- తెలంగాణ నుంచి రావాల్సిన రూ.50 కోట్లపై దృష్టి సారించాలి
- మైనార్టీ సంక్షేమ శాఖపై సమీక్షలో అధికారులకు మంత్రి ఫరూక్ ఆదేశం
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి ఉద్దేశించిన ప్రణాళికల అమలుకు కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను రాబట్టుకునేందుకు ఢల్లీికి వెళ్లి సాధించాలని మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులను రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయంలోని తన పేషీ లో మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్, కమిషనర్ శ్రీధర్, తదితర అధికారులతో మంత్రి సమీక్ష చేశారు. 2024-2025 బడ్జెట్లో కేటాయించిన నిధులను విడుదల చేయించుకోవడంతో పాటు, 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మైనార్టీ శాఖకు కావాల్సిన ఆర్థిక బడ్జెట్ సంబంధ విషయాలను క్రోడీకరించి పూర్తి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. సీసీ టీవీలు, డ్రోన్లు, తదితర సాంకేతిక పరికరాలను అవసరమున్న చోట వినియోగించాలని సూచించారు. రంజాన్ మాసం సమీపిస్తున్న నేపథ్యంలో మసీదుల నిర్వహణకు ప్రతి నెల రూ.5000 ఆర్థిక సాయం పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గన్నవరం ఎయిర్ పోర్టు నుండి హజ్‌కి వెళ్లే యాత్రికులకు రూ. లక్ష ఆర్థిక సాయం పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలు తయారు చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని మైనారిటీ సంక్షేమ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ వాడాలని, పేపర్ ఫైళ్లను వెనక్కి పంపాలని ఆదేశించారు. రాష్ట్రంలోని దర్గాలు, పెద్దపెద్ద మసీదులు, హాస్టళ్లలో సీసీ టీవీలతో పర్యవేక్షణ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మైనార్టీలకు సంబంధించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకి అందేలా జిల్లాల వారీగా అధికారులు సమీక్షా సమావేశాలు, క్షేత్ర పర్యటనలు చేస్తూ ప్రజా సంబంధాలు కొనసాగించాలని సూచించారు. డీఎస్సీ కోచింగ్, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఐఐటీ, నీట్ పోటీ పరీక్షలకు శిక్షణ, పూర్తయిన పీఎంజేవీకే భవనాలకు సిబ్బంది, బడ్జెట్ కేటాయింపు, నంద్యాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, సీిఈడీఎం శాఖ ఏర్పాటుపై అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాళీలను ఏపీపీఎస్సీ దృష్టికి తీసుకువెళ్లి నోటిఫై అయ్యేలా చర్యలు తీసుకోవడం, ప్రజా ఫిర్యాదులను పరిష్కరించేందుకు, ప్రజలకు సత్వర, కచ్చితమైన సమాచారం అందించేందుకు వీలుగా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. వెబ్‌పైట్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. తెలంగాణ నుంచి రావాల్సిన రూ. 50 కోట్లు, ఫైళ్లు, రికార్డులు పొందేందుకు హైదరాబాదుకు వెళ్లి అక్కడి అధికారులతో మాట్లాడి సాధించాలని అధికారులను మంత్రి ఆదేశించారు
హైకోర్టు బెంచి, నల్సార్, ఇంటర్నేషనల్‌లా స్కూల్ ఏర్పాటుపై సమీక్ష
కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటు, రాజధాని అమరావతిలో నల్సార్ విశ్వవిద్యాలయం, ఇంటర్నేషనల్ లా స్కూల్ ఏర్పాటుకు సంబంధించి అవసరమైన స్థల సేకరణ, నిధుల కేటాయింపులు, తదితర అంశాలపై రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ సమీక్షించారు. గురువారం తన పేషీ కార్యాలయంలో న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభా దేవి, తదితరులతో న్యాయ శాఖకు సంబంధించి పాలనాపరమైన పలు అంశాలపై మంత్రి సమీక్ష చేశారు. హైకోర్టు బెంచి, నల్సార్, ఇంటర్నేషనల్ లా స్కూల్ కు సంబంధించి అన్ని చర్యలు వేగవంతం చేయాలని, అవసరమైతే సమావేశాలు, క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని న్యాయశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొత్త కోర్టుల ఏర్పాటు, కొత్త భవనాలు, క్వార్టర్స్ నిర్మాణానికి, వసతుల కల్పనకు అవసరమైన అంచనాలతో 2025-2026 బడ్జెట్‌లో కేటాయింపుల కోసం నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. న్యాయ సలహా కోసం వచ్చే ఫైళ్లకు సంబంధించి వీలైనంత త్వరగా సలహా ఇవ్వాలని మంత్రి సూచించారు. న్యాయశాఖకు సంబంధించి మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వ పథకాల నుండి నిధులు రాబట్టేందుకు అవసరమైతే ఢల్లీికి వెళ్లేందుకు సిద్ధం కావాలని ఆదేశించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, స్పెషల్ కోర్టులు, జూనియర్ న్యాయవాదులకు శిక్షణతో పాటు పలు అంశాలపై మంత్రి ఫరూక్ సమీక్ష చేశారు.