- శాప్ చైర్మన్‌గా పలు ఫైళ్లపై సంతకాలు
- ఘనస్వాగతం పలికిన యువగళం మిత్ర బృందం
- తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు
- పెద్దఎత్తున అభినందనల వెల్లువ, గజమాలలతో సత్కారాలు
- నిబద్ధత గల కార్యకర్తకు గౌరవమన్న కొల్లు రవీంద్ర, మండిపల్లి
- వెన్నంటి ఉన్న ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన రవినాయుడు
విజయవాడ(చైతన్యరథం): ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) చైర్మన్‌గా నియమితులైన అనిమిని రవినాయుడు విజయవాడ శాప్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11:30 గంటలకు అట్టహాసంగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు గుంటూరు జిల్లా మం గళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం కొలనుకొండలోని క్యాంపు కార్యాలయం నుంచి భారీ ర్యాలీతో బయలుదేరిన రవినాయుడు విజయవాడ బెంజి సర్కిల్‌కు చేరుకున్నారు. అక్కడ యువగళం టీమ్ సభ్యులు, టీఎన్‌ఎస్‌ఎఫ్, తెలుగుయువత విభాగాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి భారీ గజమాలతో సత్కరిం చారు. అక్కడి నుంచి డీజేలు, తీన్మార్ నడుమ భారీ బైక్ ర్యాలీతో పండుగ వాతావరణంలో శాప్ కార్యాలయానికి చేరుకోగా శాప్ అధికార బృందం ఘన స్వాగతం పలికింది. వేద మంత్రోచ్ఛారణల మధ్య వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా కార్యాలయంలో కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు వారికి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం శాప్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకర ణ సమయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర రవాణా, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, శాప్ ఎండీ గిరీషా, ఇతర అధికారులు ఉన్నారు. అనంతరం పలు ఫైళ్లపై రవినాయుడు చైర్మన్ హోదాలో సంతకాలు చేశారు. తర్వాత ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం ప్రాంగణంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి అధ్యక్షతన అభినందన సభలో రవినాయుడుతో పాటు ముఖ్యఅతిథులు పాల్గొని ప్రసం గించారు.
క్రీడలకు పూర్వవైభవం తీసుకురావాలి గనులు భూగర్భవనరులు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర
కష్టపడే వారికి పార్టీలో మంచి పదవులు వస్తాయనడానికి రవినాయుడు ఒక నిదర్శనం. రవి కష్టాన్ని రాష్ట్రమంతా కళ్లారా చూసింది. తెలుగుయువతలో పనిచేసిన రవికి శాప్ చైర్మన్ పదవి రావడం అభినందనీయం. యువనేతపై ఈగ వాలకుండా పాదయాత్ర పూర్తయ్యే వరకు అనేక ఇబ్బందులు ఎదురైనా సమర్థవంతంగా తన బాధ్యతలు నిర్వర్తించాడు. అం దుకే మంచి గుర్తింపు వచ్చింది. గతంతో పోలిస్తే టీడీపీ ప్రభుత్వం వచ్చాక కష్టపడిన వారికి సముచితమైన విధానంలో పదవులు వస్తున్న విషయాన్ని రాష్ట్రమంతా గమనిస్తోంది. క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి శాప్ చైర్మన్‌ను సమన్వయం చేస్తూ ముందుకు నడిపించాలని కోరుతున్నా. ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్రీడలంటే చాలా మక్కువ. రాను న్న ఐదేళ్లలో రాష్ట్రాన్ని క్రీడలకు హబ్‌గా చేయాలని భావిస్తున్నారు. ఈ ఆశయాన్ని క్రీడా శాఖ మంత్రి, శాప్ చైర్మన్ ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. గత పాలనలో చంద్రబా బు సారథ్యంలో ఏషియన్ గేమ్స్‌కు ఏపీ వేదికైంది. రానున్న కాలంలో ఈ వైభవాన్ని రాష్ట్రాని కి తీసుకురావాలి. పుల్లెల గోపీచంద్‌ను చంద్రబాబు గుర్తించి ప్రోత్సహించి ఉండకపోతే నేడు ఒలింపిక్స్‌లో సింధు అనే క్రీడాకారిణి మెడల్ సాధించేది కాదు. రానున్న ఐదేళ్లలో క్రీడాకారులను, కోచ్‌లను ప్రోత్సహించి ఏపీని క్రీడల్లో అగ్రస్థానంలో నిలబెట్టాలని కోరారు.
రవినాయుడు కష్టానికి దక్కిన గౌరవం
రవాణా, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
గత ఐదేళ్లలో కష్టపడిన వారిని పార్టీ నాయకత్వం పెద్దఎత్తున ప్రోత్సహిస్తూ మంచి అవకా శాలు కల్పిస్తోంది. రవినాయుడు కష్టానికి దక్కిన గౌరవం ఈ పదవి. మండు వేసవిని లెక్క చేయకుండా పాదయాత్రలో కీలకపాత్ర పోషించిన రవి, యువగళం టీమ్ సభ్యులకు నా అభినందనలు. సీఎం చంద్రబాబు, యువ నాయకులు మంత్రి లోకేష్ నాయకత్వంలో ఈ ఐదేళ్లు మంచి పేరు తెచ్చేలా పార్టీని, ప్రభుత్వాన్ని కూడా ముందుకు తీసుకునిపోయే విధం గా అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. జగన్‌రెడ్డికి నేను 17 ఏళ్లు సేవలందించాను. కనీసం సర్పంచ్ స్థాయిలో కూడా నన్ను ప్రోత్సహించలేదు. కేవలం మూడేళ్లలోనే టీడీపీ నాకు ఎమ్మె ల్యే అవకాశాన్ని ఇచ్చి ప్రోత్సహించింది. మొదటి దశలోనే నన్ను మంత్రిని చేసి నా వెన్నుతట్టి నిలిచింది. నాకు కీలకమైన శాఖలు ఇచ్చింది. కష్టపడే ప్రతిఒక్కరికీ పార్టీలో మంచి అవకా శాలు వస్తాయి. చంద్రబాబు, ఆ తర్వాత యువనేత నారా లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేసే వరకు మనమంతా కష్టపడి పనిచేయాలి. జగన్ జమానా పని అయిపోయింది. ఆయన ఓ చెల్లని రూపాయి అయిపోయాడు. ఆయనను ఈ రాష్ట్రం త్వరలోనే మరచిపోబోతుంది. రవినాయుడికి భవిష్యత్తులో మరిన్ని మంచి అవకాశాలు రావాలని ఆశిస్తున్నాను.
యువతకు రవి ఆదర్శం: ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు
గత ఐదేళ్లలో రవిపడిన కష్టానికి ప్రతిఫలమే శాప్ చైర్మన్ పదవి. రాష్ట్రంలోని ఎంతోమంది యువతకు రవి ఆదర్శంగా నిలుస్తాడు. గత ఐదేళ్లలో జరిగిన అరాచక పాలనకు వ్యతి రేకంగా ఎన్నో పోరాటాలు చేశాడు. అక్రమ కేసులను ఎదుర్కొన్నాడు. జగన్ దుర్మార్గపు పాలనలో యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేయడంలో రవినాయుడు పాత్ర ప్రశంసనీయం. గత పాలకులు ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకున్నారు. రవినాయుడు రానున్న కాలంలో మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని కోరుతున్నాను.
క్రీడలను కెరీర్‌గా మలచాలి: ఎమ్మెల్సీ అశోక్‌బాబు
రవినాయుడు పార్టీ పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఎంత అవసరమో, ఆరోగ్యం కూడా అంతే అవసరం. క్రీడలు, వ్యాయామం ద్వారా ఎవరి ఆరోగ్యా న్ని వారే కాపాడుకోవాలి. కాలేజీలు, పాఠశాలల్లో గత ఐదేళ్లలో క్రీడలు నిర్వీర్యమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యువత, క్రీడాకారులు క్రీడలను కెరీర్‌గా మలుచుకునేం దుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని శాప్ చైర్మన్ రవినాయుడును కోరుతున్నా. రాష్ట్రం లోని 26 జిల్లాల్లో రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహించి నిద్రావస్థలో ఉన్న క్రీడలను తిరిగి వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నాను. రవినాయుడు కష్టాన్ని గత ఐదేళ్లలో రాష్ట్రమం తా చూసింది. శాప్ చైర్మన్‌గా క్రీడారంగాన్ని ముందుకు నడిపించాలి.
క్రీడలను ముందుకు తీసుకెళ్లాలి: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
రవికి శాప్ చైర్మన్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు. రాష్ట్రంలో పెద్దఎత్తున క్రీడలు నిర్వహించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రాష్ట్రంలో ఒలింపిక్స్ నిర్వ హించేలా అవసరమైన స్టేడియాన్ని కూడా నిర్మించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. శాప్ చైర్మన్, క్రీడా శాఖ మంత్రి ఇద్దరూ ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ముందు కెళ్లాలి. వైసీపీ పాలనలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని పేకాట క్లబ్‌గా మార్చారు. వైసీపీ నేతలకు స్టేడియాన్ని కట్టబెట్టి క్రీడలను అవహేళన చేశారు. క్రీడారం గానికి గత వైభవాన్ని తీసుకురావాలని, క్రీడాకారులను ప్రోత్సహించాలని రవినాయుడిని కోరుతున్నాను.
రవినాయుడు కృషి గర్వించదగినది: ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్
యువగళం పాదయాత్ర రాష్ట్రవ్యాప్తంగా ఓ ప్రభంజనం సృష్టించింది. లోకేష్ పాదయాత్ర లో రవినాయుడు చేసిన కృషి గర్వించదగినది. మేం రెండురోజులు పాదయాత్రలో పాల్గొని వారంరోజులు లేవలేని పరిస్థితి ఏర్పడిరది. 200 రోజుల పైనే పాదయాత్రలో యువనేత నారా లోకేష్‌కు చేదోడు వాదోడుగా ఉన్న రవినాయుడికి పార్టీ అధిష్టానం శాప్ చైర్మన్ పద విని ఇవ్వడం అభినందనీయం. కష్టపడిన ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీలో భవిష్యత్తు ఉంటుందని రవినాయుడిని చూస్తే అర్థమవుతుంది. యువగళం, నిజం గెలవాలి, శంఖారా వం కార్యక్రమాల్లో రవినాయుడు, వాలంటీర్లు విశేష సేవలందించారు.
గురుతర బాధ్యత: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆశీస్సులతో అనిమిని రవినాయుడు శాప్ చైర్మన్ అయ్యారు. యువగళం పాదయాత్రను అన్నీ తానై రవి ముందుకు నడిపారు. భవిష్య త్తులో మరిన్ని ఉన్నత స్థానాలకు రవినాయుడు చేరుకోవాలని కాంక్షిస్తున్నాను. శాప్‌ను మరింత ఉత్సాహంతో రవి ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. ఆయన భుజాలపై రాష్ట్ర ప్రభుత్వం గురుతరమైన బాధ్యతను పెట్టింది. రవినాయుడికి క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అవసరమైన సహాయ, సహకారాలు, తోడ్పాటు, ప్రోత్సాహం అందిం చాలని మనవి చేస్తున్నాను.
క్రీడల్లో మహిళలను ప్రోత్సహించాలి: గద్దె అనురాధ
మాజీ కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ మాట్లాడుతూ క్రీడల్లో అత్యధిక పథకాలు సాధించేది మహిళలే.. వారిని మరింత ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. గత పాలకులు యువతకు, విద్యార్థులకు క్రీడలను దూరం చేశారు. ముఖ్యంగా మహిళలకు దూరం చేశా రు. క్రీడల్లో మహిళల ప్రాధాన్యం తగ్గిపోతోంది, దీన్ని సవరించాల్సిన బాధ్యతను శాప్ చైర్మ న్ తీసుకోవాలి. చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా క్రీడారంగానికి పూర్వవైభవాన్ని తెచ్చేందుకు శాప్ చైర్మన్ పనిచేయాలని కోరుతున్నాను. మహిళలకు క్రీడారంగంలో ప్రోత్సా హం, రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా.
దివ్యాంగ క్రీడలను ప్రోత్సహించాలి: గోనుగుంట్ల కోటేశ్వరరావు
యువగళం పాదయాత్రను అడుగడుగునా అడ్డుకునేందుకు వైసీపీ మూకలు చేయని ప్రయ త్నం లేదు. వైసీపీ దుర్మార్గపు ప్రయత్నాలను యువగళం టీమ్, రవినాయుడు ఎప్పటి కప్పు డు తిప్పికొడుతూ పాదయాత్రను ముందుకు నడిపించారు. దివ్యాంగులు ఆడుకుంనేందుకు ఓ మంచి స్టేడియంను నిర్మించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే 30 ఎకరాలు కేటాయించారు. రూ.200 కోట్లతో రాష్ట్రంలోని దివ్యాంగ క్రీడాకారులను ప్రోత్సహించేం దుకు ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. క్రీడాకారులతో పాటు, దివ్యాంగుల క్రీడలను కూడా శాప్ చైర్మన్ ప్రోత్సహించాలని కోరుతున్నాను.
రాష్ట్రానికి క్రీడల్లో పేరు ప్రతిష్టలు తేవాలి: మర్రెడ్డి
టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ శాప్ చైర్మన్ పదవి పదునైన కత్తి మొనమీద నిలబడటం వంటిది. కొన్నిసార్లు శాప్ తీసుకునే నిర్ణయాలు, చిన్నచిన్న తప్పులతో క్రీడాకారుల భవిష్యత్తు తిరగబడిపోయే ప్రమాదముంది. అందుకే రవి నాయుడు చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయక త్వంలో శాప్ నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులు ఏపీ నుంచి వెళ్లేందుకు శాప్ చైర్మన్ కృషి చేయాలని కోరుతున్నాను. రాష్ట్ర నలుమూలల నుంచి ఉత్తమ క్రీడాకారులను వెలికి తీసి రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పే గురుతర బాధ్యత శాప్ చైర్మన్ భుజాలపై ముఖ్యమంత్రి పెట్టారు.
కష్టాలను అధిగమించి నిలిచిన లీడర్ రవినాయుడు
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు ఎంతో నమ్మకస్తుడు, పార్టీ పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి రవినాయుడు. చిత్తూరు జిల్లాలో టీఎన్‌ఎస్‌ఎఫ్, తెలుగుయువత విభాగాలను అనేక కష్టాలు, నిర్బంధాలను అధిగమించి నిలబెట్టిన సమర్థవంతమైన లీడర్. దుర్మార్గపు పాలనపై చేసిన న్యాయబద్ధమైన పోరాటాల్లో 57 అక్రమ కేసులను ఎదుర్కొన్నారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, శాప్ చైర్మన్ రవినాయుడు చాలా టాలెంట్ ఉన్న వ్యక్తులు. శాప్ కు పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు రవినాయుడు కృషి చేయాలని కోరుతున్నాను. చిత్తూ రు జిల్లాలో ఓ మాజీ మంత్రి ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర ఖజానాను దోచుకుంది. రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకుంది. క్రీడారంగానికి అవసరమైన ఫండ్స్ తీసుకొచ్చి క్రీడలకు ఊతమివ్వాలని శాప్ చైర్మన్‌ను కోరుతున్నాను.
యువతకు గౌరవం: ఆలపాటి రాజేంద్రప్రసాద్
రవినాయుడు కష్టానికి ఫలితం దక్కింది. పార్టీలోని యువతకు గౌరవం పెరిగింది. టీడీపీలో ఉన్న నాయకులంతా కార్యకర్తల స్థాయి నుండి ఎదిగిన వారే. శాప్ చాలా ప్రాధా న్యత కలిగిన సంస్థ. క్రీడారంగాన్ని ప్రోత్సహించి క్రీడాకారులను ముందుకు నడిపేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని ఉత్తమ క్రీడా కా రులను వెలికి తీసి, ఈ దేశానికి అందించే బాధ్యతను శాప్ తీసుకోవాలని కోరుతున్నాను. చరిత్రలో నిలిచిపోయేలా శాప్ కార్యక్రమాలు ఉండేలా చూడాలి.
క్రమశిక్షణ కలిగిన నాయకుడు: ఎమ్మెల్సీ భూమిరెడ్డి
ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రవినాయుడి భుజా లపై గురుతర బాధ్యతను పెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పు డు హైదరాబాద్‌లో జాతీయ, అంతర్జాతీయ క్రీడలు నిర్వహించారు. 2019-24 మధ్య క్రీడలు మసకబారిపోయాయి. వైసీపీ పాలకులు క్రీడా రంగాన్ని సర్వనాశనం చేశారు. క్రీడా రంగంలో గత పాలకుల దోపిడీ, దుర్మార్గాలపై సమగ్ర విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలి. రవితో 20 ఏళ్లుగా నా ప్రస్థానం కొనసాగుతోంది..చాలా క్రమశిక్షణ కలిగిన నాయకుడు. గత ఐదేళ్లలో రవినాయుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతిఒక్కరికీ సముచిత గౌరవం, స్థానం దక్కాలని కోరుతున్నాను.
క్రీడలకు మహర్దశ: సీడాప్ చైర్మన్ జి.దీపక్‌రెడ్డి
యువగళం పాదయాత్రలో రవినాయుడు చాలా గొప్పగా పనిచేశారు. క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడు. శాప్ చైర్మన్ రవి, మంత్రి రాంప్రసాద్ రెడ్డి సమన్వయంతో ముందుకెళ్లాలి. క్రీడల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలని కోరుతు న్నాను. రవి సారథ్యంలో క్రీడలకు మహర్ధశ వస్తుందని ఆశిస్తున్నాను.
కష్టానికి తగిన గౌరవం: దామచర్ల సత్య
ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ యువగళంలో రవినాయుడు కీలకపాత్ర పోషించారు. తెలుగుదేశం పార్టీ రవి కష్టానికి తగిన గౌరవం ఇచ్చింది. గ్రామీణ క్రీడలను కూడా శాప్ ప్రోత్సహించాలని కోరారు.
శాప్ పదవి సమంజసం: మల్లిబాబు
యువగళం పాదయాత్రలో లోకేష్ రోజుకు 20 కిలోమీటర్లు నడిస్తే రవినాయుడు 40 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఉండేది. పాదయాత్రను సమర్థవంతంగా ముందుకు నడిపేందుకు ముందుకు, వెనక్కి అనేకసార్లు నడుస్తూ రవి పడిన కష్టాన్ని మేం చూశాం. నామినేటెడ్ పోస్టుల్లో ఆయన పేరును చూసి రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. శాప్ పదవి ఇవ్వడం సమంజసమేనని అభిప్రాయం పెద్దఎత్తున వ్యక్తమైంది. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ మంచి పదవులు, గౌరవం దక్కాలని కోరుతున్నాను.