అమరావతి(చైతన్యరథం): ఎన్నికల వేళ జగన్‌రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలు మరింత తీవ్రమయ్యాయని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మండి పడ్డారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్ర వాదంతో వ్యవస్థలను అడ్డుపెట్టు కుని తెలుగుదేశంపార్టీ నాయకుల ను వేధిస్తున్నారు. ఇందులో భాగమే మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అక్రమ అరెస్టు. శరత్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం… వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్ (ఏపీఎస్ డీఆర్‌ఐ) ద్వారా అక్రమ కేసులుపెట్టి టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నా రు. ఏపీఎస్ డీఆర్‌ఐ ఎందుకు ఏర్పాటు చేశారు.. దాని అసలు లక్ష్యా లేమిటి.. మూడేళ్లుగా వాళ్ళు పెట్టిన కేసులెన్ని.. ఎవరెవరిపై కేసులు పెట్టారు అనే వివరాలు ప్రభుత్వం బయటపెట్టగలదా? టీడీపీ నేతల ను వేధించడానికి సీఐడీని తన జేబు సంస్థగా మార్చుకున్నట్లే, ఇప్పుడు ఏపీఎస్ డీఆర్‌ఐ ద్వారా కూడా జగన్ ప్రభుత్వం రాజకీయ కక్షలను తీర్చుకుంటోంది. ఎన్నికల ముంగిట పార్టీ అభ్యర్థులను బలహీన పరి చేందుకే ఈ కుట్రలు. ఏపీఎస్ డీఆర్‌ఐ బెదిరింపులు, వేధింపులు తట్టు కోలేక వివిధ వర్గాల వ్యాపారులు కోర్టుకు వెళ్లింది వాస్తవం కాదా? 40 రోజుల్లో ఇంటికి పోయే వైసీపీ ప్రభుత్వానికి అనుబంధ విభాగ సభ్యులుగా పనిచేస్తే, అధికారులు మూల్యం చెల్లించకతప్పదని ఒక ప్రకటన లో చంద్రబాబు హెచ్చరించారు.