- ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న కూటమి
- రూ.26.13 కోట్ల పీఎం జనవికాస్ నిధులు విడుదల
- ఏపీ బడ్జెట్‌లో రూ.4,376 కోట్లు కేటాయింపు
- మైనార్టీలను విస్మరించిన మాజీ సీఎం
- అర్థాంతరంగా సంక్షేమపథకాల రద్దు
- హజ్‌హౌస్‌లకు నిధులు కేటాయింపు నిల్
- వక్ఫ్ భూములు కబ్జాపై పట్టించుకోని జగన్
అమరావతి, (చైతన్యరథం): కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రధానమంత్రి జనవికాస్ కార్యక్రమం కింద మైనార్టీల సంక్షేమం, విద్య, నైపుణ్యం, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఏపీ మైనార్టీ సంక్షేమ శాఖ రూ.26.13 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో ఏపీలో మైనార్టీల సంక్షేమం కోసం జూనియర్ కళాశాలలు, ఐటీఐ కళాశాలలు, పాలిటెక్నిక్, మైనార్టీ సంక్షేమ భవనాలను నిర్మించనున్నారు. గత వైసీపీ ప్రభుత్వం మైనార్టీలను పూర్తిగా విస్మరించింది. వారికి ఇవ్వాల్సిన పథకాలను కూడా రద్దు చేసింది. ఇవన్నీ అమలు చేయాల్సిను జగన్ మొద్దునిద్ర పోయాడు. నంగనాచి మాటలతో మాయ చేసి, మైనార్టీల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోలేదు. వారి ఆస్తులు కబ్జాకు గురవుతున్నా జగన్‌రెడ్డి కళ్ళున్న కబోదిలా వ్యవహరించాడు. మైనార్టీలకు చెందాల్సిన హక్కులను కాలరాశాడు. హజ్ హౌస్ నిర్మాణం, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు, హజ్ యాత్రికులకు సబ్సిడీ సక్రమంగా అమలు చేయలేదు. ఇమామ్, మౌజుంలకు, మసీద్, మదర్సాలకు ఇవ్వాల్సిన నిధులు మంజూరు చేయకుండా కాలయాపన చేశాడు. మైనార్టీలకు అందాల్సిన అనేక పథకాలను రద్దు చేశాడు. బడ్జెట్‌లో అరకొర నిధులు కేటాయించి మైనార్టీ సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించాడు. అన్ని రంగాల్లో మైనార్టీలకు ద్రోహం చేసి వారి అభివృద్ధిని అడ్డుకున్నాడు.
గత ఐదేళ్లు మైనార్టీలకు జగన్ చేసిన మోసం :
అధికారంలోకి వచ్చాక వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తామని హామీ ఇచ్చిన జగన్ అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60 వేల ఎకరాలకు సంబంధించిన వక్ఫ్ భూముల్లో 32 వేల ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. అయినా జగన్ మాత్రం ఐదేళ్లు వాటి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. పెళ్లి కానుకలను లక్షకు పెంచుతామని ప్రకటించి రెండేళ్లల్లో ఒక్కటంటే ఒక్కరికి కూడా దుల్హన్ పథకం ఇవ్వలేదు. హజ్ యాత్రకు ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చాక పూర్తిగా నిలిపేశారు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మసీదులు, శ్మశానాలకుకు భారీగా నిధులు కేటాయించింది. అయితే వైసీపీ ప్రభుత్వం షాదీఖానాలకు రూ.10 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. కానీ ఖర్చు చేయలేదు. విజయవాడలో ఏపీ స్టేట్ హజ్ హౌస్ నిర్మాణానికి రూ.23 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. కడపలో రూ.13 కోట్ల రూపాయులతో ఏపీ స్టేట్ హజ్ హౌస్ నిర్మాణం జరుగుతోంది. ఈ రెండిరటి నిర్మాణాలకు నిధులు కేటాయించకుండా వాటిని జగన్ గత ఐదేళ్లు నిర్వీర్యం చేశాడు.
ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం…
ఏప్రిల్ నెల నుంచి పరిగణనలోకి
రాష్ట్రంలోని 5 వేల ఆదాయంలేని మసీదుల ఇమామ్‌లు, మౌజన్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇమామ్‌ల గౌరవ వేతనాన్ని రూ.10వేలు, మౌజన్ల గౌరవ వేతనాన్ని రూ.5 వేల చొప్పున కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ గౌరవ వేతనం వర్తిస్తుందని, ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.90 కోట్లు వెచ్చిస్తుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం 2024-25 బడ్జెట్లో రూ. 4,376 కోట్లు కేటాయించింది. మైనారిటీ యువత జీవనోపాధి కల్పన, స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసేందుకు మైనారిటీ ఆర్థిక సహకార సంస్థకు రూ. 173 కోట్లు ప్రతిపాదించింది. ప్రధానమంత్రి జన్‌వికాస్ కార్యక్రమానికి రూ.208 కోట్లు ఇవ్వనుంది. మైనారిటీ ఆర్థిక సంస్థకు రూ.173 కోట్లు, ఉర్దూ అకాడమీకి రూ.5.3 కోట్లు కేటాయించింది. ఉర్దూ ఘర్ కమ్ షాదీఖానాల నిర్మాణం పనులు వెంటనే చేపట్టాలని మంత్రి ఆదేశించారు. షాదీ ఖానాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి రూ.2.90 కోట్లు నిధులు ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది.