- భోగాపురంలో సమీపంలో వెల్నెస్ సెంటర్
- సీఐఐ సదస్సులో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం
విశాఖపట్నం(చైతన్యరథం): దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ సీఎం చంద్రబాబును కలిశారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన జాంటీ రోడ్స్ ఏపీ ప్రభుత్వంతో ఒప్పం దం చేసుకున్నారు. భోగాపురం విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేస్తున్న ముక్కం కోస్టల్ వెల్నెస్, సర్ఫ్ క్లబ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. రూ.55 కోట్ల పెట్టుబడితో భోగాపురం సమీపంలోని ముక్కం బీచ్‌లో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది.



















