- త్వరలోనే బాధిత రాష్ట్రాలకు కేంద్ర బృందాలు
- కేంద్రం నుంచి సహకారం అందిస్తామని వెల్లడి
ఢిల్లీ(చైతన్యరథం): తుఫాన్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రు లతో గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్షా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సీఎంలతో ‘సైక్లోన్ ఆర్నబ’ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. కేంద్రం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆరఎఫ్, ఎస్డీఆరఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయన్నారు. యుద్ధప్రాతి పదికన సహాయ, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయని అమిత్షా తెలిపారు. నష్ట తీవ్రతను అంచనా వేసేందుకు త్వర లోనే తుఫాన్ ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర బృందాలు రానున్నట్లు చెప్పారు. ప్రకృతి విపత్తు వేళ బాధితులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు. ఇప్పటికే ఏపీలో ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ రాయడంతో పాటు ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే. తుఫాన్ కారణం గా రాష్ట్రంలో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నట్టు తెలిపారు. తుఫాన్ ప్రభావంతో ఆస్తి, ప్రాణ నష్టం కలగకుండా తీసుకున్న ముందస్తు చర్యలను వివరించారు. త్వరితగతిన తుఫాన్ నష్టంపై అంచనాకు కేంద్ర బృందాలను పంపాలని కోరారు.


