- ఏర్పాటుకు కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి
- సీఎం చంద్రబాబుతో భేటీలో జేఆరఐ చైర్మన్
- త్వరలోనే అమరావతిలో ఏపీ-జపాన్ బిజినెస్
- సమ్మిట్ ఏర్పాటుకు ఆలోచిస్తున్నట్లు వెల్లడి
విశాఖపట్నం(చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌లో జపాన్ ఇండస్ట్రి యల్ క్లస్టర్ ఏర్పాటుకు ఆ దేశ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని జపాన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ కెంజీ హిరమత్సూ ముఖ్యమం త్రి చంద్రబాబుకు వివరించారు. అనంతపురం లేదా విశాఖ వద్ద ఈ పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు తమ కంపెనీలు ముందుకు వస్తాయని వెల్లడించారు. ప్రస్తుతం ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రీసెర్చితో కలిసి జేఆరఐ పని చేస్తోందని తెలిపారు. వాణిజ్యం లాజిస్టిక్స్ రంగాల్లో జపాన్ -ఇండియా వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యం కలిగి ఉన్నాయని వివరించారు. 100 బిలియన్ డాలర్ల విలువైన ఢిల్లీ- ముంబై ఇండస్ట్రియల్ కారిడార్‌లో జపాన్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ చొరవతోనే జపాన్ కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నట్టు సీఎంకు తెలిపారు. ఏపీలో విజయవంతమైన శ్రీసిటీ సెజ్ మోడల్లోనే పారిశ్రామిక క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నట్టు కెంజీ స్పష్టం చేశారు.
మారిటైమ్ అభివృద్ధిలో భాగంగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ల లాంటి మౌలిక సదుపాయాల కల్పనలోనూ ఆసక్తిగా ఉన్నట్టు వివ రించారు. ఇన్వెస్టర్ రెడీ ఇండస్ట్రియల్ బ్లూ ప్రింట్స్ రూపకల్పనలో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు జేఆరఐ సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. త్వరలోనే అమరావతిలో ఏపీ-జపాన్ బిజినెస్ సమ్మిట్ ను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నట్టు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం జపాన్ భాగస్వామ్యంతో కలిసి పనిచేసేందుకు ఏపీ సిద్ధంగా ఉందని.. రాష్ట్రంలోని అవకాశాలు, వనరులను అందిపుచ్చుకోవాలని స్పష్టం చేశారు.



















