- దేశంలోనే అతిపెద్ద మల్టీ-లేయర్ పీసీబీ తయారీ యూనిట్
- నాయుడుపేట వద్ద ఏర్పాటు చేయనున్న సిర్మా ూGూ
- రూ.1,595 కోట్లు పెట్టుబడి, 2,170 అధిక నైపుణ్య ఉద్యోగాలు
- మంత్రి లోకేష్ వెల్లడి
అమరావతి (చైతన్యరథం): భారతదేశంలోనే అతిపెద్ద మల్టీ-లేయర్ పీసీబీ తయారీ యూనిట్ ఆంధ్రప్రదేశ్‌ను వస్తోందని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడిరచారు. తిరుపతి సమీపంలోని నాయుడుపేట వద్ద కొత్త యూనిట్ ఏర్పాటుకు సిర్మా ూGూ సంస్థ రూ.1,595 కోట్లు పెట్టుబడి పెడుతోందని ఎక్స్‌లో మంత్రి లోకేష్ తెలిపారు. దీంతో మన యువతకు 2,170 అధిక నైపుణ్య ఉద్యోగాలు రానున్నాయి. ఇది కేవలం పెట్టుబడి మాత్రమే కాదు. ఇది మన ప్రజలపై పెట్టుబడిదారుల నమ్మకానికి సంకేతం. మేము ‘‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’’ను కార్యరూపంలోకి తేవడంపై దృష్టి సారించాం. సిద్ధంగా ఉన్న భూమి, నీరు, విద్యుత్ వంటి ప్రాథమిక సదుపాయాలతో పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాం. దీంతో పెట్టుబడిదారులు వేగంగా కార్యరంగంలోకి దిగిపోవచ్చు. నైపుణ్యమైన మానవ వనరులు, పోర్టులకు సామీప్యం వంటి ప్రయోజనాలతో అత్యాధునిక తయారీ పరిశ్రమలకు ఏపీ మొదటి ఎంపికగా నిలుస్తోంది.
‘‘మాకు వేగం కావాలి ` అందుకే ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకున్నాం’’ అని సైర్మా ూGూ మేనేజింగ్ డైరెక్టర్ జె.ఎస్. గుజ్రాల్ పేర్కొనడం.. ‘‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’’కి మించి ‘‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’’ ఏపీ ప్రత్యేకత అనే మన నమ్మకాన్ని ప్రతిధ్వనిస్తోంది. ఈ పెట్టుబడి.. దేశానికి ఏటా దాదాపు 70 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ దిగుమతి వ్యయాన్ని తగ్గించడంలో తోడ్పడటంతో పాటు, స్థిరమైన, విశ్వసనీయ సరఫరా వ్యవస్థను సృష్టిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో శక్తివంతమైన ఎలక్ట్రానిక్స్ తయారీ ఎకో సిస్టంను నిర్మించబోతోంది. ఇది మన రాష్ట్రానికి, మన ప్రజలకు ఒక గర్వకారణమైన మైలురాయిగా మంత్రి లోకేష్ అభివర్ణించారు.












