చైతన్యరధం
@ October 24, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.