- క్లాస్‌రూమ్ నుంచి కంపెనీ స్థాపన వరకు
- పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు
- యువతకు ఉద్యోగావకాశాలే మా లక్ష్యం
- విద్యాశాఖ మంత్రి నారా లోకేష్
- అసెంబ్లీలో ప్రైవేట్ స్కిల్ వర్సిటీస్ బిల్లు
అమరావతి(చైతన్యరథం): స్వర్ణాంధ్ర-2047లో 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించాలంటే పెట్టుబడులతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలున్న మానవవనరులు కూడా అవసరమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్ర యువతలో ఉన్న స్కిల్ గ్యాప్‌ను తగ్గించి పరిశ్రమలకు అవసరమైన జాబ్-రెడీ వర్క్‌ఫోర్స్‌ను తయారు చేయడమే లక్ష్యంగా ఏపీ స్టేట్ ప్రైవేట్ స్కిల్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ అండ్ రెగ్యులేషన్ బిల్-2026ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అవసరమైన నైపుణ్యాలు కలిగిన యువత దొరకడం లేదని పరిశ్రమల యజమానులు చెబు తుంటే, నైపుణ్యానికి సరిపోయే ఉద్యోగాలు లేవు అని యువత అంటోందని మంత్రి తెలిపారు. ఈ స్కిల్ గ్యాప్‌ను తగ్గించడమే స్కిల్ యూనివర్సిటీల బిల్లు ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం-2020లో స్కిల్ ఎడ్యుకేషన్‌ను ఉన్నత విద్యతో అను సంధానం చేయాలనే విధానానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందని చెప్పారు.
డిగ్రీతో పాటు పని అనుభవంతో వచ్చేలా చర్యలు
ప్రైవేట్ స్కిల్ యూనివర్సిటీలకు గ్రీన్ ఫీల్డ్‌తో పాటు ఐటీìఐలు, పాలిటెక్నిక్‌లు, ఇప్పటికే ఉన్న సంస్థలను బ్రౌన్ ఫీల్డ్ విధానంలో స్కిల్ యూనివర్సిటీలుగా మార్చే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. స్కిల్ యూనివర్సిటీల పాలనలో ఇండస్ట్రీ ఎంబెడెడ్ డెలివరీ అండ్ గవర్నెన్స్, హబ్ అండ్ స్పోక్ మోడల్‌కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పరిశ్రమలు నేరుగా కోర్సులు, పరికరాలు, శిక్షణ, ఆన్ ది జాబ్ ట్రైనింగ్‌లో భాగస్వాములు కావడానికి మార్గం సుగమం చేస్తున్నామని తెలిపారు. శ్రీ సిటీలో ప్రారంభమైన శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ఉదాహరణగా పేర్కొంటూ జర్మన్ మోడల్ ఆధారంగా 33 శాతం క్లాస్‌రూమ్ లెర్నింగ్, 66 శాతం ఇండస్ట్రీలో అప్రెం టిస్‌షిప్/ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అందించే విధానాన్ని వివరించారు. ఈ విధానం ద్వారా విద్యార్థులు కేవలం డిగ్రీతో కాకుండా పని అనుభవంతో బయటకు వస్తారని తెలిపారు.
నైపుణ్య శిక్షణతో ఉద్యోగావకాశాలు లక్ష్యం
యÖజీసీ గుర్తింపు పొందిన డిగ్రీతో పాటు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇవ్వడం వల్ల ఉద్యోగావకాశాలు మరింత పెరుగుతాయని తెలిపారు. రాయలసీమలో ఫైటర్ జెట్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, సోలార్ వంటి తయారీ రంగాలు పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక అవసరాలకు అనుగుణంగా స్కిల్లింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఉభయగోదావరి ప్రాంతాల్లో ఆక్వా రంగానికి, రాష్ట్రవ్యాప్తంగా తయారీ, ఎనర్జీ, హెల్త్, ఐటీ, హాస్పిటాలిటీ తదితర రంగాలకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ అవసరమని చెప్పారు. సాంప్రదాయ వృత్తుల్లోనూ స్కిల్ అప్‌గ్రేడేషన్‌పై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, లిఫ్ట్ మెకానిక్స్, టూ వీలర్, ఫోర్ వీలర్ మెకానిక్స్ వంటి రంగాల్లో ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. డిగ్రీ ఇచ్చే విద్య నుంచి..ఉద్యోగం ఇచ్చే నైపుణ్య విద్య వైపు రాష్ట్ర ఉన్నత విద్య వ్యవస్థను తీసుకెళ్లడమే ఈ బిల్లు లక్ష్యమని వెల్లడించారు.











