- ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రెండు గంటల పాటు చర్చలు
- మేయర్ అభ్యర్థులు, సీట్ల సర్దుబాటుపై ప్రాథమిక వ్యూహరచన
(చైతన్యరథం): అమరావతి రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు అధికార కూటమి కార్యాచరణను వేగవంతం చేసింది. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో స్థానిక ఎన్నికల వ్యూహాలు, కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయంపై సమగ్రంగా చర్చించారు. అంతుకు ముందు చంద్రబాబుతో కలిసి పవన్ కల్యాణ్ అల్పాహార విందులో పాల్గొన్నారు. అనంతరం ప్రధానంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించారు. కూటమిలోని పార్టీల మధ్యస్థానాల సర్దుబాటు, ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలనే అంశంపై చర్చించారు. ప్రాధాన్యత కలిగిన కీలక కార్పొరేషన్లలో మేయర్ అభ్యర్థు లుగా ఎవరినినిలబెట్టాలనే దానిపై ప్రాథమిక అభిప్రాయా నికి వచ్చారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే పూర్తి సమన్వయంతో క్షేత్రస్థాయిలోకి వెళ్లేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని నిర్ణయించారు. స్థానిక పోరులో కూటమి ఐక్యతను చాటుతూ, అన్ని స్థాయిలోనూ అత్యుత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా నాయకులు ఈ వ్యూహరచన చేశారు.















