- అమ్మకాలకు వీలుగా సప్లై చైన్లలో చేర్చండి
- వాల్‌మార్ట్ ప్రతినిధికి లోకేష్ ప్రతిపాదనలు
విశాఖపట్నం(చైతన్యరథం): వాల్‌మార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ అండ్ బిజినెస్ డిప్లొమసీ) పాల్ డైక్‌తో మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో సమావేశమ య్యారు. ఆంధ్రప్రదేశ్ సముద్ర ఆహారం, వస్త్ర వ్యాపారంలో బలమై న భాగస్వామ్యాలు, పెట్టుబడులను అన్వేషించడానికి ఏపీలో జరిగే ఎంఎసఎంఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కొను గోలుదారులను ఏపీకి తీసుకురావాలని లోకేష్ కోరారు. గతంలో న్యూఢిల్లీలో జరిగిన వాల్‌మార్ట్ గ్రోత్ సమ్మిట్ భారతదేశా నికి చెందిన సరఫరాదారులు, వ్యవస్థాపకులు తమ ఉత్పత్తులను వాల్‌మార్ట్ గ్లోబల్ కొనుగోలుదారులకు పరిచయం చేయడానికి సహాయపడిందని గుర్తుచేశారు. స్వయం ఏపీ, లేపాక్షి బ్రాండ్ల కింద స్థానిక కళాకారులు, మహిళలు నడిపే ఎస్‌హెచ్‌జీలను వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ దేశీయ, ప్రపంచ సప్లై చైన్లలోకి ప్రత్యేకంగా చేర్చడానికి మార్గాన్ని సులభతరం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
దీనికి వాల్‌మార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పాల్ డైక్ స్పందిస్తూ ఏపీ రొయ్యల అతిపెద్ద కొనుగోలుదారులలో వాల్‌మార్ట్ ఒకటిగా ఉందని తెలిపారు. సంవత్సరానికి 6.5 కోట్ల పౌండ్లకు పైగా రొయ్యలను తమ సంస్థ కొనుగోలు చేస్తోందన్నారు. దీనితో పాటు రాష్ట్రం నుంచి ఫార్మా, వస్త్రాలు, ఇంజనీరింగ్ వస్తువులు కొనుగో లు చేస్తున్నామని చెప్పారు. ఏపీలో ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే పెట్టిన పెట్టు బడుల వల్ల 28,000కు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ-ఉపాధి అవకాశాలు లభించాయని వివరించారు. సుమారు 12 లక్షల చదరపు అడుగుల మౌలిక సదుపాయాల స్థలం, 0.33 మిలియన్ చదరపు అడుగుల హోల్‌సేల్ స్థలంతో రాష్ట్రవ్యాప్తంగా 100కు పైగా లాజిస్టిక్స్ హబ్‌ల ద్వారా సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఏపీ ఎంఎసఎంఈ కార్పోరేషన్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్)తో ఎంవోయూ మేరకు ఏపీలో 3,200కు పైగా ఎంఎసఎంఈలకు శిక్షణ ఇచ్చామని, వాటిలో 900కు పైగా ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ మార్కెట్ ప్లేస్‌లో చేర్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని పాల్ డైక్ చెప్పారు.




















