చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో సీఎం చంద్రబాబు సమగ్ర ప్రజెంటేషన్

by చైతన్యరధం
November 13, 2026
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • 25 రంగాలు.. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు
  • ఈ సదస్సులో 303 ఒప్పందాలు..
  • రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు
  • ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.32.49 లక్షల కోట్లు
  • విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో సీఎం చంద్రబాబు సమగ్ర ప్రజెంటేషన్

విశాఖపట్నం(చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అభివృద్ధి ప్రణాళికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా ఆవిష్కరించారు. పరిశ్రమలు, ఇంధనం, ఎలక్ట్రానిక్స్, రక్షణ, అంతరిక్షం, డేటా సెంటర్లు, పోర్టులు, విమానాశ్రయాలు, రైల్వే లు, సాగునీటి రంగం ఇలా అన్ని అంశాల్లో రాష్ట్రానికి ఉన్న అవకాశాలు, ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలు, ఇప్పటికే సాధించిన పురోగతిని గణాంకాలతో సహా సీఎం వివరించారు. 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులోనే 303 అవగాహన ఒప్పం దాల ద్వారా రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించ నున్నట్లు ప్రకటించారు. జూన్ 2024 నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చిన రూ.22.60 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాద నలకు ఇవి అదనమని వివరించారు. దీంతో రాష్ట్రానికి వచ్చిన మొత్తం పెట్టుబడి ప్రతిపాదనలు రూ.32.49 లక్షల కోట్లకు చేరాయని సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఈ పెట్టుబడులను కేవలం ప్రతిపాదనలకే పరిమితం చేయకుం డా క్షేత్రస్థాయిలో పరిశ్రమల స్థాపన, ఉత్పత్తి, ఉపాధి కల్పన దిశగా తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రజెంటేషన్లో స్పష్టం చేశారు. పెట్టుబడులా ఆకర్షణతో పాటు వాటిని కార్యరూపంలోకి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు సీఎం వివరించా రు. సదస్సుకు ముందు జూన్ 2024 నుంచి రాష్ట్రానికి రూ. 22.60 లక్షల కోట్ల విలువైన 714 ప్రాజెక్టుల ప్రతిపాదనలు వచ్చాయన్నారు. వీటిలో రూ.17.10 లక్షల కోట్ల విలువైన 526 ప్రాజెక్టులకు భూమి, ప్రోత్సాహకాలు తదితర అంశాలకు ఆమో దం లభించిందని వివరించారు. మరో రూ.7.30 లక్షల కోట్ల విలువైన 303 ప్రాజెక్టులు నిర్మాణానికి సిద్ధమయ్యాయని స్పష్టం చేశారు. ఆమోదం పొందిన ప్రాజెక్టుల్లో సంఖ్యా పరంగా 58 శాతం నిర్మాణ సన్నద్ధత దశకు చేరుకోవడం పారిశ్రామిక ప్రణాళిక అమలులో పురోగతిని సూచిస్తోందని ప్రజెంటేషన్లో వివరించారు.

ఇంధనం.. ఎలక్ట్రానిక్స్ అత్యాధునిక సాంకేతికత
పునరుత్పాదక ఇంధన రంగంలో 160 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన వెల్లడించారు. పునరుద్పాదక రంగంలో ఇప్పటికే 114 గిగావాట్ల సామర్థ్యానికి ఆమోదం లభించిందన్నారు. సోలార్ వెఫర్ తయారీ రంగంలోనూ భారీ పెట్టుబడులకు మార్గం సుగమమైందనీ తెలిపారు. 42 గిగావాట్ల సోలార్ సెల్ తయారీ సామర్థ్యంతో పాటు 53 గిగావాట్ల ఇంగట్ వేఫర్ తయారీ సామర్థ్యానికి అనుమతులు ఇచ్చామని వివరించారు. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల తయారీ లో ఏటా రూ.4.20 లక్షల కోట్ల ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ రంగాల్లో ఇప్పటికే రూ.31,926 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్టు స్పష్టం చేశారు. ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో రూ.50 వేల కోట్లు, అంతరిక్ష రంగంలో మరో రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలన్నది ప్రణాళిక అని… ఐదో తరం యుద్ధవిమాన ప్రాజెక్టును కేవలం 36 రోజుల్లో గ్రౌండింగ్ దశకు తీసుకువచ్చినట్లు సీఎం వెల్లడించారు.

డేటా సెంటర్ల ఏర్పాటులో నూ ఏపీ కీలక గమ్యస్థానంగా ఎదుగుతోందని వివరించారు. రాష్ట్రంలో 4.6 గిగావాట్ల డేటా సెంటర్ ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చామనీ ప్రజెంటేషన్లో పేర్కొన్నారు. అమరావతిని అత్యాధునిక సాంకేతికతకు కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో 250 ఎకరాల్లో క్వాంటం కంప్యూటింగ్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. దక్షిణాసియాలో తొలి ప్రాజెక్టుగా అమరావతి క్వాంటం వ్యాలీని అభివృద్ధి చేసి 2027 ఫిబ్రవరి 3న ప్రారంభించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

లాజిస్టిక్స్ లోనూ కీలకంగా ఏపీ
సముద్ర తీరాన్ని రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ప్రధాన వనరుగా మలచుకునే దిశగా పోర్టుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. దేశ పోర్టుల ద్వారా జరిగే సరకు రవాణాలో 20 శాతం వాటాను సాధించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు పోర్టులు పనిచేస్తుండగా, వాటి వార్షిక సరకు నిర్వహణ సామర్థ్యం 346 మిలియన్ టన్నులు గా ఉందన్నారు. 2025–26లో 209 మిలియన్ టన్నుల సరకు రవాణా జరిగింది. సరకు నిర్వహణలో దేశంలో ఏపీ నాలుగో స్థానంలో ఉందని వివరించారు. కొత్తగా నిర్మిస్తున్న నాలుగు పోర్టుల ద్వారా మరో 108 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం అందుబాటు లోకి రానుందన్నారు.

రామాయపట్నం పోర్టును 2027 ఏప్రిల్ నాటికి, మూలపేటను జూన్ నాటికి, మచిలీపట్నాన్ని డిసెంబర్ నాటికి, కాకినాడ గేట్వేను 2028 సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించామనీ స్పష్టం చేశారు. వీటికి అనుబంధంగా మూడు నౌకా నిర్మాణ క్లస్టర్లు, ఏడు కొత్త ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేయనున్నట్టు వివరించారు. దుగరాజపట్నం నౌకా నిర్మాణ క్లస్టర్ను 2028-29 నాటికి సిద్ధం చేయాలనీ ప్రణాళిక చేసినట్టు సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాల్లో వార్షిక ప్రయాణికుల నిర్వహణ సామర్థ్యం 1.55 కోట్లుగా ఉందని 2025-26లో 62 లక్షల మంది ప్రయాణించారని స్పష్టం చేశారు. భోగాపురం, అమరావతి, తిరుపతిని ప్రధాన కేంద్రాలుగా అభివృద్ధి చేస్తూ తొమ్మిది గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల నెట్వర్క్ ను ఏర్పాటు చేయాల నుకుంటున్నా మని తెలిపారు. రాష్ట్రం మీదుగా 839 కిలోమీటర్ల హైస్పీడ్ రైలు కారిడార్లతో పాటు 4,415 కిలోమీటర్ల రైల్వే అనుసంధాన ప్రణాళికలను కూడా ప్రజెంటేషన్లో ప్రస్తావించారు. పోర్టులు, పారిశ్రామిక పార్కులు, విమానాశ్రయాలు, రైల్వే మార్గాలను సమన్వయం చేయడం ద్వారా రవాణా వ్యయాన్ని తగ్గించి, పరిశ్రమలకు మెరుగైన లాజిస్టిక్స్ సదుపాయాలు కల్పించాలన్నది ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు.

జలభద్రతకు పోలవరం.. నదుల అనుసంధానానికి ప్రణాళిక
రాష్ట్ర భవిష్యత్తుకు సాగునీరు, తాగునీటి భద్రత కీలకమని పేర్కొంటూ పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి జాతికి అంకితం చేస్తామని వివరించారు. గోదావరి- పెన్నా కావేరీ నదుల అనుసంధానం ద్వారా సుమారు 200 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ప్రతిపాదన చేశామని తెలిపారు. గోదావరి కావేరి నదుల అనుసంధానంతో ఐదు నదులు, నాలుగు రాష్ట్రాలకు జలభద్రత కల్పించాలన్నది తమ ఆలోచనగా వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రాంతీయ వనరులు, పారిశ్రామిక అవకాశాలను దృష్టిలో పెట్టుకుని 25 రంగాలవారీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు సీఎం తెలిపారు. శ్రీకాకుళంలో కెమికల్ పార్కు, విశాఖపట్నంలో మెర్టెక్ పార్కు అనకాపల్లిలో ఉక్కు అనుబంధ పరిశ్రమలతో పాటు అరుదైన ఖనిజాలు, ఏఐ డేటా సెంటర్ల వంటి రంగాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వివరించారు.

ప్రతి ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతను పారిశ్రామిక అభివృద్ధికి అనుసంధానం చేయడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచాలన్నది ఈ ప్రణాళిక వెనుక ఉన్న ఉద్దేశం అని ఇన్వెస్టర్లకు వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి స్వర్ణాంధ్ర 2047 విజన్ను మార్గదర్శకంగా తీసుకుని ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. పెట్టుబడుల ఆకర్షణ, ఆధునిక సాంకేతికత, పారిశ్రామిక తయారీ, మౌలిక సదుపాయాల విస్తరణ, వ్యవసాయ రంగానికి జలభద్రత.. ఇలా అన్న రంగాలను సమన్వయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యమని తెలిపారు. కేవలం పెట్టుబడుల ఒప్పందాలు చేసుకోవడ మే కాకుండా వాటిని పరిశ్రమలుగా మార్చడం, ఉత్పత్తి పెంచడం, యువతకు ఉపాధి కల్పించడం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా పని చేస్తున్నట్టు స్పష్టం చేశారు.

Previous Post

పెట్టుబడులకు భద్రత… జాతీయస్థాయిలో రక్షణ చట్టం

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 13-11-2026

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 13-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-11-2026

November 13, 2026
పెట్టుబడులకు భద్రత… జాతీయస్థాయిలో రక్షణ చట్టం
ఆంధ్రప్రదేశ్

పెట్టుబడులకు భద్రత… జాతీయస్థాయిలో రక్షణ చట్టం

November 13, 2026
సింగపూర్ సహకారంతో విద్యా శాఖలో సామర్థ్యాల పెంపునకు కృషి
ఆంధ్రప్రదేశ్

సింగపూర్ సహకారంతో విద్యా శాఖలో సామర్థ్యాల పెంపునకు కృషి

November 12, 2026
రూ.632 కోట్లతో ఎత్తిపోతల పథకాల మరమ్మతులు
ఆంధ్రప్రదేశ్

రూ.632 కోట్లతో ఎత్తిపోతల పథకాల మరమ్మతులు

November 12, 2026
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తున్నాం
ఆంధ్రప్రదేశ్

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తున్నాం

November 12, 2026
ఫుడ్ ప్రాసెసింగ్‌కు ఏపీలో అపారమైన అవకాశాలు
ఆంధ్రప్రదేశ్

ఫుడ్ ప్రాసెసింగ్‌కు ఏపీలో అపారమైన అవకాశాలు

November 12, 2026
Next Post
చైతన్యరధం ఈ పేపర్ 13-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 13-11-2026

ముఖ్య వార్తలు

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

by చైతన్యరధం
November 13, 2026

25 రంగాలు.. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఈ సదస్సులో 303 ఒప్పందాలు.. రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.32.49 లక్షల కోట్లు విశాఖ...

పెట్టుబడులకు భద్రత… జాతీయస్థాయిలో రక్షణ చట్టం

పెట్టుబడులకు భద్రత… జాతీయస్థాయిలో రక్షణ చట్టం

by చైతన్యరధం
November 13, 2026

పెట్టుబడిదారులకు నమ్మకం కల్పించడమే లక్ష్యం ప్రభుత్వాల మధ్య వైరుధ్యాలకు వారు బలికాకూడదు రాయితీల కోసం ఎస్క్రో ఖాతాలు తెరుస్తున్నాం వికేంద్రీకరణ ప్రణాళికలతో అభివృద్ధి సంకల్పం పెట్టుబడుల సాధనలోనే...

సామాజిక, ఆర్థిక భద్రతలో ఏపీ ఫ్రంట్ రన్నర్

సామాజిక, ఆర్థిక భద్రతలో ఏపీ ఫ్రంట్ రన్నర్

by చైతన్యరధం
November 10, 2026

యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రెండో స్థానం తలసరి ఆదాయంలో 13వ స్థానం... అయినా అవకాశాల కల్పనలో రెండో స్థానం ఆదాయానికి మించి ప్రజలకు సేవలు, సౌకర్యాలు...

కూటమి ప్రభంజనం

కూటమి ప్రభంజనం

by చైతన్యరధం
November 10, 2026

స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం 58.9 శాతం ఓట్లతో ఘన విజయం (దీన్ని కూడా హైలెట్ చేసుకోవాలి) 2024 ఎన్నికలతో పోలిస్తే 3.6 శాతం పెరిగిన ఓట్ల...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

by చైతన్యరధం
October 27, 2026

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 13-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 13-11-2026

by కార్యకర్త
November 13, 2026

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

by చైతన్యరధం
November 13, 2026

25 రంగాలు.. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఈ సదస్సులో 303 ఒప్పందాలు.. రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.32.49 లక్షల కోట్లు విశాఖ...

పెట్టుబడులకు భద్రత… జాతీయస్థాయిలో రక్షణ చట్టం

పెట్టుబడులకు భద్రత… జాతీయస్థాయిలో రక్షణ చట్టం

by చైతన్యరధం
November 13, 2026

పెట్టుబడిదారులకు నమ్మకం కల్పించడమే లక్ష్యం ప్రభుత్వాల మధ్య వైరుధ్యాలకు వారు బలికాకూడదు రాయితీల కోసం ఎస్క్రో ఖాతాలు తెరుస్తున్నాం వికేంద్రీకరణ ప్రణాళికలతో అభివృద్ధి సంకల్పం పెట్టుబడుల సాధనలోనే...

సింగపూర్ సహకారంతో విద్యా శాఖలో సామర్థ్యాల పెంపునకు కృషి

సింగపూర్ సహకారంతో విద్యా శాఖలో సామర్థ్యాల పెంపునకు కృషి

by చైతన్యరధం
November 12, 2026

ఉపాధ్యాయులు, ఉన్నతాధికారులకు సింగపూర్‌లో శిక్షణ సింగపూర్‌లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు రాష్ట్రంలోని ఇతర ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి డిజిటల్ గవర్నెన్స్, నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ శిక్షణలో సింగపూర్ సహకారం...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.