అమరావతి (చైతన్యరథం): జపాన్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్ – 2026లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ఆర్చరీ కాంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ప్రఖ్యాత ఆర్చర్ వెన్నం జ్యోతిసురేఖ, ఆమె తండ్రి సురేంద్రకుమార్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను సోమవారం ఉండవల్లి లోని ఆయన నివాసంలో కలిశారు. ఏషియన్ గేమ్స్ లో ఇప్పటి వరకు నాలుగు గోల్డ్ మెడల్స్ సహా ఆరు పతకాలు సాధించి సురేఖ. చరిత్ర సృష్టించారు.. ఏషియన్ గేమ్స్ లో తన ప్రతిభతో స్వర్ణం కైవసం చేసుకున్న జ్యోతి సురేఖను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. అంతర్జాతీయ వేదికపై మువ్వన్నెల జెండా రెపరెపలాడించి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. 2028 ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని, అన్ని విధాలా అండగా ఉంటామని లోకేష్ హామీ ఇచ్చారు.













