- గత ఏడు దశాబ్దాల్లో నిర్మించిన వసతులకు మించి ఈ ఐదేళ్లలోనే భారీ నీటి మౌలిక వసతులు
- రాయలసీమ నుంచి ఉద్దానం వరకు ప్రతి ప్రాంతానికీ సురక్షిత తాగునీరు
- ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
ప్రొద్దుటూరు(చైతన్యరథం); తాగునీటి విషయంలో రాజకీయాలకు తావు లేదని… అభివృద్ధి విషయంలో ప్రాంతం, పార్టీ అనే తేడా లేకుండా ప్రజలందరికీ సమాన ప్రాధాన్యత ఇవ్వడమే కూటమి ప్రభుత్వ విధా నమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు, ప్రతి గ్రామా నికీ నీటి భద్రత కల్పించడమే ‘అమరజీవి జలధార’ లక్ష్యమని తెలిపారు. సోమవారం ఆయన సీఎం చంద్రబాబుతో కలిసి కడప జిల్లా ప్రొద్దుటూరులో ‘జల్ జీవన్ మిషన్- అమరజీవి జలధార ప్రాజెక్టులో భాగంగా రూ.30,156 కోట్ల విలువైన తాగునీటి పనులకు శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా పవన్కల్యాణ్ మాట్లాడుతూ… “శ్రీరామచంద్రుని పాదస్పర్శతో పునీతమైన నేల. మహాత్మా గాంధీ నడయాడిన నేల. తెలుగు సాహిత్యా న్ని తన అక్షరాలతో సుసంపన్నం చేసిన సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు కు జన్మనిచ్చిన నేల ప్రొద్దుటూరు, బంగారం, వస్త్ర వ్యాపారంలో మినీ ముంబైగా, దసరా ఉత్సవాల్లో రెండో మైసూరుగా ప్రొద్దుటూరుకు ప్రత్యేక గుర్తింపు ఉంది.’ అన్నారు.
గత మౌలిక వసతులకు భారీగా అదనపు సామర్థ్యం
-1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2024 వరకు రాష్ట్రంలో తాగునీటి మౌలిక వసతుల అభివృద్ధి క్రమంగా జరిగింది. గత ఏడు
దశాబ్దాల్లో నిర్మించిన మౌలిక వసతులతో పోలిస్తే కేవలం ఈ ఐదేళ్లలోనే. ‘అమరజీవి జలధార ద్వారా 50శాతం నుంచి 175శాతంవరకు అదనపు సామర్థ్యాన్ని సృష్టి స్తున్నాం.. రూ.9వేల కోట్లతో 50,283 సింగిల్ విలేజ్ స్కీమ్స్, రెట్రోఫిట్టింగ్ పనులు, రూ.19,500 కోట్లతో 32 మల్టీ విలేజ్ స్కీమ్స్ చేపడుతున్నాం. నీటి నాణ్యత పర్యవేక్షణ కోసం 5. 1,6245 యించాము. ఉద్దానం నుంచి డోన్ వరకు, కర్నూలు
నుంచి కుప్పం వరకు, గండికోట, పీఏబీఆర్, ఏలేరు, తాండవ, హిర మండలం, ధవళేశ్వరం తదితర జలాశయాల ఆధా రంగా తాగునీటిపథకాలను చేపడుతున్నాం. ఉద్దానం, ఎ.కొండూరు వంటి కిడ్నీ సమస్యలు అధికంగా ఉన్న ప్రాంతాలతోపాటు రాయలసీమలోని కరువు ప్రభావిత ప్రాంతాలు, పులివెందుల, పుంగ నూరు, పలమనేరు, గోదావరి ప్రాంతాల్లోని కాలుష్య ప్రభావిత ప్రాంతాలు, మార్కాపురం వంటి ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లోనూ సురక్షితమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం.’ అని పవన్కల్యాణ్ అన్నారు.
నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి
నీటి వనరులకు కొరత లేని ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కూడా తాగునీటి భద్రతను దృష్టిలో పెట్టుకుని రూ.6వేల కోట్లతో జల్ జీవన్ మిషన్ పనులు చేపట్టా ల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆక్వా సాగు, పారిశ్రామిక కాలుష్యం కారణంగా కొన్ని ప్రాంతాల్లో భూగర్భ, ఉప రితల నీటివనరులు కలుషితమవుతున్నాయి. అందుకే నీటి నమూనాలను ఎప్పటికప్పుడు సేకరించి పరీక్షిస్తు న్నాం. కాలుష్యానికి కారణమవుతున్న ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లపై కఠిన చర్యలు తీసుకుంటూ షోకాజ్ నోటీ సులు జారీ చేస్తున్నాం. అదే సమయంలో తాగు నీటి పథకాల్లో నీటిశుద్ధికి కీలకమైన ఫిల్టర్ బెడ్స్ నిర్వహణ కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇప్పటి వరకు రూ.35కోట్లతో 340ఫిల్టర్ బెడ్స్ను పునరుద్ధరించాం. మరో 552 ఫిల్టర్ బెడ్స్ను రూ.88కోట్లతో వునరు ద్ధరిస్తున్నాం. పంప్ హౌస్లు, రిజర్వాయర్లు పైడ్లైన్ల నిర్వహణతో పాటు నీటి నాణ్యతను నిరంతరం పర్య వేక్షించడం, ఇతర అవసరమైన సహాయక కార్య కలాపాల కోసం రూ.1,600కోట్లు కేటాయించాం.
తాళ్లమాపురానికి రూ.3.5 కోట్ల అభివృద్ధి పనులు
ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని తాళ్లమాపురం పంచాయతీ ప్రజలు గత ప్రభుత్వ హయాంలో తమ సమస్యల పరిష్కారం కోసం అనేక ఇబ్బందులు ఎదు ర్కొన్నారని స్థానికులు చెబుతున్నారు. దాదాపు 6వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో రోడ్లు, తాగునీరు వంటి కనీస మౌలిక వసతుల కోసం ప్రజలు పలు మార్లు వినతులు సమర్పించినా, తగిన స్పందన లభించలేదనే ఆవేదన ఉంది. ఇకపై ఇలాంటి పరి స్థితులకు తావు లేకుండా తాళ్లమాపురం, సాగిలి గొడ్డుపల్లి, ముల వారిపల్లి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. దాదాపు రూ.1.5కోట్లతో రెండు కిలోమీటర్ల సీసీ రోడ్లు, మ్యాజిక్ డ్రైన్లు నిర్మించ డంతోపాటు, మరో రూ.2కోట్లతో 90కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన ఓవర్ హెడ్ రిజర్వాయర్, నాలుగు కిలోమీటర్ల పైప్లైన్లు, ప్రత్యేక బోర్వెల్ ఏర్పాటు చేయ సున్నాం. మొత్తం రూ.3, 5కోట్ల విలువైన ఈ పనుల ను తక్షణం చేపట్టాలని అధికారులను ఆదేశిస్తున్నాను.
కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లుల చెల్లింపు
గత ప్రభుత్వ హయాంలో ఉపాధిహామీ, జల్ జీవన్ మిషన్ పథకాలకింద పనులుచేపట్టిన చిన్న, మధ్య తరహా కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగులో ఉండిపోయాయి. దీంతో వారుఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యపై ప్రత్యేక దృష్టిసారించాం. ఎఫ్ఎఐఎఫ్ఎ విధానం లో బిల్లులను సకాలంలో చెల్లిస్తూ కాంట్రాక్టర్లకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాం. 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా పంచాయతీలకు ఎప్పటికప్పుడు విడుదల చేస్తు న్నాం. ఇప్పటివరకు రూ.4,200కోట్లను విడుదల చేశాం. త ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం” అని డిప్యూటీ సీఎం అన్నారు.












