అమరావతి (చైతన్య రథం): అల్లూరి సీతారామరాజు వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు వీరునికి నివాళి అర్పించారు. ‘గిరిజన హక్కుల పరిరక్షణకు మన్యం ప్రజల గుండెల్లో పౌరుషాగ్ని రగిలించిన విప్లవయోధుడుగానే అల్లూరి సీతారామరాజును మనం గుర్తుపెట్టుకున్నాం. కానీ ఆనాడే అందరికీ విద్యవంటి మహోన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ఆ దిశగా కృషి చేసిన అభ్యుదయవాది మన అల్లూరి. దేశభక్తుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆ తెలుగు వీరుని చరిత్రను స్మరించుకుంటూ నివాళి అర్పిద్దాం’ అని ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు పోస్టు చేశారు.