- రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఏర్పాటు
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం
- మానవ అక్రమ రవాణా నిరోధానికి చర్యలు
- జీవో 26 విడుదల చేస్తూ ఉత్తర్వులు
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో అదృశ్యమైన పిల్లల ఆచూ కీ, మానవ అక్రమ రవాణా నిరోధంపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తూ మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ జీవో జారీ చేసిం ది. ఈ మేరకు జీవోఎంఎస్ నెంబర్ 26ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ విడుదల చేశారు. ఈ ఉత్తర్వులను అనుసరించి తదుపరి చర్యలు తీసుకోవాలని గుంటూరులోని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర స్థాయి కమిటీలో సభ్యులు
అదృశ్యమైన పిల్లలు, మానవ అక్రమ రవాణా నిరోధక చర్యల పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో 16 మందితో కమిటీని ఏర్పాటు చేశా రు. రాష్ట్ర స్థాయి కమిటీకి మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి/కార్యదర్శి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. డీజీపీ లేదా అదనపు డీజీపీ (సీఐడీ / మిస్సింగ్ చిల్డ్రన్) కో-ఛైర్‌పర్సన్‌గా ఉంటారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ / డైరెక్టర్ మెంబర్ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. రాష్ట్ర నోడల్ అధికారి, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్‌టీ యూ) ఐజీ/ఎస్పీ స్థాయి అధికారి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. కార్మిక, పాఠశాల విద్య, వైద్య ఆరోగ్య, సాంఘిక, గిరిజన, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ప్రతినిధులు కమిటీలో సభ్యులుగా వ్యవహరించనున్నారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ, రైల్వే పోలీస్ (జీఆర్పీ/ఆర్పీఎఫ్), సైబర్ క్రైమ్/సీసీటీఎనఎస్ విభాగాల ప్రతినిధులతో పాటు ఇద్దరు స్వచ్ఛం ద సంస్థల (ఎన్జీవో) ప్రతినిధులకు చోటు కల్పించారు.
జిల్లా స్థాయి కమిటీలో సభ్యులు
జిల్లాస్థాయిలో 12 మందితో కమిటీని ఏర్పాటు చేస్తారు. ఏపీలోని అన్ని జిల్లాల్లో కలెక్టర్లు/జిల్లా మేజిస్ట్రేట్ల చైర్‌పర్సన్‌గా జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లా కమిటీకి ఎస్పీ ప్రతినిధి కో-ఛైర్‌పర్సన్‌గా, జిల్లా బాలల రక్షణ అధికారి (డీసీపీవో) మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. జిల్లా కమిటీలో ఏహెచ్టీయ, బాలల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ), డీఎలఎసఏ, రైల్వే పోలీస్, కార్మిక, విద్య, ఆరోగ్య శాఖలు, శిశు సంరక్షణ సంస్థలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
కమిటీల ప్రధాన విధులు
రాష్ట్రవ్యాప్తంగా అదృశ్యమైన పిల్లలు, అక్రమ రవాణా కేసుల స్థితిగతులను, ఎఫఐఆర్ల నమోదు, దర్యాప్తు పురోగతిని రాష్ట్ర కమిటీ సమీక్షిస్తుంది. మానవ అక్రమ రవాణాకు అవకాశమున్న సున్నితమైన జిల్లాలు, ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టడంతో పాటు, గ్రామాలు, రవాణా మార్గాలపై జిల్లా కమిటీ లు నిఘా పెట్టనున్నాయి. రక్షించిన పిల్లలను తిరిగి కుటుంబాలకు అప్పగించే ముందు పూర్తిస్థాయి విచారణ జరపడంతో పాటు కుటుంబసభ్యుల ప్రమేయమున్న కేసులను ప్రత్యేకంగా సమీక్ష జరపనున్నారు. రక్షించిన పిల్లల ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ, గుర్తింపు పత్రాల ప్రక్రియను ఈ కమిటీ పర్యవేక్షణ చేయనుంది.
డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థలు, సీసీటీఎనఎస్ అనుసంధా నం, అంతర్రాష్ట్ర సమన్వయ వ్యవస్థలను రాష్ట్ర కమిటీ పర్యవేక్షిస్తుం ది. రక్షించిన పిల్లలకు పునరావాసం, కౌన్సెలింగ్ కల్పించడంతో పాటు, వారిని తప్పనిసరిగా బాలల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ) ఎదుట హాజరు పరచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే జిల్లా, గ్రామస్థాయిల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, జిల్లా కమిటీలు ప్రతినెలా రాష్ట్రస్థాయి కమిటీకి నివేదికలు సమర్పించాల్సి ఉంటుందని సర్కార్ స్పష్టం చేసింది.




















