అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో వేగం పుంజుకున్న అభివృద్ధి ఇక నెమ్మదించే ప్రసక్తే లేదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. నెల్లూరు జిల్లా రామాయపట్నం ఓడరేవులో భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ ప్రాజెక్టును బీపీసీఎల్ ఏర్పాటు చేస్తోందన్నారు. ప్రాజెక్టు అవసరమైన భూమిని రికార్డు సమయంలో భూమిని కేటాయించామన్నారు. నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. వేగంతో కూడిన సామర్థ్యమే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతగా మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ పెట్టారు.











