- లోకేష్‌తో కలిసి అడుగులు వేసిన బ్రాహ్మణి, దేవాన్ష్, మోక్షజ్ఞ, భరత్
తుని/పాయకరావుపేట: యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర తుని నియోజకవర్గం తేటగుంట వద్ద చారిత్రాత్మక 3వేల కి.మీ. మైలు రాయి కి చేరుకుంది. 3వేల కి.మీలు అధిగమించిన చారిత్రా త్మక ఘట్టానికి గుర్తుగా తుని యనమల గెస్ట్ హౌస్ వద్ద పైలాన్‌ను లోకేష్ ఆవిష్కరించారు. వైసిపి ప్రభుత్వం కల్పించిన అన్ని అడ్డంకులను అధిగమిస్తూ ప్రజలే సైన్యంగా యువగళం పాదయాత్ర 3000కి.మీ. మైలు రాయికి చేరింది. తుని నియోజకవర్గం తేటగుంట పం చాయతీలో ఈ మజిలీకి గుర్తుగా వైకాపా సర్కారు మూసేసిన పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రారంభిస్తామని హామీ ఇస్తూ శిలా ఫలకం ఆవిష్క రించారు. కార్యక్రమానికి నారా బ్రాహ్మణి, దేవాన్ష్, మోక్షజ్ఞ, శ్రీభరత్, టిడిపి సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, ఉభయగోదావరి జిల్లా ల సమన్వయకర్త ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు హాజరయ్యారు. చారి త్రక మైలురాయి చేరుకున్న సందర్భంగా తేటగుంట జాతీయ రహదారి జనసంద్రంగా మారింది. లోకేష్ తో కలిసి కుటుంబసభ్యులు అడుగులు వేశారు. యువగళం బృందాలు ఆనందంతో కేరింతలు కొట్టాయి. వేలాది కార్యకర్తలు, అభిమానుల రాకతో జాతీయ రహదారి కోలాహలంగా మారింది. లోకేష్ కి సంఫీుభావంగా నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు.
ఉభయ గోదావరి జిల్లాలనుంచి వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలతో పండుగ వాతావరణం నెలకొంది. తుని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద యువనేత లోకేష్‌కు వందలాది విద్యార్థులు సంఫీుభావం తెలియజేస్తూ… సెల్ఫీకోసం పోటీపడ్డారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను లోకేష్ అడిగి తెలుసుకున్నారు. మా ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించి ఇక్కడే ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు. చంద్రబాబునాయుడు నేతృత్వంలో రాబోయే ప్రజాప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని యువనేత లోకేష్ చెప్పారు. టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల కోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదని లోకేష్ భరోసా ఇచ్చారు.