అమరావతి: నీ కుటుంబాన్ని వేరే వాళ్లు చీల్చారని నీ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిళతో చెప్పించగలవా అని జగన్‌రెడ్డి కి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు సవాల్ విసిరారు. భార్య కుటుంబమే నీ కుటుం బం అన్నట్లుగా వ్యవహరిస్తూ దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి తీవ్ర అన్యాయంచేశావని ఒక ప్రకటనలో జగ న్పై కళావెంకట్రావు విమర్శలు గుప్పిం చారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టు కుని అక్రమంగా వేలకోట్లు సంపాదిం చావు. అవినీతి కేసుల్లో అరెస్టయి, జైలు కు వెళితే నీ తల్లి, నీ చెల్లి సహా కుటుంబ మంతా పాదయాత్ర చేసి నీకు, నీ పార్టీకి అండగా నిలిస్తే అధికారం వచ్చాక చెల్లె లు షర్మిళను పట్టించుకోకుండా దూరం గా పెట్టావు. అధికారం మొత్తాన్ని భార్య తరపు బంధువులకు అప్పగించావు. న్యా యబద్ధంగా ఆస్తిలో వాటా ఇవ్వకుండా.. నీ చెల్లిని తెలంగాణలో రోడ్లపై తిరిగేలా చేశావు. మీ బాబాయ్‌ని అంతమొందిం చిన నీభార్య కుటుంబానికి కొమ్ము కాస్తు న్నావు. మీ బాబాయ్ కుమార్తె..అల్లుడిపై అక్రమ కేసులు పెట్టావు. రాజశేఖర్ రెడ్డి భార్య ప్రస్తుతం ఎలా ఉందో ప్రజలంతా చూస్తున్నారని కళావెంకట్రావు వ్యాఖ్యానించారు.