- అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కళావతి వేధింపులకు గురిచేసింది
- ప్రజావినతుల కార్యక్రమంలో సర్పంచ్ భర్త ఫిర్యాదు
- వైసీపీ ప్రభుత్వం ఎత్తిపోతలను ఆపిందని రైతుల గోడు
- తమ్ముడు చేయి విరగ్గొట్టి వేధిస్తున్నాడని అక్క ఆవేదన
- అర్జీలు స్వీకరించిన పట్టాభిరామ్, మల్లెల రాజశేఖర్‌గౌడ్
మంగళగిరి(చైతన్యరథం): తాను ఎస్సీ మాదిగను..గత వైసీపీ ప్రభుత్వంలో భామిని పంచాయతీ సర్పంచ్‌గా తన భార్య పోటీ చేసి టీడీపీ తరపున గెలిచింది.. కక్ష పెంచుకు న్న అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కళావతి స్మశాన వాటికలో అభివృద్ధి పనులు చేయిస్తున్న తనపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించింది..కేసులను తొలగించేలా చూడాలని మన్యం జిల్లా భామిని మండలానికి చెందిన రాజేష్ వేడుకున్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ గౌడ్‌లకు వినతిపత్రం అందజేశాడు. అర్జీ స్వీకరించిన నేతలు తగిన న్యాయం జరిగేలా చూస్తామని బాధితుడికి హామీ ఇచ్చారు.
` మన్యం జిల్లా భామిని మండలం బత్తిలి గ్రామానికి చెందిన ఎన్.గణేష్ సమస్య వివరిస్తూ గత టీడీపీ ప్రభుత్వంలో తమ గ్రామానికి రూ.18 కోట్లతో ఎత్తిపోతల పథకం మంజూరు అయింది.. వైసీపీ ప్రభుత్వం దానిని అసలు పట్టించుకోకపోవడంతో నాలుగు గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోయారు.. దయచేసి గతంలో మంజూరైన ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రైతులకు కూటమి ప్రభుత్వం మేలు చేయాలని విజ్ఞప్తి చేశాడు.
` వారసత్వంగా సంక్రమించిన తమ భూమికి అన్ని డాక్యుమెంట్లు ఉన్నా విక్రయిం చబోగా భూమి నిషేధిత జాబితాలో ఉందని అధికారులు చెబుతున్నారు.. దయచేసి తన భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం వీరారెడ్డిపల్లెకు చెందిన కోటిరెడ్డి వినతిపత్రం ఇచ్చాడు.
` తమ గ్రామంతో పాటు పరిసరాల్లో టెన్త్ పాస్ అయిన విద్యార్థులు ఇంటర్ చదు వుకోవాలంటే చాలా దూరం వెళ్లవలసి వస్తోంది..మండలంలోని కరకవలస గ్రామంలో నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసి విద్యార్థుల ఇబ్బందిని తొలగించా లని శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్ పేట మండలానికి చెందిన జిల్లా పార్లమెంట్ తెలుగురైతు అధ్యక్షుడు ఒమ్మి ఆనందరావు విజ్ఞప్తి చేశాడు.
` తన పిల్లల చదువుకు ఇంటిని బ్యాంక్‌లో తనఖా పెట్టి డబ్బులు తీసుకోవాలంటే కన్విన్స్ డీడీ అడుగుతున్నారు…దాని కోసం హౌసింగ్ కొర్పొరేషన్ వారికి అర్జీ పెట్టుకుని మూడు నెలలు గడిచినా పట్టించుకోలేదు.. తన పిల్లల చదువుకు వెంటనే డబ్బులు కట్టా ల్సి ఉంది..తనకు కన్విన్స్ డీడీ ఇప్పించి ఆదుకోవాలని శ్రీకాకుళంకు చెందిన కొత్తకోట రామకృష్ణారావు విన్నవించుకున్నాడు.
` తన భర్త చనిపోగా 20 ఏళ్ల క్రితం పుట్టింటికి వచ్చి తమ్ముడైన రమణారెడ్డి ఇంట్లో ఉంటుంటే.. మరో తమ్ముడు తనను అకారణంగా కొట్టి ఇబ్బందులు పెడుతున్నాడని అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం పుల్లంపేట మండలం దేవసముద్రం గ్రామానికి చెందిన చింత పిచ్చమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. తనను రమణారెడ్డి ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు..తన చేయి విరగ్గొట్టాడు..అతనిపై చర్యలు తీసుకుని న్యాయం చేయా లని ఫిర్యాదు చేసింది
` కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి`చిన్నాయిపాలెం గ్రామాల మధ్య విమానాశ్రయం ప్రతిపాదన వార్తలు వస్తున్నాయి..గ్రామాల మధ్య పచ్చని పంట పొలాలు ఉన్నాయి..అక్కడ విమానాశ్రయం ఏర్పాటును రద్దు చేసి మరో చోట ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల రైతులు విజ్ఞప్తి చేశారు.