అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయనటానికి మున్సిపాలిటీల్లో 22,800కు పైగా నామినేషన్లు దాఖలవడమే. నిదర్శనమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. అన్ని వర్గాలు, పార్టీలు, ప్రతి ప్రాంతంనుంచి అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచేందుకు ముందుకొచ్చారని తెలిపారు. ఒక్క ఓటు కూడా పడకముందే ఎన్నికలపై ఆరోపణలు చేసేవారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఎన్నికల్లో గెలుపోటములు నిర్ణయించేది మీడియా సమావేశాలు కాదని, ప్రజాక్షేత్రమేనని పరోక్షంగా వైకాపా అధ్యక్షుడు జగన్కు కౌంటర్ ఇచ్చారు. ప్రజల వద్దకు వెళ్లాలని, అంతిమంగా ప్రజలే తీర్పు ఇస్తారని లోకేశ్ ఎక్స్ పోస్టులో వ్యాఖ్యానించారు.












