- సౌత్ స్టేట్స్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో
- దక్షిణాది ప్రాంత ప్రయోజనాలపై కీలక ప్రసంగం
- ఐక్యంగా బలపడితే దేశం బలపడుతుందన్న సందేశం
- సమన్వయంతో బలమైన శక్తిగా ఎదుగుదామని పిలుపు
- చంద్రబాబుపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రశంసలు
అమరావతి(చైతన్యరథం): దక్షిణాది రాష్ట్రాల 31వ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆకట్టుకుంది. ఒక రాష్ట్ర ముఖ్యమం త్రిలా కాకుండా సుదీర్ఘ అనుభవమున్న రాజనీతిజ్ఞుడి దార్శనిక పత్రంలా సాగింది. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యల ను ఆయన ప్రస్తావించినప్పటికీ ప్రసంగం మొత్తాన్ని రాష్ట్ర ప్రయోజనాలకే పరిమితం చేయలేదు. దేశాభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర, వాటి సమష్టి ఆర్థిక శక్తి, నీటి-ఇంధన భద్రత, రవాణా అనుసంధానం, విపత్తుల నిర్వహణ, విద్య-నైపుణ్యా భివృద్ధి వంటి అంశాలతో దక్షిణ భారతదేశానికి ఒక దీర్ఘకాలిక ఉమ్మడి అభివృద్ధి అజెండాను ప్రతిపాదించారు. సాధారణంగా జోనల్ కౌన్సిల్ సమావేశాల్లో ఆయా రాష్ట్రాల సమస్యలు, కేంద్రం నుంచి రావాల్సిన సహాయం, అంతర్రాష్ట్ర వివాదాలు ప్రధానంగా చర్చకు వస్తాయి. కానీ చంద్రబాబు తన ప్రసంగాన్ని కేవలం ఆంధ్రప్రదేశ్ డిమాండ్లకు పరిమితం చేయలేదు. ఆంధ్రప్రదేశ్‌కు ఏమి కావాలి? అనే ప్రశ్నను దాటి, దక్షిణ భారతదేశం సమష్టిగా ఎలా ఎదగాలి? దేశాభివృద్ధికి మరింత శక్తివంతమైన గ్రోత్ ఇంజిన్‌గా ఎలా మారాలి? అనే విస్తృత దృష్టితో ఒక బలమైన సందేశం ఇచ్చారు.
పోటీ నుంచి సహకారం వైపు
కేంద్రం-రాష్ట్రాలు, రాష్ట్రం-రాష్ట్రం మధ్య ఘర్షణలు అభివృద్ధికి ఉపయోగపడవని స్పష్టం చేశారు. పరస్పర విశ్వాసం, సంప్ర దింపులు, ఇచ్చిపుచ్చుకునే ధోరణి, సహకార సమాఖ్య విధానం తోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలు పెట్టుబడులు, పరిశ్రమలు, మౌలికవసతుల కోసం పరస్పరం పోటీ పడటంతోనే ఆగిపోకుండా, కొన్ని కీలక రంగాల్లో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.
10 ట్రిలియన్ల దక్షిణాది ఆర్థిక వ్యవస్థ
దక్షిణాది రాష్ట్రాలు దేశ జీడీపీలో దాదాపు 31 శాతం వాటా కలిగి ఉన్నాయన్న విషయాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావిం చి దక్షిణాది ప్రాధాన్యతను చాటి చెప్పారు. 2047 నాటికి దక్షిణ భారత్‌ను 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు చేయి కలిపి పనిచేద్దామని పిలుపునిచ్చారు. అమరావతి-బెంగళూరు-చెన్నై నగరాలను బలమైన రవాణా వ్యవస్థతో అను సంధానించాలని సూచించారు. రవాణా అనుసంధానం పెరిగితే సరకు రవాణా వ్యయం తగ్గుతుంది, పెట్టుబడులు పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు విస్తరిస్తాయి, రాష్ట్రాల మధ్య వ్యాపార కార్య కలాపాలు వేగవంతమవుతాయని చెప్పారు.
ఉమ్మడి లాజిస్టిక్స్, డ్రైపోర్టుల నెట్వర్క్
దక్షిణాది రాష్ట్రాలకు ఉమ్మడి లాజిస్టిక్స్ వ్యవస్థ, డ్రైపోర్టుల నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. సముద్రతీరం లేని అంతర్గత ప్రాంతాలను పోర్టులతో అనుసంధానించడం, సరకు రవాణా సమయాన్ని తగ్గించడం, ఎగుమతులను పెంచడం, తయారీ రంగాన్ని అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలతో కలపడం దీని లక్ష్యం. ఇది దక్షిణ భారతదేశాన్ని ఒక సమీకృత ఉత్పత్తి-ఎగుమతి కేంద్రంగా మార్చగల ప్రతిపాదన.
నీటి భద్రతకు దక్షిణాది ఉమ్మడి ప్రాజెక్టు ప్రతిపాదన
గోదావరి-కావేరి అనుసంధానం ద్వారా 500 టీఎంసీలకు పైగా మిగులు వరద జలాలను కృష్ణా, పెన్నా నదుల మీదుగా కావేరి బేసిన్‌కు తరలించాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు నీటి భద్రత కల్పించే దక్షిణాది ఉమ్మడి ప్రాజెక్టుగా ప్రతిపాదించారు. “నీటి పంపిణీ” చర్చను నీటి సమర్థ వినియోగం దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
ఇంధన భద్రతకు సమీకృత గ్రిడ్
దక్షిణాది పవర్ గ్రిడ్‌ను జాతీయ గ్రిడ్‌తో మరింత బలంగా అనుసంధానించాలని సూచించారు. ఒక రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంటే మరో రాష్ట్రంలో ఉన్న అవసరాన్ని తీర్చగల విధం గా సమర్థమైన విద్యుత్ మార్పిడి వ్యవస్థ అవసరమని ఆయన భావన.
విద్య-నైపుణ్యాలను ఉమ్మడి ప్రాంతీయ సంపద
దక్షిణాది రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, నైపుణ్యాభివృద్ధి సంస్థలతో ఒక ఉమ్మడి కన్సార్టియం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. తుపాన్లు, వరదలు, కరవు, అగ్నిప్రమాదాలు, ఇతర ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేం దుకు దక్షిణాది రాష్ట్రాలతో మÖ్యచువల్ ఎయిడ్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.
ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్
దక్షిణాది రాష్ట్రాల దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలు, బౌద్ధ క్షేత్రాలు, సముద్రతీరాలు, ప్రకృతి సంపదను అనుసంధానిస్తూ ఉమ్మడి హెరిటేజ్-స్పిరిచ్యువల్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. ఫిర్యాదుల జాబితాగా కాకుండా పరిష్కారాల అజెండాగా ఆయన ప్రసంగం సాగింది. రాష్ట్రాల మధ్య పోటీని సమష్టి శక్తిగా మార్చే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దక్షిణాది, జాతీయ ప్రయోజనాలతో అనుసంధానించి మాట్లాడారు. వర్తమాన సమస్యలతో పాటు 20 47 అవసరాలను ముందుంచారు. రాజకీయ ప్రసంగం కంటే ఒక ప్రాంతీయ అభివృద్ధి బ్లూప్రింట్‌గా చూపించారు. దక్షిణాది రాష్ట్రా లు విడివిడిగా విజయం సాధించినా.. కలిసికట్టుగా పనిచేస్తే భారతదేశ భవిష్యత్తునే నిర్దేశించగలవని దిశానిర్ధేశం చేశారు.












