- గిరిజన కార్పొరేషన్తో కలిసి పనిచేయాలి
- ఎసఎలఎన్ కాఫీ చైర్మన్తో భేటీలో
- మంత్రి నారా లోకేష్ ప్రతిపాదన
విశాఖపట్నం(చైతన్యరథం): ఎలఎలఎన్ కాఫీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ ఎన్.శతప్పన్తో మంత్రి నారా లోకేష్ విశాఖ పట్నంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లా డుతూ మిడిల్ ఈస్ట్, యూరప్, ఆగ్నేయాసియా, రష్యాతో సహా కీలక అంతర్జాతీయ మార్కెట్లకు ప్రీమియం అరకు కాఫీని సేకరిం చాలని కోరారు. అరకు కాఫీ ప్రాసెసింగ్, మార్కెటింగ్, పంపిణీ కోసం ఆంధ్రప్రదేశ్ గిరిజన కార్పొరేషన్తో కలిసి పనిచేయాలని కోరారు. హైవే వెంట ఉన్న వేసైడ్ సౌకర్యాలు, ప్రధాన పట్టణ కేంద్రాల్లో ఎసఎలఎన్ కాఫీ అనుబంధ సంస్థ లెవిస్టా కేఫ్లను ఏర్పాటు చేయాలన్నారు. విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, తిరుపతి పరిసరాలు ఇందుకు అనువుగా ఉంటాయని చెప్పారు. ఎసఎలఎన్ కాఫీ చైర్మన్ శతప్పన్ మాట్లాడుతూ ఎసఎలఎన్ కాఫీ ప్రైవేట్ లిమిటెడ్ కాఫీ కోసం తన సొంత ఇంటిగ్రేటెడ్ తయారీ, ప్రాసెసింగ్, క్యూరింగ్ యూనిట్లను నిర్వహిస్తోంది. తమ సంస్థ సంవత్సరానికి 30 వేల నుంచి 50 వేల మెట్రిక్ టన్నుల (ఎంటీ) వరకు క్యూరింగ్, గ్రీన్ బీన్ ట్రేడింగ్ సామర్థ్యం కలిగి ఉందని చెప్పారు. ఎసఎలఎన్ కాఫీ మొత్తం ఆదాయంలో 80 శాతం పైగా మిడిల్ ఈస్ట్, యూరప్, ఆగ్నేయాసియా, రష్యా, సీఐఎస్ ప్రాంతాల నుంచి వస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదన లను పరిశీలిస్తామని శతప్పన్ హామీ ఇచ్చారు.




















