- ఈ రాకెట్ వెనుక ఉన్న నేతలెవరో చెప్పాలని డిమాండ్
- అభివృద్ధి కన్నా డ్రగ్స్‌లోనే ఏపీ పేరు ఎక్కువగా వినిపిస్తోందని ఆవేదన
అమరావతి: పోలీసులే గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడటం రాష్ట్రానికి అవమానకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. హైదరాబాదులో ఇద్దరు ఏపీ పోలీసులు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడిన ఘటనపై ఎక్స్ వేదికగా చంద్రబాబు స్పందించారు. దురదృష్టవ శాత్తు గత నాలుగున్నరేళ్లుగా ఏపీ పేరు అభివృద్ధిలో కంటే డ్రగ్స్ విషయంలోనే ఎక్కువగా వినిపిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. తాజాగా కాకి నాడకు చెందిన ఇద్దరు పోలీసులు హైదరాబాదులో అరెస్ట్‌కావడం తీవ్ర ఆందోళనకర అంశమని, రాష్ట్రా నికి తలవంపులు తెచ్చేఘటన అని విమర్శించారు. ఈ విచారకరమైన ఘటన వెలుగులోకి వచ్చిన నేప థ్యంలో, వైసీపీ ప్రభుత్వం ఒక కీలకమైన ప్రశ్నకు సమాధానం చెప్పాలి.ఈ రాకెట్ వెనుక ఉన్న సూత్ర ధారి ఎవరు… ఎవరెవరు నేతలు ఇందులో ఉన్నారో చెప్పాలంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
జగనే వారికి స్ఫూర్తి: బుద్ధా
హైదరాబాదులో నిర్వహించిన యాంటీ డ్రగ్ ఆపరేషన్‌లో ఇద్దరుఏపీ పోలీసులు పట్టుబడడంపై టీడీపీ నాయకుడు బుద్ధా వెంకన్న కూడా స్పందిం చారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలో తేలాల్సిందేనని విమర్శించారు. హైదరాబాదులోని బాచుపల్లిలో 22కేజీల గంజాయి ని తీసుకెళుతున్న వాహనాన్ని పట్టుకున్నారు. ఆరా తీస్తే కాకినాడలో పనిచేస్తున్న ఒక హెడ్‌కానిస్టేబుల్, మరో కాని స్టేబుల్ సిక్ లీవు పెట్టి మరీ ఈదందాను నడిపిస్తు న్నారని తేలింది. జగన్‌రెడ్డి నుంచి స్ఫూర్తి పొంది ఉంటారు’’అంటూ బుద్ధా వెంకన్న వ్యంగ్యం ప్రదర్శించారు.