చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

మళ్లీ పట్టాలెక్కిన బ్రాండ్‌ ఏపీ

లోకేష్‌ అమెరికా టూర్‌ గ్రాండ్‌ సక్సెస్‌!

చైతన్యరధం by చైతన్యరధం
November 3, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
మళ్లీ పట్టాలెక్కిన బ్రాండ్‌ ఏపీ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జైత్రయాత్రలా సాగిన పెట్టుబడుల యాత్ర!
  • పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపిన యువ కెరటం

అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ విధ్వంసక విధానాల కారణంగా దారితప్పిన పారిశ్రామిక రంగాన్ని గాడిన పెట్టేందుకు మంత్రి నారా లోకేష్‌ చేస్తున్న కృషి పెట్టుబడిదారుల్లో నూతనోత్సాహం నింపుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి వారం రోజులపాటు యువనేత లోకేష్‌ చేపట్టిన అమెరికా టూర్‌ జైత్రయాత్రలా సాగింది. వారం రోజుల యాత్రలో మంత్రి లోకేష్‌ ఏ దిగ్గజ కంపెనీ వద్దకు వెళ్ళినా రెడ్‌ కార్పెట్‌ స్వాగతం లభించింది. లోకేష్‌లో చంద్రబాబు విజన్‌ను చూసిన పారిశ్రామికవేత్తలు బ్రాండ్‌ ఏపీ మళ్లీ పట్టాలు ఎక్కిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులపై లోకేష్‌ ప్రతిపాదనలను పరిశీలించి త్వరలో గుడ్‌న్యూస్‌ చెబుతామని సంకేతాలిచ్చారు. గత ఐదేళ్లుగా కోడిగుడ్డు కథలతో కాలక్షేపం చేసిన పాలకులకు చూసిన జనం…ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కొలువైన ప్రజాప్రభుత్వం పనితీరుతో బేరీజు వేసుకుంటూ మళ్లీ రాష్ట్రానికి మంచిరోజులు వచ్చాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2025 జనవరిలో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ఆధ్వర్యాన దావోస్‌లో జరిగే పెట్టుబడుల సమావేశం నాటికి లోకేష్‌ చేసిన తొలి ప్రయత్నం సత్ఫలితాలనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐదేళ్ళ పాటు అరాచక పాలనలో శిథిలావస్థకు చేరిన పారిశ్రామిక రంగానికి రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ ఆశాకిరణంలా మారారు.

మంత్రి లోకేష్‌ ఏం చేశారు?
గతనెల 25వ తేదీన అమెరికా పర్యటనకు వెళ్లిన మంత్రి నారా లోకేష్‌ వారం రోజుల పాటు 100 మందికి పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. విజనరీ లీడర్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వాన రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక అమలుచేస్తున్న ఇన్వెస్టర్స్‌ ఫ్రెండ్లీ విధానాలను వివరించి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. వారం రోజులు అవిశ్రాంతంగా సాగించిన సుడిగాలి పర్యటనలో ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీలుగా పేరొందిన మైక్రోసాఫ్ట్‌, టెస్లా, అమెజాన్‌, ఎన్‌ విడియా, యాపిల్‌, గూగుల్‌ క్లౌడ్‌, పెరోట్‌ గ్రూప్‌, రేవేచర్‌, సేల్స్‌ ఫోర్స్‌, ఫాల్కన్‌ ఎక్స్‌, ఈక్వెనెక్స్‌, జడ్‌ స్కాలర్‌, తదితర కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. గత నెల 29వ తేదీన లాస్‌వేగాస్‌లో 23దేశాల నుంచి 2300 చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తలు హాజరైన ఐటి సర్వ్‌ సినర్జీ సమ్మిట్‌కు విశిష్ట అతిధిగా హాజరై రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలను వివరించారు. యుఎస్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌, ఇండియాస్పోరా ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఇదే మంచి తరుణమంటూ చైతన్యాన్ని నింపారు. స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీలో చదవడంతోపాటు ప్రపంచబ్యాంకులో పనిచేసిన అనుభవంతో ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి తాము చేపడుతున్న నిర్మాణాత్మక చర్యలు, డిజిటల్‌ గవర్నెన్స్‌, స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ విధానాలను ఆయా కంపెనీల అధినేతలకు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌పై గత ఐదేళ్లుగా నెలకొన్న దురభిప్రాయాన్ని తొలగించి, పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కలిగించడంలో మంత్రి లోకేష్‌ కృతకృత్యులయ్యారు.
గత 5 ఏళ్లలో ఏం జరిగింది?
రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి ఐదేళ్ల పాలన మొత్తం విధ్వంసమే ఎజెండాగా సాగింది. పరిశ్రమలకు ప్రోత్సాహకాల స్థానంలో కమీషన్ల కోసం వేధించారు. 2014-19 నడుమ విభజిత ఆంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు రేయింబవళ్లు శ్రమించి రాష్ట్రానికి తెచ్చిన పరిశ్రమలు 2019`24 మధ్య వైసీపీ ప్రభుత్వ అరాచకాన్ని భరించలేక పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. కియా ఉన్నతాధికారిని ఎంపీ గోరంట్ల మాధవ్‌ బహిరంగంగానే బెదిరించిన ఘటనను యావత్‌ ప్రపంచం చూసింది. దీంతో రూ.2వేల కోట్ల విలువైన కియా అనుబంధ సంస్థలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. నాటి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశరెడ్డి కమీషన్ల కోసం బెదిరించటంతో అనంతపురం జిల్లా నుంచి జాకీ పరిశ్రమ పరారైంది. చంద్రబాబు కష్టపడి ఒప్పించిన లులూ సంస్థ వైసీపీ పాలకుల అరాచకానికి భయపడి వెళ్లిపోయింది. (చంద్రబాబునాయుడు నేతృత్వంలో తాజాగా ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇటీవలే ఈ సంస్థ మళ్లీ విశాఖకు రావడానికి ముందుకు వచ్చింది.) రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్షమందికి ఉపాధి కల్పించే అమర్‌రాజా బ్యాటరీస్‌ను రాజకీయ కక్షతో వేధించడంతో, ఆ సంస్థ లిథియమ్‌ బ్యాటరీ యూనిట్‌ను తెలంగాణాలో ఏర్పాటు చేసుకుంది. రేణిగుంటలో రిలయన్స్‌ (రూ.15వేల కోట్లు), విశాఖలో అదానీ డేటా సెంటర్‌ (రూ.70వేల కోట్లు), బిఆర్‌ షెట్టి సంస్థలు (రూ.12వేల కోట్లు), ఒంగోలులో ఏపీపీ పేపర్‌ మిల్స్‌ (రూ.24వేల కోట్లు) ఏర్పాటుకు కంపెనీలతో చంద్రబాబు ఒప్పందాలు చేసుకుంటే, వైసీపీ పాలనలో అవన్నీ వెళ్లిపోయాయి. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. గత ఐదేళ్ల చీకటి పాలనలో పెట్టుబడిదారుల్లో నెలకొన్న అభద్రతాభావాన్ని తొలగించి భరోసా కల్పించడం ద్వారా తిరిగి రాష్ట్రానికి రప్పించే గురుతర బాధ్యతను మంత్రి నారా లోకేష్‌ తలకెత్తుకున్నారు.
బాధ్యతలు చేపట్టిన నాటినుంచే ఆపరేషన్‌

వాస్తవానికి రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రిగా ఈ ఏడాది జూన్‌ 24వ తేదీన బాధ్యతలు చేపట్టిన మంత్రి నారా లోకేష్‌ అప్పటినుంచే ఆపరేషన్‌ ప్రారంభించారు. జగన్‌ రివర్స్‌ పాలనలో ఐదేళ్లపాటు రాష్ట్రం వైపు చూడటానికి కూడా భయపడిన పారిశ్రామికవేత్తల్లో విశ్వాసాన్ని నింపేందుకు పలు దఫాలుగా కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) ప్రతినిధులతో చర్చించారు. వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఏపీఈడీబీ (ఏపీ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు) సీఈవో, సీఐఐ ప్రతినిధులు సభ్యులుగా ఏర్పాటైన ఇండస్ట్రీస్‌ కన్సల్టేటివ్‌ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. విశాఖలో రెండుసార్లు ఏపీ ఐటి అసోయేషన్‌ ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి ఆదేశాలు జారీచేశారు. మంత్రి లోకేష్‌ చేపట్టిన చర్యలతో పారిశ్రామికవేత్తలకు నమ్మకం కుదిరింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసేందుకు అమరావతికి వచ్చిన టాటా గ్రూపు చైర్మన్‌ చంద్రశేఖరన్‌తో కేవలం 90 నిమిషాలు భేటీ అయి విశాఖలో టీసీఎస్‌ సంస్థ ఏర్పాటుకు ఒప్పించారు. దీనిద్వారా 10వేల మంది ఐటి నిపుణులకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించి, త్వరలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు టీసీిఎస్‌ ఏర్పాట్లు చేసుకుంటోంది. రాష్ట్రంలో ఫాక్స్‌కాన్‌ సిటీని ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడకు వచ్చిన హెచ్‌సీఎల్‌ సంస్థ ప్రతినిధులతో మంత్రి లోకేష్‌ భేటీ అయ్యాక, మరో 15వేల ఉద్యోగాలు కల్పించేలా సంస్థను విస్తరించేందుకు ఆ సంస్థ సిధ్ధమైంది. బ్రాండ్‌ ఏపీ కోసం కేవలం 4నెలల వ్యవధిలో మంత్రి లోకేష్‌ చేసిన ప్రయత్నాలతో పెట్టుబడిదారుల్లో కొత్త జోష్‌ నెలకొంది.

Previous Post

దీపం పథకం పేద మహిళలకు వరం

Next Post

గ్యాస్‌ ఇవ్వడమే కాదు..టీ కూడా చేసిచ్చిన సీఎం!

Next Post
గ్యాస్‌ ఇవ్వడమే కాదు..టీ కూడా చేసిచ్చిన సీఎం!

గ్యాస్‌ ఇవ్వడమే కాదు..టీ కూడా చేసిచ్చిన సీఎం!

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.